ఈ కారులో 5 మంది ఇబ్బంది లేకుండా పోవచ్చు.. ధర రూ. 4.99 లక్షలు, మైలేజీ 34.43 కి.మీ

ఎంట్రీ లెవల్‌ కార్లను అందించడంలో మారుతి సుజుకిని మించిన కంపెనీ ఇండియాలో లేదు. ఆ సంస్థ నుంచి అందించే కార్లు దాదాపు అందుబాటులో ధరలో ఉంటాయి. వీటిని ఎక్కువగా మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీలు కొనుగోలు చేస్తుంటారు. ఆ సంస్థ నుంచి మారుతి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో 2014లో లాంచ్ చేసింది. ఈ కారు విడుదలైనప్పటి నుంచి మార్కెట్‌లో మంచి డిమాండ్‌తో దూసుకెళ్తుంది. ఈ కారు అందించే ఫీచర్లు, డిజైన్‌ తదితర అంశాలు ఆసక్తిగా ఉండటంతో జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ప్రస్తుతం భారతదేశంలో రూ .4.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అమ్మకానికి ఉంది. ఈ కారు ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రే, సాలిడ్ ఫైర్ రెడ్, స్పీడ్ బ్లూ, కెఫిన్ బ్రౌన్ అనే కలర్‌ ఆప్షన్స్‌లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ కారు మంచి మైలేజీని ఇస్తుంది. కారులో ఉండే ఫీచర్లు ఇతర అంశాలు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Maruti-Celerio-Features-And-Price

డిజైన్: సెలెరియో డిజైన్ విషయానికి వస్తే ఆకర్షణీయమైన గ్రిల్, రివైజ్డ్ బంపర్, సర్క్యూలర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన సిగ్నేచర్ లోగో, లో ట్రిమ్స్ సాధారణ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇక టాప్ వేరియంట్లు బ్లాక్‌ కలర్‌లో 15 ఇంచెస్‌ అల్లాయ్ వీల్స్‌తో వస్తాయి. ఈ మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ LXi, VXi, ZXi, ZXi ప్లస్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పెట్రోల్‌పై లీటరుకు 25.17 కిలోమీటర్ల నుంచి 26.23 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇక కొత్త సెలెరియోలో డ్రైవర్ మరియు ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్‌, వెనుక డోర్లలో చైల్డ్ ప్రూఫ్ లాక్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి.

Maruti-Celerio-Price

వీటితో పాటు సీట్ బెల్ట్ రిమైండర్, ఏబిఎస్ విత్‌ ఇబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా మారుతి సుజుకి సెలెరియోలో ఆపిల్ కార్ ప్లే, స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి కొత్త మరియు అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌తో పాటు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్ కూడా ఉంది.

కొత్త టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కాల్ అండ్ మ్యూజిక్ అసిస్ట్‌తో కూడిన మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ మరియు సర్క్యూలర్‌ డిజిటల్ స్క్రీన్ ఉన్నాయి. ఈ కారు హెడ్‌లైట్‌ డిజైన్‌ని కూడా ఇటీవలె అప్‌డేట్ చేశారు. బీఎస్‌ 6 2.0-కంప్లైంట్‌తో వస్తుంది. 1.0-లీటర్ న్యాచ్‌రల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Maruti-Celerio-Interior

ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంది. ఇది గరిష్టంగా 66 bhp పవర్ మరియు 89 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు మాన్యువల్ గేర్‌బాక్స్‌తో సెలెరియో సీఎన్‌జీ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం సేల్స్‌లోనూ ఈ కారు రాణిస్తుంది. తక్కువ ధరలో భారీ డిజైన్‌తో పాటు మంచి ఫీచర్ల కోసం కారు కొనాలని చూస్తే ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉండనుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, July 29, 2024, 14:40 [IST]
English summary
Maruti suzuki celerio best buy for new buyers features and specification details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+