కేవలం రూ. 4.99 లక్షలకు 33 కి.మీ మైలేజీ ఇచ్చే ఏకైక లిమిటెడ్ ఎడిషన్ కారు!
మారుతి సెలెరియో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది. దీనికి మార్కెట్‌లో ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. పొట్టి కార్ల విభాగంలోనే ఈ కారు భారీ మైలేజీని అందిస్తుంది. భారతదేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్లలో ఒకటిగా ఉంది. దీనికి ఉన్న డిమాండ్ కారణంగా గత నెలలో అంటే 2024 నవంబర్‌లో మొత్తం 2,379 యూనిట్ల సెలెరియో హ్యాచ్‌బ్యాక్స్ అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి ఈ కారుని ప్రతీ నెల సగటున 2,000 కంటే ఎక్కువ మొత్తంలో విక్రయిస్తోంది. ఈ కారు అమ్మకాలను మరింత పెంచుకోవడానికి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారుకి సంబంధించిన టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు, మైలేజీ, ధర వంటి వివరాల కోసం ఇక్కడ చూడండి..
ఈ లిమిటెడ్ వేరియంట్ రూ .11,000 విలువైన ప్రత్యేక యాక్సెసరీ ప్యాకేజీతో కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. పైన చెప్పినట్లుగా ఈ కారు ప్రీమియం బైక్స్ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కారుతో పోల్చితే సుమారు రూ.11,000 విలుల చేసే కాస్మెటిక్, ఫీచర్ యాక్ససరీలతో ఇది మరింత అందంగా కనిపిస్తుంది. ఎక్స్‌టీరీయర్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ ఇందులో భారీ తేడాలు గమనించవచ్చు.

ఫీచర్లు: మారుతి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ కూడా ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కలదు. దీంతో పాటు కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇంజిన్: ఈ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ 1.0-లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 66 bhp వద్ద 89 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ కారులో బై-ఫ్యూయల్ CNG ఆప్షన్ లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇది సీఎన్‌జీ వెర్షన్‌లో 56 bhp పవర్, 82.1 nm టార్క్‌ని విడుదల చేస్తుంది.

మైలేజీ: కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కార్లలో మారుతి సుజుకి సెలెరియో కారు ఒకటి. ఈ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్‌లో లీటరుకు 24.8 కిలోమీటర్లు, పెట్రోల్ AMT మోడ్‌లో 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక ఈ సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 32.85 కిలోమీటర్ల భారీ మైలేజీని ఇస్తుంది.
ధర: ఈ మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ ధర రూ .4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మాత్రమే కావడం గమనార్హం. ఈ హ్యాచ్‌బ్యాక్ మీ డబ్బుకి తగిన వ్యాల్యూని అందిస్తుంది. రెగ్యూలర్ వెర్షన్స్‌తో పోలిస్తే ఇందులోని యాక్సెసరీస్ కారుకి అదనపు ఆకర్షణగా ఉంటాయి. అయితే ఈ ఆఫర్ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక స్టైలింగ్ కోసం చూసేవారు దీనిని కొనుగోలు చేయవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








