ఈ తోపు కారు కోసం ఏకంగా విదేశీయుల నుంచి డిమాండ్..! దీనికి అంత స్పెషల్ ఎందుకో తెలుసా!
ఇండియాలో దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా తన కార్లను విక్రయిస్తుంది. ఇతర వాహనాల కంపెనీలకు పోటీగా తన మోడళ్లలో అధునాతన ఫీచర్లు, మెరుగైన భద్రత అంశాలు అందిస్తుంది. ఇదిలా ఉంటే, ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎలాంటి రక్షణ ఇస్తుందా అని తన కారుపై నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఏకంగా మంచి రేటింగ్ కనబరించింది. ఆ మోడల్ పేరు అప్‌డేటెడ్ 'మారుతీ సుజుకీ డిజైర్(maruti suzuki dzire)'. ఇది ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న కారు. పాత మోడల్‌కు దేశ ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉండగా, ఇటీవల అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారు డిజైన్, ఫీచర్లతో కస్టమర్లకు దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంతటి డిమాండ్ ఉన్న ఈ కారుకు తాజాగా గ్లోబల్ ఎన్ క్యాప్(Global NCAP) క్రాష్ టెస్ట్ నిర్వహించారు.
ఈ టెస్ట్‌లో డిజైర్ కారు అంచనాలను అందుకుని 5 స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో ఇది ప్రయాణికుల భద్రత పరంగా సురక్షితమైన కారుగా నిలిచింది. ముఖ్యంగా గ్లోబల్ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్లు పొందిన మొదటి మారుతీ కారుగా సరికొత్త ఘనతను సాధించింది. ఈ కంపెనీ నుంచి గతంలో 3 స్టార్ రేటింగ్ సాధించిన మోడల్ ఉండగా, ఇప్పుడు డిజైర్ విదేశాల్లో భద్రత పరంగా అత్యుత్తమైన కారుగా నిలవడం గమనార్హం.

భారత్‌లో విజయవంతంగా వృద్ధిని కనబరుస్తున్న మారుతీ ఈ టెస్ట్‌లో సక్సెస్ సాధించడంతో ఇకపై విదేశాల్లో కూడా మెరుగైన అమ్మకాలను నమోదు చేయడానికి అవకాశం ఏర్పడినట్లయింది. అక్కడి వినియోగదారుల్లో కూడా ఈ డిజైర్ కారు భద్రత పరంగా సురక్షితమైనదని నమ్మకం ఏర్పడి విదేశీయుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. సాధారణంగా మారుతీ కంపెనీ కార్లన్నీ కూడా భద్రత పరంగా పేలంగా ఉంటాయని చాలా విమర్శలు ఎదుర్కొంటుంది.
ఈ కంపెనీ నుంచి వచ్చే ఉత్పత్తులు తక్కువ భద్రతా ప్రమాణాలను కలిగి ఉంటాయని, ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు రక్షణ ఉండదని కొంత టాక్ ఉంది. కంపెనీ తక్కువ సేఫ్టీ ఫీచర్లను అందిస్తుందని విమర్శలు ఎదుర్కొంటుండగా, వీటన్నింటి నుంచి బయటపడటానికి మారుతీ తన కార్లలో అత్యుత్తమైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. ఇప్పుడు దీన్ని రుజువు చేస్తూ అప్‌డేటేడ్ డిజైర్ 5 స్టార్ సాధించడం గమనార్హం.

గతంలో మారుతీ కార్లు అంతర్జాతీయంగా నిర్వహించిన గ్లోబల్ N క్యాప్ క్రాష్ టెస్ట్‌లో విఫలమయ్యాయి. దీంతో పట్టువదలకుండా ప్రయత్నిస్తూ గ్లోబల్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైర్‌ను రూపొందించి విజయం సాధించింది. ఇప్పుడు విదేశీ వినియోగదారులను కూడా తన వైపు తిప్పుకోవడానికి ఈ రేటింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మోడల్ పట్ల వారికి బలమైన నమ్మకం ఏర్పడటానికి అవకాశం లభించింది.
ఈ గ్లోబల్ NCAP టెస్ట్‌లో వచ్చిన ఫలితాలను బట్టి వాహనం ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎలాంటి రక్షణ అందిస్తుందనేది తెలుస్తుంది. ఈ పరీక్షలో 5 స్టార్ రేటింగ్ వచ్చిందంటే విదేశాల్లో కూడా వినియోగదారులకు నమ్మకమైన వాహనంగా ఒక అభిప్రాయం ఏర్పడి నమ్మకంతో వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇండియాలోనే కాకుండా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్ వంటి ప్రాంతాల్లో ఈ టెస్ట్ ఫలితాలు అమ్మకాల పరంగా ఎఫెక్ట్ చూపిస్తాయి.

టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన కార్లను అంతర్జాతీయంగా ఎగుమతి చేసి మార్కెట్‌ను విస్తరించడానికి వీలవుతుంది. దీంతో ఈ కారు అమ్మకాలు ఆయా దేశాల్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా క్రాష్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు Bncap టెస్ట్‌లో కూడా 5 స్టార్ రేటింగ్‌ను సాధిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








