రెండ్రోజుల్లో టయోటా నుంచి మరో అదిరిపోయే కారు.. పిచ్చెకిస్తున్న టీజర్‌ ఫొటోలు

భారత్‌లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా(Toyota) తన బ్రాండ్ పేరుతో మారుతి సుజుకికి చెందిన కొన్ని కార్ మోడళ్లను రీ-బ్యాడ్జ్ చేసి విక్రయిస్తున్న విషయం తెలిసిందే. డిజైన్, ఫీచర్ల పరంగా కొన్ని మార్పులు చేస్తూ మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ దశలో, టయోటా మారుతి యొక్క రీ-బ్యాడ్జ్డ్ కార్ మోడల్‌కు మరో కారు మోడల్‌ను జోడించడానికి యత్నిస్తోంది.

తాజాగా టయోటా.. మారుతి(Toyota-Maruti Rebadged) కొత్త రీ బ్యాడ్జ్ కారు మోడల్ టీజర్‌ను సంస్థ విడుదల చేసింది. ఈ సారి, టయోటా.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మోడల్‌ను రీ-బ్యాడ్జ్ చేసి విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. అర్బన్‌ క్రూయిజర్‌ టైజర్‌(Urban Cruiser Taisor) పేరుతో టయోటా ఈ కారును తీసుకురానుంది.

Toyota-Urban-Cruiser-Taisor-Teaser-Reveal

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు రీ-బ్యాడ్జ్‌ వెర్షన్‌గా వస్తున్న టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టైజర్‌(Toyota Urban Cruiser Taisor)ను సంస్థ ప్రస్తుతం డీజిల్ వెర్షన్‌లో విడుదల చేయనుంది. ప్రస్తుతం టీజర్‌ను విడుదల చేయగా.. ఇది ఆటో ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 3 న ఈ కారు అధికారికంగా లాంచ్‌ కానుంది. కాగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఒక క్రాస్ఓవర్ SUV మోడల్.

టయోటా ఈ కారును ఎలాంటి మార్పులతో విక్రయానికి తీసుకువస్తుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. తాజాగా విడుదలైన టీజర్ చిత్రాలను బట్టి చూస్తే, టయోటా కేవలం బ్యాడ్జ్‌లను మార్చలేదని తెలుస్తోంది. డిజైన్‌(Maruti Suzuki Fronx) పరంగా చాలా మార్పులకు గురైనట్లుగా ఉంది. గ్రిల్, హెడ్‌లైట్, వెనుక లైట్ సెటప్ మరియు రూఫ్‌ల్లో మార్పులను చూడవచ్చు.

Toyota-Urban-Cruiser-Taisor-Teaser-Reveal

ఎక్స్‌టీరియర్‌ పరంగా కూడా టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టైజర్‌ మరిన్ని మార్పులతో ఆకర్షణీయంగా ఉంది. ఈ కారణంగా ఇది ఫ్రాంక్స్‌ కారు కంటే భిన్నంగా ఉంటుంది. ఇంటీరియర్‌ పరంగా కూడా గణనీయమైన మార్పులను ఆశించవచ్చు. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్ మరియు సీట్లలో మార్పులు ఉన్నట్లుగా సమాచారం.

ఫీచర్ల పరంగా Urban Cruiser Taisor లో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లేను ఆశించవచ్చు. అయితే ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. అందువల్ల టైజర్‌లో కూడా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ కార్ మోడల్‌లోని అదే ఇంజిన్ మరియు గేర్ ఆప్షన్లను కలిగి ఉండొచ్చు.

Toyota-Urban-Cruiser-Taisor-Teaser-Reveal

భారత మార్కెట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌.. పెట్రోల్ మరియు CNG మోటార్ ఆప్షన్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ అమ్మకానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి పోటీగా ఉండనుంది.

గత కొంత కాలంగా ప్రముఖ కార్ల తయారీదారులు మారుతీ సుజుకి మరియు టయోటా కూటమి కింద ప్లాట్‌ఫారమ్‌లు మరియు టెక్నికల్‌ స్పెసిఫికేషన్లను పంచుకుంటున్నాయి.. అందుకని, రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను మార్చుకంటూ రీబ్యాడ్జ్‌ వెర్షన్‌లో కస్టమర్లకు మరిన్ని అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి తెస్తున్నాయి.

Toyota-Urban-Cruiser-Taisor-Teaser-Reveal

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 1, 2024, 15:31 [IST]
English summary
Maruti suzuki fronx based toyota urban cruiser taisor teaser revealed ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+