రూ. 7 లక్షల లోపు లభించే మారుతి కార్లు.. మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలకు మంచి ఆప్షన్‌

ప్రస్తుతం మార్కెట్‌లో వందల సంఖ్యలో కార్లు కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. అయితే భారతీయ మధ్య తరగతి కుటుంబాలకు మారుతి సుజుకి మాత్రం అన్ని కంపెనీల కంటే భిన్నంగా అతి తక్కువ ధరకే కార్లను అందిస్తుంది. అందుకే మిడిల్‌ క్లాస్‌ కుటుంబాలకు అధిక సంఖ్యలో కార్లను విక్రయిస్తున్న కంపెనీగా మారుతి సుజుకి బ్రాండ్‌గా మారింది. ఈ కంపెనీ కార్లను జనాలు ఎక్కువగా కొనుగోలు చేయండంతో ఎప్పుడూ సేల్స్‌లో ముందే ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను జోడిస్తూ కార్లను విడుదల చేయడంతో జనాలు ఎక్కువగా ఈ కార్లకు అలవాటు అయ్యారు. ప్రస్తుతం కేవలం రూ. 7 లక్షల ధరలో మారుతి కొన్ని కార్లను అందిస్తుంది. ఆ కార్ల వివరాలు వాటి ఎక్స్‌ షోరూమ్‌ ధరలు మీకోసం..

ఆల్టోK10: మీరు సిటీ డ్రైవింగ్‌కు అనుకూలమైన మంచి మైలేజీ ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకి ఆల్టో K10 మీకు మంచి ఆప్షన్‌గా ఉంది. చిన్న కుటుంబాలకు అతి చేరువగా పేరుగాంచిన ఆల్టో కె10 పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ కారుగా ఉంది. సిటీలో ఇరుకైన రోడ్లకు ఈ కారు అనువుగా ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 3.99 లక్షలుగా ఉంది.

Maruti-Suzuki-Car-Alto-K10-Price

సెలెరియో: మారుతి సుజుకి ఆల్టో కె10 వలె సెలెరియో మరో బడ్జెట్‌ ఫ్రెండ్లీ కారుగా ఉంది. ఈ కారులో తగిన క్యాబిన్ స్థలంతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇది రోజువారీ ప్రయాణాలకు మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు. మీరు సిటీలో తిరిగేందుకు నమ్మకమైన మరియు ఆర్థికంగా కలిసి వచ్చే కార కోసం చూస్తున్నట్లైతే సెలెరియో మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 5.36 లక్షలుగా ఉంది.

వ్యాగన్‌ఆర్‌: మంచి హెడ్‌రూమ్ సులభమైన యాక్సెస్ కోసం చూసే వారికి వ్యాగన్‌ఆర్‌ బెస్ట్. దీనిలో విశాలమైన క్యాబిన్‌తో ఫ్యామిలీలకు సౌకర్యంగా ఉంటుంది. ఎక్కువ హైట్ ఉండే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. పొడవాటి డిజైన్ సులభంగా ప్రవేశించడానికి మరియు బయటకు వెళ్లడానికి ఉంటుంది. వ్యాగన్‌ఆర్‌ మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీని ధర రూ. 5.54 లక్షలుగా ఉంది.

Maruti-Suzuki-Car-Wagonr-Price

ఇగ్నిస్‌: తక్కువ ధరలో భారీ డిజైన్‌ ఉండే కారు కోసం చూస్తే ఇగ్నిస్ సరైన ఆప్షన్‌గా ఉంది. ఈ యూత్‌ఫుల్ కారు మిని ఎస్‌యూవీగా పేరు గాంచింది. ఈ ధరలో లభించే కార్లతో పోల్చితే ఇగ్నిస్‌ బెస్ట్‌ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. యువ కొనుగోలుదారులకు లేదా బేసిక్ కారును కోరుకునే వారికి ఇది బాగా సరిపోతుంది. దీని ధర 5.84 లక్షలుగా ఉంది.

స్విఫ్ట్‌: మారుతి సుజుకి స్విఫ్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్‌లో పేరొందిన హ్యాచ్‌బ్యాక్‌గా ఉంది. దీని స్పోర్టీ లుక్‌, ఆహ్లాదకరమైన డ్రైవింగ్, విశాలమైన క్యాబిన్ మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ స్విఫ్ట్‌లో అనేక రకాల ఫీచర్లు మరియు ఇంజిన్ ఆప్షన్‌లు ఉన్నాయి. రోజువారీ వినియోగానికి సౌకర్యవంతమైన మరియు వివిధ అవసరాలకు స్విఫ్ట్ బెస్ట్‌ ఆప్షన్‌. దీని ప్రారంభ ధర రూ. 6.49 లక్షలుగా ఉంది.

Maruti-Suzuki-Car-Swift-Price

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 28, 2024, 17:58 [IST]
English summary
Maruti suzuki cars under rs 7 lakhs best option for middle class families
Read more on: #maruti suzuki #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+