మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తుంది.. ఎలా ఉంది, ధర ఎంత ఉండనుందో తెలుసా?
దేశంలో మారుతి సుజుకి నంబర్.1 గా కొనసాగుతోంది. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లు భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. అయితే ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ వినియోగం పెరుగుతోంది. దేశంలో టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్, మహీంద్రా ఈవీ కార్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ బడ్జెట్ ధరలో లభించే మారుతి సుజుకి మాత్రం ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఒక్క కారుని కూడా తీసుకురాలేదు. పెట్రోల్ లేదా సీఎన్‌జీ కార్లకు ధీటుగా ఎలక్ట్రిక్ కార్లను జనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో సుజుకి ఇటీవలె eవిటారాను ఆవిష్కరించింది.
తాజాగా సుజుకి ఆవిష్కరించిన ఈ కారు భారత్‌లో త్వరలోనే అడుగుపెట్టనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే (జనవరి 2025)లో కొత్త ఇ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. తాజాగా ఈ కారుని హర్యానాలోని గురుగ్రామ్‌లో టెస్ట్‌డ్రైవ్ చేస్తుండగా కనిపించింది. దీనికి సంబంధించిన స్పై ఫోటోలు (మూలం: Rushlane) వైబ్‌సైట్‌లో కనిపించాయి. ఈ ఫోటోలలో కారును పూర్తిగా ప్లాస్టిక్ కవర్‌తో కప్పేశారు.

అయినా కానీ కారు డిజైన్ స్పష్టంగా కనిపించింది. ఈ కొత్త మారుతి సుజుకి ఇ విటారా సైడ్ ఫ్రొఫైల్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, MRF టైర్లు, ముందు భాగంలో ఎడమ వైపు ఫెండర్‌పై ఛార్జింగ్ పోర్ట్ కనిపించింది. దీనితో పాటు రూఫ్‌లైన్ కొద్దిగా స్లోప్‌గా కిందకు జారినట్లు ఉంది. వెనుక కూడా 'వై' ఆకారంలో టెయిల్ లైట్స్‌ని చూడవచ్చు. ఓవరాల్‌గా దీని డిజైన్ సరికొత్తగా కనిపించినుంది.
పైన చెప్పిన విధంగా ఇప్పటికే దీనిని ఇటలీలోని మిలాన్ ఆటో షో 2024లో ఈ కొత్త ఇ విటారా ఎస్‌యూవీని ప్రదర్శించారు. ముఖ్యంగా ఈ కారు 2,700 mm వీల్‌బేస్, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. ఇది 5 సీటర్ ఆప్షన్‌లో కొనుగోలుకి అందుబాటులోకి రానుంది. ఈ మారుతి సుజుకి ఇ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర, ఇతర ఫీచర్లు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ కొత్త మారుతి ఇ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 49 కిలోవాట్స్, 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇది ఫుల్ ఛార్జ్‌పై 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇంది 2WD (టూ వీల్ డ్రైవ్) లేదా 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీతో రానుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 4WDతో వస్తే దీనికి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది.
ఈ కారులో వివిధ ఫీచర్లను జోడించే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్ సెటప్, ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), ఆటో హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఇవే కాకాకుండా మరిన్నీ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో రానుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యర్థి కార్ల వలె కనిష్ట ధర రూ .20 లక్షల నుంచి గరిష్టంగా రూ .25 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇది టాటా నెక్సాన్, కర్వ్ ఈవీ లకు, మహీంద్రా ఎక్స్‌యూవీ 400, BE 6e ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








