రూ. ఐదున్నర లక్షలకే 35 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతీ కారుకు ఫుల్ డిమాండ్.. షోరూమ్‌కి వెళ్లడమే ఆలస్యం

మారుతీ సుజుకీ(Maruti Suzuki) ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉంది. దీని నుంచి విడుదలైన వాహనాలు అన్ని నగరాల నుంచి మొదలుకుని పట్టణాలు, గ్రామాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా భారతదేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటుంది. దీంతో బడ్జెట్ రేంజ్‌లో లభించే కార్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో మారుతీ కంపెనీ ప్రజలు కొనగలిగే అందుబాటు ధరలో కార్లను లాంచ్ చేస్తూ, ఇండియన్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాదిలో మెరుగైన అమ్మకాలను సాధించిన కంపెనీ ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాల డేటాను విడుదల చేస్తుంది. తాజాగా తన ఫేవరెట్ మోడల్ సెలెరియో (celerio) విక్రయాల వివరాలను వెల్లడించింది. గతంలో కంటే కూడా ఈ కారుకు మరింత ఎక్కువ డిమాండ్ పెరిగింది. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ ఉన్న మోడల్‌గా హ్యాచ్‌బ్యాక్(hatchback) సెలెరియో నిలిచింది.

మారుతీ సుజుకీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, నవంబర్ 2024 నెలలో సెలెరియో అమ్మకాలు 2,379 యూనిట్లుగా ఉన్నాయి. అదే ఇది గత ఏడాది 2023 ఇదే నెలలో 2,215 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఏడాది ప్రాతిపదికన ఇది దాదాపు 7 శాతం వృద్ధి చెందింది. ముఖ్యంగా 2024 ఏడాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో సెలెరియో టాప్-10లో 9వ స్థానంలో నిలిచింది.

Maruti Suzuki Celerio

సెలెరియో వినియోగదారులకు చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది. అలాగే, మైలేజ్ కూడా ఎక్కువగానే వస్తుంది. అందుకే జనాలు ఈ హ్యాచ్‌బ్యాక్ కొనుగోలుపై ఆసక్తి కనబరిచారు. భారతీయ మార్కెట్లో సెలెరియో అత్యంత డిమాండ్ ఉన్న కారుగా అవతరించింది. దీని ప్రారంభ LXi వేరియంట్ ధర రూ. 5.37 లక్షల నుంచి ఉంటుంది. అదే టాప్ వేరియంట్ ZXI+ AGS ధర రూ.7.04 లక్షలుగా ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్‌ షోరూమ్ ధరలు.

ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.10 లక్షల లోపే ఉండటం కారణంగా తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలని అనుకున్న వారు సెలెరియో‌ను తమ మొదటి ఎంపికగా భావించారు. ఇది cng వెర్షన్లో కూడా లభిస్తుంది. దీని మైలేజ్ కిలోకు 34.43 కి. మీటర్ల వరకు వస్తుంది. సిట్రోయెన్ సి3, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ వంటి కార్లు కాకుండా వేరే కారు కొనాలనుకునే వారు ఈ సెలెరియోను ఎంచుకోవచ్చు.

Maruti Suzuki Celerio Sales

సెలెరియో ఇంజిన్ గురించి చూసినట్లయితే 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 67 PS పవర్, 89 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అదే విధంగా CNG వేరియంట్ 57 PS పవర్, 82 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌లో మాత్రమే లభిస్తుంది.

సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌లో పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్, మాన్యువల్ AC, కీలెస్ ఎంట్రీ, ప్రయాణికుల భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, EBDతో కూడిన ABS సిస్టం వంటివి ఉన్నాయి. ఇది సాలిడ్ ఫైర్ రెడ్, గ్లిస్టనింగ్ గ్రే, కెఫిన్ బ్రౌన్, ఆర్కిటిక్ వైట్,బ్లూయిష్ బ్లాక్,స్పీడీ బ్లూ, సిల్కీ సిల్వర్ అనే ఏడు కలర్స్‌లలో కొనుగోలుకు ఉంటుంది.

మధ్యతరగతి వారు ఇటీవల కాలంలో తమ లైఫ్‌స్టైల్‌ను క్రమంగా మార్చుకుంటున్నారు. బైకులను ఏ విధంగా కొనుగోలు చేశారో, ఇప్పుడు కార్లు కలిగి ఉండటం కూడా ఒక స్టేటస్‌గా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ ధరలో, అలాగే ఎక్కువ మైలేజ్ ఇచ్చే సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ప్రయాణికుల భద్రత పరంగా కూడా ఇది అత్యుత్తమైనది.

More from DriveSpark

Article Published On: Monday, December 16, 2024, 11:27 [IST]
English summary
Maruti suzuki celerio november 2024 sales 7 percent growth details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+