మన దేశంలో తయారైన కారుకి విదేశాల్లో బ్రహ్మరథం.. ఇంతకీ ఆ కారులో స్పెషల్ ఏముందీ?
దేశంలో మారుతి నంబర్ 1 కార్ల తయారీ సంస్థగా ఉంది. ఈ కంపెనీ చెందిన కార్లను కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ తగినట్లుగానే మారుతి కూడా ఉత్పత్తి సామార్థ్యంపై ఎప్పటికప్పుడూ ఓ అంచనా వేస్తుంది. ప్రస్తుతం దేశంలో ఈ సంస్థకు మూడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో హర్యానాలో రెండు, గుజరాత్‌లో ఒక ప్లాంట్ ఉంది. హర్యానాలోని మనేసర్ లోని ప్లాంట్ ద్వారా ఇప్పటికే కోటి వాహనాలను తయారు చేశారు. గత వారంలోనే ఈ మైలురాయిని మారుతి సుజుకి సాధించింది. మన దగ్గర తయారైన మారుతి సుజుకి కార్లను విదేశాలకు సైత మారుతి ఎగుమతి చేస్తోంది. విదేశాల్లో ఈ మారుతి కార్లకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది.
కొన్ని నెలల క్రితం, కంపెనీ తన ఫేమస్ కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన ఫ్రాంక్స్‌ని జపాన్‌కి ఎగుమతి చేయడం ప్రారంభించింది. మారుతితో భాగస్వామ్యంగా ఉన్న సుజుకి సొంత దేశమైన జపాన్‌కి రవాణా చేసిన మొట్టమొదటి భారతీయ తయారీ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) నిలిచింది. విదేశాలకు ఎగుమతి అవుతున్న ఈ కారుకి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

2023 లో లాంచ్ అయినప్పటి నుంచి మారుతి ఫ్రాంక్స్ భారతీయ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన ఎస్‌యూవీగా గుర్తింపు పొందింది. ఈ బాలెనో ఆధారిత క్రాసోవర్ ఎస్‌యూవీ విడుదలైన కొద్ది రోజుల్లోనే మారుతి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ మోడళ్లలో ఒకటిగా అవతరించింది. దేశీయ మార్కెట్లో భారీ సంచలనం సృష్టించిన ఈ కారు ఇప్పుడు ఎగుమతుల పరంగా కూడా దూసుకెళ్తోంది.
2024 సెప్టెంబర్‌లో మారుతి సుజుకి 5,200 ఫ్రాంక్స్ కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే నెలలోని ఎగుమతులతో పోలిస్తే 354.94 శాతం వృద్ధిని సాధించింది. సరిగ్గా ఏడాది క్రితం 2023 సెప్టెంబర్‌లో మారుతి ఫ్రాంక్స్ 1,143 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. దీని ఎగుమతులు గణనీయంగా పెరగడం ద్వారీ ఈ ఎస్‌యూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

ఇక ఈ ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90 bhp పవర్, 113 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. రెండో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 100 bhp పవర్, 148 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫ్రాంక్స్ సీఎన్‌జీ వెర్షన్‌లోనూ లభిస్తుంది. ఇది 77.5 bhp పవర్‌ని అలాగే 98 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది మాన్యువల్ గేర్ బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. డ్రైవర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా పవర్‌ట్రైన్ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. ఈ కారు లోపల ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ తో కూడిన 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంది.

అంతే కాకుండా క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఈ ఎస్‌యూవీ ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ప్రయాణీకులకు మెరుగైన సేఫ్టీని అందిస్తాయి. మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారతదేశంలో అందుబాటు ధరలో విక్రయించబడుతోంది. అందువల్ల దీనిని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
దీని దీని ధర రూ .7.51 లక్షల నుంచి రూ .13.04 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లోని టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, మహీంద్రా XUV 3XO వంటి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఈ ఫ్రాంక్స్ గట్టి పోటీని ఇస్తుంది. అయితే త్వరలోనే హైబ్రిడ్ పవర్ట్రెయిన్‌తో ఫ్రాంక్స్‌ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications








