మారుతీ సుజుకీ ఈ-విటారా.. ప్రత్యర్థి కంపెనీలకు మధ్య బ్యాటరీ, ధర, ఇతర ఫీచర్ల తేడాలు ఇవే!

దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఇతర కంపెనీలతో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. ఇప్పటికే టాటా, కియా వంటి కంపెనీలు పలు ఈవీ కార్లను విడుదల చేయగా, అవన్ని కూడా విజయవంతమైన మోడల్స్‌గా మార్కెట్లో పేరు సంపాదించాయి. అయితే మారుతీ సుజుకీ మాత్రం ఈవీల పరంగా వెనుక వరుసలో ఉండగా తాజాగా ఈ విభాగంలో కూడా తన సత్తాను చాటడానికి ఇతర కంపెనీలకు పోటీగా దేశంలో కొత్తగా మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి ప్లాన్ చేసింది. ఈ మోడల్ పేరు 'ఈ- విటారా(E Vitara)'. ఇది 2025 ఏడాదిలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని రాకతో ఈవీ కార్ల పరంగా వివిధ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంటుంది.

ముఖ్యంగా ఈ-విటారా కారు ఎంజీ జేడ్‌ఎస్ ఈవీ(MG ZS EV), టాటా కర్వ్వ్ ఈవీ(TATA Curvv Ev), బీవైడీ అట్టో 3( BYD Atto 3) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఈవీలకు ఇండియాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్యాటరీ పనితీరు, వీటి డిజైన్స్‌ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

E Vitara Vs Curvv Zs Atto 3

మారుతీ సుజుకీ ఈ- విటారాలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయని అంచనా. మొదటిది 49kWh, రెండోది 61kWh. పెద్ద బ్యాటరీ ఆప్షన్‌లో కారు సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 500 కి.మీకు పైగా రేంజ్ అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అదే ప్రత్యర్థి కంపెనీ బీవైడీకి చెందిన అట్టో3 మోడల్ సింగిల్ ఛార్జింగ్‌తో 521 కి.మీల రేంజ్‌ ఇస్తుంది, అదే మరో మోడల్ టాటా కర్వ్ ఈవీ 502 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. మరో మోడల్ ఎంజీ జేడ్ఎస్ ఈవీ 461కి.మీల రేంజ్‌ను ఇస్తుంది.

సైజ్ విషయానికి వస్తే, ఈ- విటారా, ఇతర మోడళ్లతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తన ప్రత్యర్థి కార్ల కంటే మధ్యస్థంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ- విటారా 4275 మిమీ పొడవు, 1800 మిమీ వెడల్పు, 1635 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. అదే కర్వ్ ఈవీ.. 4310 మిమీ పొడవు, 1810 మిమీ వెడల్పు, 1637 మిమీ ఎత్తును కలిగి ఉంది.

జేడ్‌ఎస్ ఈవీ.. 4323 మిమీ పొడవు, 1809 మిమీ వెడల్పు, 1649 మిమీ ఎత్తు, అదే బీవైడీ అట్టో 3..4455 మిమీ పొడవు, 1875 మిమీ వెడల్పు, 1615 మిమీ ఎత్తును కలిగి ఉన్నాయి. వీల్‌బేస్‌ పరిమాణం చూసినట్లయితే ఈ- విటారా 2700 కాగా, దీని కంటే ఎక్కువగా అట్టో 3 మోడల్‌ది 2720గా ఉంది.

ధరల విషయానికి వచ్చినట్లయితే, టాటా మోటార్స్‌కు చెందిన కర్వ్ ఈవీ బ్యాటరీ ఆప్షన్లను బట్టి ప్రారంభ ధర రూ. 17.49 లక్షల నుంచి రూ. 21.99 లక్షల మధ్య ఉంది. అదే, ఎంజీ జేడ్‌ఎస్ ఈవీ ధర రూ. 18.98 లక్షల నుండి రూ. 25.75 లక్షల వరకు ఉంది.

బీవైడీకి చెందిన అట్టో 3 ధర రూ. 24.99 లక్షలతో ప్రారంభమై రూ. 33.99 లక్షల వరకు ఉంది. అయితే మారుతీ సుజుకీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోడల్ ఈ విటారా 49kWh బ్యాటరీ ఎంపిక ధర రూ. 20 లక్షల నుండి మొదలవుతుంది.

అలాగే పెద్ద బ్యాటరీ 61kWh వేరియంట్‌కు రూ. 25 లక్షల వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిలో AWD వెర్షన్ రూ. 30 లక్షల వరకు చేరుకోవచ్చని తెలుస్తుంది. లాంచ్ సమయంలో ధరల్లో స్వల్ప మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, November 9, 2024, 12:10 [IST]
English summary
Maruti suzuki e vitara vs tata curvv mg zs byd atto 3 full details check here
Read more on: #india #auto
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+