రైళ్లలో వెళ్తున్న మారుతి కార్లు.. బోలెడంతా డబ్బు ఆదా.. సరికొత్త రికార్డు నమోదు!

ప్రపంచవ్యాప్తంగా కార్ల వినియోగం పెరుగుతోంది. అందులో భాగంగా కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. కార్లను బుక్‌ చేసుకున్న తర్వాత వేగంగా డెలివరీలు చేసేందుకు సకాలంలో కస్టమర్లకు అందించేందుకు డీలర్లు ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగా కంపెనీలు సైతం దేశవ్యాప్తంగా డీలర్లకు తమ వాహనాలను రవాణా చేయడానికి ఆటోమొబైల్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. గతంలో వీటిని చేరవేర్చేందుకు ఎక్కువగా ట్రక్కులను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు పెరిగిన డిమాండ్‌ ఆధారంగా కానీ ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనేక ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను డీలర్‌షిప్‌ల వద్దకు చేర్చడానికి రైళ్లను ఉపయోగించడం ప్రారంభించాయి. ఇందుకోసం భారతీయ రైల్వే ప్రత్యేక రాయితీలు సైతం అందిస్తోంది. దీంతో రైల్వే సంస్థ ఇప్పుడు ఆటోమొబైల్ తయారీ సంస్థలకు ప్రధాన రవాణాగా మారింది.

ఆటోమొబైల్ తయారీదారులు వాహనాలు (ట్రక్కులకు) బదులు రైల్వేలను ఉపయోగించడం ద్వారా అనేక ప్రయోజనం పొందుతున్నారు. ముఖ్యంగా ట్రక్కులలో వాహనాలను పంపేటప్పుడు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. పైగా ఖర్చు కూడా చాలా ఎక్కువే. అయితే రైల్వేలలో పంపిస్తే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే మారుతి సుజుకి భారతీయ రైల్వేలను ఉపయోగించి డీలర్‌షిప్‌కి చేర్చడాన్ని విస్తరించింది.

Maruti-Suzuki-Indian-Railway-Transport

మారుతి సుజుకి ఇప్పటివరకు భారతీయ రైల్వేను ఉపయోగించి దేశవ్యాప్తంగా 2 మిలియన్లకు (20 లక్షలకు) పైగా వాహనాలను పంపింది. 2014-15లో రైళ్ల ద్వారా 65,700 యూనిట్లను పంపిన ఈ సంస్థ ఇప్పుడు లక్షలాది వాహనాలను ట్రాన్స్‌ఫోర్ట్‌ చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 4,47,750 యూనిట్ల వాహనాలను మారుతి సుజుకి డీలర్లకు పంపించింది.

దేశంలో ఇప్పటి వరకు కీలకమైన 20కి పైగా కేంద్రాలకు అక్కడి నుంచి 450కి పైగా ఇతర ముఖ్య నగరాలకు కార్లను తరలిస్తున్నారు. ఫ్యాక్టరీలోకి రైళ్లను తీసుకురావడం ద్వారా వాహనాలను ఎగుమతి చేసిన దేశంలోని మొదటి కంపెనీగా మారుతి సుజుకి నిలిచింది. మారుతి సుజుకి సంస్థ ఇప్పటివరకు 2 మిలియన్ల వాహనాలను రైళ్ల ద్వారా పంపించినట్లు వెల్లడించింది.

Maruti-Suzuki-Indian-Railway

అంతేకాక, రైలు సేవను ఉపయోగించడం ద్వారా కంపెనీ చాలా ఇంధనాన్ని ఆదా చేసినట్లు వెల్లడించింది. రైల్వే సర్వీస్‌ల ద్వారా నేరుగా డీలర్‌షిప్‌లకు చేర్చుతుండటంతో ఇదే విధానాన్ని మారుతి పాటిస్తుంది. ఇప్పటి వరకు 270 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని మారుతి సుజుకి ఆదా చేసింది. అంతే కాదు ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా కంపెనీ వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించింది.

సుమారు 10,000 మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించినట్లు మారుతి పేర్కొంది. మారుతి సుజుకి త్వరలో రైలు రవాణా వ్యవస్థను తదుపరి స్థాయిలో తరలించాలని యోచిస్తోంది. అంటే 2 మిలియన్ల నుంచి 4 మిలియన్లకు పెంచేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తిగా ఇదే రవాణా విధానాన్ని ఎన్నుకోవాలని భావిస్తోంది. 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది.

Maruti-Suzuki-Indian-Railway-Dispatch

ఈ లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యంతో కంపెనీ ఇటీవల ప్రణాళికలో రైల్వే సైడింగ్‌ని (ప్లాంట్‌ వద్దకే) అభివృద్ధి చేసింది. గుజరాత్ ప్లాంటులోనే ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించారు. ఈ సదుపాయంతో మారుతి సుజుకి సంవత్సరానికి 3 లక్షల వాహనాలను పంపగలదు. నేరుగా ప్లాంట్‌ నుంచి ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు.

ప్రస్తుతం భారత్‌లో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మారుతి సుజుకి వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రైళ్లను ఉపయోగించి ఎక్కువ కార్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఫలితంగా కంపెనీ లాభాలు, వాయుకాలుష్యం గణనీయంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది. అంతే కాదు వాహనాలను చాలా సురక్షితంగా డీలర్ల వద్దకు పంపిస్తున్నారు.

కార్లను సురక్షితంగా తరలించేందుకు రైల్వే సంస్థ బోగీలను కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఇది కార్లపై చిన్న చిన్న గీతలు కూడా లేకుండా ప్రయాణించడానికి సహాయపడుతుంది. మారుతి సుజుకి ఈ రైలును ఎక్కువగా ఉపయోగించడానికి కారణం ఖర్చు, ఉద్గారాలు ఇతర విషయాలు సానుకూలంగా ఉండటం వల్ల ఈ విధానాన్ని ఎంచుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 9, 2024, 11:14 [IST]
English summary
Maruti suzuki dispatches 20 lakh vehicles through indian railways full details in telugu
Read more on: #maruti suzuki #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+