ఫేమస్‌ మారుతి కారుపై అదిరిపోయే డిస్కౌంట్స్‌.. ఎంత తగ్గనుందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!!

దేశంలో మారుతి సుజుకి కార్లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. అందువల్ల ఈ కారు కంపెనీ భారతదేశపు అతిపెద్ద వాహన తయారీదారుగా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో వివిధ రకాల హ్యాచ్‌బ్యాక్స్‌, సెడాన్లు, ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. సరసమైన ధరలో మంచి డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు అందిస్తుండటంతో ఎక్కువగా మిడిల్‌ క్లాస్‌ వాళ్లు ఈ కంపెనీ కార్లను ఎక్కువగా కొంటున్నారు. మారుతి కూడా ఎక్కువ మిడిల్‌ క్లాస్‌ కస్టమర్లనే టార్గెట్‌ చేస్తూ మార్కెట్‌లో కొత్త కార్లను విడుదల చేస్తుంది. అయితే ఆ కంపెనీ లైనప్‌లో మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx)) పేరొందిన ఎస్‌యూవీగా ఉంది. బాలెనో తర్వాత ఎక్కువగా సేల్‌ అయ్యే కార్ల జాబితాలో ఈ ఎస్‌యూవీ కూడా ఉంది.

ఆగస్టులో మారుతి కార్లపై కంపెనీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మారుతి నెక్సా లైనప్‌లోని జిమ్నీ, బాలెనో, ఫ్రాంక్స్‌, ఎక్స్‌ఎల్‌6, సియాజ్‌, ఇగ్నిస్‌, గ్రాండ్‌ విటారాలపై భారీ ఆఫర్లను అందిస్తుంది. ఎంచుకున్న మోడల్‌ని బట్టి రూ.10,000 నుంచి రూ. 2.5 లక్షల వరకు తగ్గింపుని అందిస్తుంది. ఇందులో మారుతి ఫ్రాంక్స్‌పై లభిస్తున్న బెనిఫిట్స్‌ని మనం ఈ కథనంలో తెలుసుకోబోతున్నాం.

Maruti-Suzuki-Fronx

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌పై మొత్తం రూ .13,000 నుంచి రూ .43,000 తగ్గింపు లభిస్తుంది. టర్బో వేరియంట్స్‌పై రూ. 30000 డిస్కౌంట్‌తో పాటు రూ. 43,000 విలువ చేసే వెలాసిటీ ఎడిషన్‌ యాక్సెసరీస్‌ కిట్‌ని అందిస్తున్నారు. బేస్ వేరియంట్‌ సిగ్మా (ఎంటీ)పై రూ.3,060 విలువ చేసే వెలాసిటీ ఎడిషన్ యాక్సెసరీ కిట్‌తో పాటు రూ. 22,500 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ని అందిస్తున్నారు.

అంతే కాకుండా రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ లేదా రూ .15,000 ఆప్షనల్ స్క్రాపేజ్ బోనస్ ఆప్షన్‌ని కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు. సాధారణ పెట్రోల్ వేరియంట్లను (డెల్టా, డెల్టా ప్లస్)లపై రూ.20,000ల వరకు క్యాష్ డిస్కౌంట్, పెట్రోల్ ఏఎంటీ వేరియంట్లపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా మిగతా ఆఫర్లలో ఎలాంటి మార్పు లేదు.

Maruti-Suzuki-Fronx-Cars-Discount

ప్రస్తుతం ఈ కారు ధర రూ.7.51 లక్షల నుంచి రూ.13.04 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంది. ఈ ఫ్రాంక్స్ కారు నెక్సా బ్లూ, ఎర్త్ బ్రౌన్, ఆర్కిటిక్ వైట్ వంటి వివిధ కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. వీరిలో ఐదుగురు హాయిగా కూర్చొని సుదూర ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఇందులో 308 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్‌ని కూడా కలిగి ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో పనిచేస్తుంది. దీని 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100ps పవర్ మరియు 148 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 ps శక్తిని మరియు 113 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక సీఎన్‌జీ ఆధారిత వేరియంట్ అదే 1.2-లీటర్ ఇంజిన్‌తో వస్తుంది.

సీఎన్‌జీ ఇంజిన్‌ గరిష్టంగా 77.5 ps శక్తిని మరియు 98.5 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్లు అన్ని 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇది లీటరుకు 20.1 నుంచి 28.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు బాలెనోను పోలిన డిజైన్‌లో ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీలో 9 ఇంచెస్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ప్రయాణీకులకు భారీ సేఫ్టీని అందిస్తుంది. ఇందులో 6-ఎయిర్ బ్యాగ్స్‌, ABS (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) కలిగి ఉంది.

ఈ కారు కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. పైన తెలిపిన డిస్కౌంట్స్‌ డీలర్‌షిప్‌లను బట్టి మారే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం మీ సమీప షోరూమ్‌ని సందర్శించండి వంటివి చేయాలి.

More from DriveSpark

Article Published On: Monday, August 12, 2024, 14:40 [IST]
English summary
Maruti suzuki fronx discounts on august check price drops here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+