5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కారును 1.51 లక్షల మంది కొన్నారు.. ఏళ్లు గడుస్తున్న సరికొత్తగా వస్తూనే ఉంది

భారత్‌లో కార్ల తయారీలో టాప్ ప్లేస్‌లో ఉన్నటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) తక్కువ ధరలో అందరు కొనగలిగే విధంగా బడ్జెట్‌లో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందిస్తూ, దశాబ్ద కాలంగా ఇండియాలో తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ప్రతి ఏడాది కొత్త కొత్త ఫీచర్లతో అదిరిపోయే స్టైలిష్ డిజైన్‌తో మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ముఖ్యంగా మారుతీ సుజుకీ నుంచి కార్లను మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వారి రోజువారీ అవసరాలకు ఉపయోగకరంగా వాహనాలను కంపెనీ లాంచ్ చేస్తుండటంతో సేల్స్ మెరుగ్గా ఉంటున్నాయి. తాజాగా మారుతీ నుంచి సమాచారం ప్రకారం, భారత్‌లో అందరి ఫేవరెట్ సెడాన్ మోడల్ మారుతీ సుజుకీ డిజైర్ (Dzire) సేల్స్‌లో దూసుకుపోతుంది. కొన్నేళ్ల క్రితం విడుదల అయిన మోడల్ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్తగా అప్‌డేట్ అవుతూ తిరిగి వస్తూనే ఉంది. కంపెనీ సేల్స్ పెరగడానికి ఈ మోడల్ అత్యంత కీలకం.

డిజైర్ కారు దేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కనిపిస్తుంది. ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా పట్టణాలు, మండల ఏరియాలో, ముఖ్యంగా గ్రామాల్లో కూడా ఇది ఉంటుంది. భారతదేశంలో ఈ సెడాన్ అత్యంత ప్రజాదరణ పొందింది. డిజైర్ సేల్స్ చూసినట్లయితే, 2024 జనవరి నుంచి మొదలుకుని నవంబర్ నెల వరకు 1,51,415 మంది దీన్ని కొనుగోలు చేశారు. ఈ రేంజ్‌లో డిమాండ్ రావడం ఉండటం అంటే సాధారణ విషయం కాదు.

Maruti Suzuki Dzire Sedan 151425 units Sales

పాత డిజైర్ సెడాన్‌లో కొన్ని అప్‌డేట్‌లు చేసి కంపెనీ నవంబర్ 11వ తేదీన సరికొత్త డిజైర్‌ను విడుదల చేసింది. ఆ తరువాత భారత మార్కెట్లో ఈ మోడల్‌కు డిమాండ్ మరింత పెరిగింది. ఇది పాత డిజైర్ కంటే మరింత మెరుగ్గా పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది. భద్రత కోసం అధునాతన సేఫ్టీ ప్రమాణాలు, ఫీచర్లు కొత్త మోడల్‌లో ఉన్నాయి. దీని ధర రూ.6.79 లక్షల నుంచి రూ. 10.14 లక్షల(ఎక్స్ షోరూమ్)గా ఉంది.

నవంబర్‌లో విడుదల అయిన మారుతీ సుజుకీ డిజైర్ నాల్గవ తరం మోడల్. ఇండియా మార్కెట్లో సాధారణంగా SUV మోడళ్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అయినప్పటికి కూడా సెడాన్ సెగ్మెంట్‌‌కు ఆదరణ క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా SUVల కాలంలో కూడా డిజైర్ సెడాన్ ఎక్కువ సేల్స్‌ను సాధిస్తుండటం అంటే ఈ కారుకు ఇండియాలో ఎంత గొప్ప మోడల్‌గా పేరు ఉందో తెలిసిపోతుంది. కొత్త తరం కారు ప్రస్తుతం సేల్స్‌లో దూసుకుపోతుంది.

Maruti Suzuki Dzire Sedan Features Sales

ఇప్పటికే భారత మార్కెట్లో వాహనాల తయారీ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉంది. సేల్స్ ఎక్కువ సాధించడానికి నువ్వా నేనా అన్నట్లుగా కొత్త ఫీచర్లతో, స్టైలిష్ డిజైన్ల‌తో కార్లను విడుదల చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మారుతీ సుజుకీ డిజైర్ 11 నెలల కాలంలో 1.51 లక్షల యూనిట్లు అమ్ముడు పోవడం అంటే ఈ సెడాన్‌కు భారత ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను తెలియజేస్తుంది.

నాల్గవ తరం మారుతీ డిజైర్ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కారులో లేటెస్ట్ సదుపాయాలు చాలా ఉన్నాయి. సరికొత్త క్యాబిన్, ఉల్లాసపరిచే ఇంటీరియర్ థీమ్ వంటివి కారులో ఉన్నాయి. లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కంఫర్ట సీట్లు, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్, అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్‌బెల్ట్ వంటివి ఉన్నాయి.

Suzuki Dzire Sedan Sales 1 51 Lakh Sales

డిజైర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 81.58PS పవర్, 111.7Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఆటోమెటిక్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. అదే cngలో అయితే 5-స్పీడ్ మాన్యూవల్ ఉంటుంది. ఇది 69.75PS పవర్, 101.8 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కార్.

More from DriveSpark

Article Published On: Monday, December 30, 2024, 12:30 [IST]
English summary
Maruti suzuki dzire sedan sales crosses 151425 units
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+