నెలకు రూ. 10000 ఈఎంఐతో ఫ్యామిలీ మొత్తం ఈ కారులో వెళ్లవచ్చు.. డౌన్‌ పేమెంట్‌ కూడా తక్కువే!!

మారుతి సుజుకి కార్లు సామాన్యులకు అందుబాటులో ధరలో ఉంటాయి. ఈ కార్లకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా కంపెనీ వివిధ రూపాల్లో కొత్త మోడళ్లను తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఆ సంస్థ తీసుకువచ్చిన మిని వ్యాన్‌ కార్లకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. ఈ కారులో 7 ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు.

అదే మారుతి ఈకో. దీని ధర చాలా తక్కువ లాభాలు ఎక్కువ. దీనిపై కుటుంబం అంతా కలిసి సులభంగా ప్రయాణించవచ్చు. దూర ప్రయాణాలు లేదా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు ఈ మిని వ్యాన్‌ కారు మంచి అనుభూతిని అందిస్తుంది. సీటు సీటుకి మధ్య ఎక్కువ స్పేస్ ఉండటంతో ప్యాసింజర్స్‌ ఎలాంటి అసౌకర్యానికి గురవ్వరు. ఇతర వాణిజ్య అవసరాలకు సైతం ఈ కారుని వాడుకోవచ్చు.

Maruti-Suzuki-Eeco

గతంలో ఇలాంటి మోడళ్లలో ఎన్నో కార్లను మారుతి విడుదల చేసింది. ఈ కార్లు భారతీయులకు సుపరిచితమే అని చెప్పాలి. ప్రస్తుతం వస్తున్న మోఢిఫికేషన్లతో అధునాతన ఫీచర్లను జోడించి ఈ ఈకో కారుని సంస్థ విడుదల చేసింది. ఈ కారుని చాలా తక్కువ ధరలో ఇంటికి తీసుకువెళ్లవచ్చు. ఈ కథనంలో ఈ కారు సంబంధించిన ఈఎంఐ, డౌన్ పేమెంట్స్ గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఈకో ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ .5,32,000 వద్ద విడుదల చేసింది. అయితే తెలంగాణ ఆర్టీవో ట్యాక్స్ దాదాపు రూ.74,480గా ఉంది. ఈ కారు ఇన్సూరెన్స్ ధర హైదరాబాద్‌ ఎక్స్-షోరూమ్‌లలో సుమారు రూ.39,372గా గమనించవచ్చు. అంటే ఈ కారు ధర ఓవరాల్‌గా ఆన్‌ రోడ్‌ ధర రూ.6,49,487 నుంచి రూ.6,51,436గా ఉంనుంది.

Maruti-Suzuki-Eeco

మారుతి సుజుకి ఈకో ఈఎంఐ డౌన్ పేమెంట్ కనీసం రూ.1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఏడు సంవత్సరాల పాటు ఈఎంఐని లెక్కిస్తే 9.8% వడ్డీ రేటుతో మీరు కారుని సొంతం చేసుకోవచ్చు. అంటే సుమారు 7 సంవత్సరాల కాలానికి లోన్‌ తీసుకుంటే, మీరు నెలకు సుమారు రూ.10,707 బ్యాంకుకు ఈఎంఐగా చెల్లించాలి.

ఈ కారుని ఎక్కువగా ఇష్టపడటానికి కారణం ఈ కారులో ఐదు నుంచి ఏడుగురు సులభంగా ప్రయాణించవచ్చు. మరో కారణం దాని ధర చాలా తక్కువ ఉండటం. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ .5.72 లక్షల నుండి రూ .6.53 లక్షల వరకు ఉంటుంది. మారుతిలోని ఇతర ఎర్టిగా కారుని తీసుకోవడానికి సరిపడా బడ్జెట్ లేనివారు మారుతి ఈకోను కొనుగోలు చేయవచ్చు.

Maruti-Suzuki-Eeco

మారుతి సుజుకి ఈకో వ్యాన్ (మారుతి సుజుకి ఈకో) 5 సీట్ల స్టాండర్డ్ (ఓ), 5-సీటర్ ఎసి (ఓ), 5-సీటర్ ఎసి సిఎన్జి (ఓ) మరియు 7-సీటర్ స్టాండర్డ్ (ఓ) వేరియంట్లలో లభిస్తుంది. మెటాలిక్ గ్లిట్టరింగ్ గ్రే, పెర్ల్ మిడ్నైట్ బ్లాక్, మెటాలిక్ బ్రిస్క్ బ్లూ, మెటాలిక్ సిల్కీ సిల్వర్ వంటి 5 మోనోటోన్ రంగుల్లో ఇది లభిస్తుంది.

ఈ మారుతి సుజుకి ఈకో పెట్రోల్ మరియు సీఎన్జీ ఇంజన్‌ ఆప్షన్లతో రానుంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 81 పిఎస్ శక్తిని, 104.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది. వ్యక్తిగత లేదా ఇతర వాణిజ్య అవసరాల కోసం చూసేవారికి మారుతి ఈకో మంచి ఆప్షన్‌.

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2024, 9:59 [IST]
English summary
Maruti suzuki eeco down payment and emi options details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+