1.7 లక్షల బ్రెజ్జా SUV లను విక్రయించిన మారుతి సుజుకి.. ఏంటీ కారు ప్రత్యేకత..!
మారుతి సుజుకి కార్లకు భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి ఆదరణ కలిగి ఉంది. సరసమైన ధర, డిజైన్ సహా ఇతర ఫీచర్ల కారణంగా చాలా మంది మారుతి సుజుకి కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజా మారుతి సంస్థ కీలక విషయాన్ని వెల్లడించింది. 2023 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన కారు వివరాలను వెల్లడించింది.
1.70 లక్షల యూనిట్ల విక్రయం : మారుతి సుజుకి సంస్థ 2023 సంవత్సరంలో బ్రెజ్జా ఎస్‌యూవీ (Maruti Suzuki Brezza) 1,70,600 యానిట్లను విక్రయించి రికార్డు సృష్టించింది. భారత్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా ధర రూ.8.29 లక్షల నుంచి రూ.14.14 లక్షల (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ వాహనం 15 వేరియంట్లు, 7 రంగుల్లో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు : మారుతి సుజుకి బ్రెజ్జా 5 సీటర్ వెర్షన్ 1.5 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 103ps శక్తి, 137Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. సీఎన్‌జీ వేరియంట్‌లోనూ ఈ కారు అందుబాటులో ఉంటుంది.
మారుతి సుజుకి బ్రెజ్జా మైలేజీ : ఈ CNG వేరియంట్ 88ps శక్తి, 121.5 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బ్రెజ్జా పెట్రోల్ వేరియంట్లు 17.38kmpl- 19.8 kmpl మైలేజీ ఇస్తుంది. అదే సీఎన్‌జీ వేరియంట్ 25.51 km/kg మైలేజీని ఇస్తాయి.

కేవలం మైలేజీ పరంగానే కాకుండా డిజైన్ పరంగానూ మారుతి సుజుకి ఆకర్షణీయంగా ఉంటుంది. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, పాడిల్ షిప్టర్లు, 360 డిగ్రీ కెమెరాలను కలిగి ఉంటుంది.
దీంతోపాటు మెరుగైన సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), సీట్ బెల్ట్ రిమైండర్, పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా కారుకు కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుందాయ్ వెన్యూ బలమైన పోటీదారులుగా ఉన్నాయి. మారుతి సుజుకి జనవరి 1వ తేదీన డిసెంబర్ నెల విక్రయాల నివేదికను వెల్లడించింది. 1.28 క్షీణతను నమోదును చేసినట్లు పేర్కొంది. అయితే ఎర్టిగా, ఫ్రాంక్, గ్రాండ్ విటారా వంటి వాహన విక్రయాల్లో లాభాలను ఆర్జించినట్లు పేర్కొంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








