28 కి.మీ మైలేజీ ఇచ్చే కారు మన దగ్గర సూపర్ హిట్టు.. ఇప్పుడు జపాన్‌లో అదృష్టం కోసం ఎక్స్‌పోర్ట్!
మారుతి సుజుకి నుంచి ప్రస్తుతం విక్రయిస్తున్న సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలల్లో మారుతి ఫ్రాంక్స్(Maruti Fronx)) ప్రీమియం లుక్‌ని కలిగి ఉంది. జపాన్‌కి చెందిన సుజుకి మారుతి సహకారంతో భారత్‌లో విక్రయిస్తున్న కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ కార్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటు ధరలో ఉండటమే కాకుండా మంచి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ప్రీమియం ఫీచర్లతో భారత్‌లో మంచి సేల్స్ సాధిస్తున్న ఫ్రాంక్స్ కూడా ఈ జాబితాలో ఉంది.
భారత్‌లో సక్సెస్ సాధించిన ఈ కారు ఇప్పుడు దీనిని జపాన్ మార్కెట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. జపాన్‌లో మారుతి సుజుకి మాతృసంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఫ్రాంక్స్ ఎస్‌యూవీని విక్రయించనున్నారు. భారత ప్రభుత్వ మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేయబడిన ఈ కారు ఇప్పుడు విదేశాలకు ఎగుమతి కానుంది. ఇంతకు ముందు 2016 లో బాలెనో కారుని జపాన్‌కి ఎగుమతి చేసి విక్రయించింది.

బాలెనో తర్వాత మారుతి సుజుకి నుంచి జపాన్‌కి ఎగుమతి అవుతున్న రెండో కారుగా మారుతి ఫ్రాంక్స్ ఉంది. సుజుకి ఫ్రాంక్స్‌ని 2024 ద్వితీయార్ధంలో జపాన్‌లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ లాంచ్ అయినప్పటి నుంచి భారత్‌లో మరియు విదేశీ మార్కెట్లలో 2 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. ఇప్పుడు జపాన్‌లో కాలు మోపనుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులోని 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ 100 ps శక్తిని 148 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇక 1.2 డ్యూయల్ జెట్ ఇంజిన్ 90 ps పవర్, 113 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్/ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక సీఎన్‌జీ వేరియంట్ అదే 1.2 లీటర్ ఇంజిన్ ఆప్షన్‌లో వస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పెట్రోల్ ఇంజిన్లు 21.5 నుంచి 22.89 కిమీ మైలేజీ ఇస్తాయి. ఇక సీఎన్‌జీ వెర్షన్ కిలోకు 28.51 మైలేజీని అందిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెసె్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్, HUD (హెడ్స్ అప్ డిస్ప్లే) యూనిట్, రియర్ ఏసీ వెంట్స్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ DRLs, ఎల్ఈడీ కనెక్టింగ్ టెయిల్లైట్లు తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, హిల్‌హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360 డిగ్రీస్ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. జపాన్‌కి ఎగుమతి కానున్న ఫ్రాక్స్‌లో ADAS వంటి ఆధునిక ఫీచర్లను జోడించనున్నారు.
మారుతి ఫ్రాంక్స్ టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, రెనో కిగర్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి బ్రెజ్జా, అలాగే సిట్రోయెన్ సీ3, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీగా ఉంది.
ఫ్రాంక్స్ ప్రస్తుతం మారుతి సుజుకి గుజరాత్ ప్లాంటులో తయారు చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా మంచి వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న అత్యాధునిక తయారీ కేంద్రం ఇది. జపాన్‌కి ఎగుమతి చేస్తున్న తొలి కంటైన్‌మెంట్‌లో 1,600 కార్లను గుజరాత్‌లోని పిపావావ్ పోర్టు (Pipavav Port) నుంచి జపాన్‌కి పంపింది.


Click it and Unblock the Notifications








