మార్కెట్‌లో బాహుబలి కారు.. అందరూ ఇదే కావాలంటున్నారు.. ఏకంగా 51 శాతం సేల్స్‌తో టాప్‌ 10 లో చోటు!

మార్కెట్‌లో మారుతి కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు ఎక్కువగా ఈ కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో ఈ కంపెనీ కార్ల సేల్స్ టాప్‌లో కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో 40 శాతం వరకు ఈ కార్ల సేల్స్‌ అమ్మకాల వాటాను కలిగి ఉన్నాయి. జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతి సుజుకి ఇప్పటికే ప్రకటించింది. అయినా కానీ మారుతి కార్లపై క్రేజీ తగ్గే అవకాశం లేకపోవచ్చు. అయితే ధరల పెంపు 4 శాతం ఉండే అవకాశం ఉంది.

నవంబర్‌ కార్ల అమ్మకాల్లో మారుతి కార్లు అదరగొట్టాయి. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. ఇదే కోవాలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నవంబర్ 2024 లో మొత్తం 14,882 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2023 నవంబర్‌లో కేవలం 9867 యూనిట్ల ఫ్రాంక్స్‌ కార్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. దీంతో ఈ కారు అమ్మకాలు 51% పెరిగాయి.

Maruti Suzuki Fronx

మొత్తం నవంబర్‌ కార్ల అమ్మకాల్లోనే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో చోటు సంపాదించింది. మారుతి బ్రెజా కంటే 36 యూనిట్లు మాత్రమే తక్కువగా మారుతి విక్రయించింది. దీంతో టాప్ 10 కార్ల జాబితాలో ఈ కారు ఏడో స్థానంలో నిలిచింది. దేశీయ మార్కెట్‌లో వేగంగా అమ్ముడవుతున్న ప్యాసింజర్ కార్లలో మారుతి ఫ్రాంక్స్‌ ఒకటిగా ఉంది. దీనిని లాంచ్ చేసిన 10 నెలల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలను రాబట్టింది.

విడుదలైన తొలి పది నెలల్లోనే ఈ కారు 100,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయింది. 2023 జనవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో ఈ ఫ్రాంక్స్‌ని తొలిసారిగా ప్రదర్శించారు. ఆ తర్వాత ఏప్రిల్ 2023లో ఈ కారు అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. గత ఏడాదిన్నరగా జనాల మన్ననను పొందుతుంది. గత ఏడాది ఇదే సమయంలో 9000 కార్లు అమ్ముడుపోగా, ఇప్పుడు 14,000 కార్లు అమ్ముడయ్యాయి.

Fronx Sales

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ధర రూ.7.51 లక్షల నుంచి రూ.13.04 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉంది. మధ్య రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో సైడ్‌ ఫ్రొఫైల్‌ చూడటానికి అచ్చం ప్రీమియం కారు వలె కనిపిస్తుంది. అందువల్ల జనాలు దీనిని కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ కారు రెండు ఇంజిన్‌ 1.0-టర్బో పెట్రోల్‌, 1.2 లీటర్ డ్యుయల్‌ జెట్ బూస్టర్‌ ఆప్షన్లలో వస్తుంది. ఇందులోని సీఎన్‌జీ వేరియంట్ లీటరుకు 28.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. బూస్టర్ జెట్ ఇంజిన్ కారణంగా ఈ కారు మంచి ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. హై పెర్ఫార్మెన్స్ కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు.

Maruti Suzuki Fron SUV Sales

ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అలాగే హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక సేఫ్టీ పరంగా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్స్‌ ఉన్నాయి.

ఇది మార్కెట్‌లో టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్, కియా సోనెట్ , హ్యుందాయ్ వెన్యూ , టాటా నెక్సాన్ , మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ , రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ కారును భారత్‌లోనే కాకుండా విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దీనికి లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అందుకు తగినట్లుగా ఫీచర్లను కూడా మార్పు చేశారు.

More from DriveSpark

Article Published On: Friday, December 6, 2024, 18:35 [IST]
English summary
Maruti suzuki fronx november 2024 sales reort check here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+