ఈ కారుతో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి.. జనాలు కచ్చితంగా అసూయ పడతారు, విదేశీ ఎగుమతుల్లోనూ టాప్‌!

దేశంలో మొత్తం కార్ల అమ్మకాల్లో మారుతి కార్లు టాప్‌లో కొనసాగుతున్నాయి. మారుతి సుజుకి నుంచి ఎర్టిగా ఎంపీవీ టాప్‌ ఫర్ఫామర్‌గా ఉంది. వరుసగా రెండు నెలలు ఈ ఎంపీవీ సేల్స్‌లో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. టాప్‌ 10లో ఎర్టిగా, స్విఫ్ట్‌, బ్రెజా, బాలెనో, గ్రాండ్‌ విటారాతో మారుతి ఫ్రాంక్స్‌ టాప్‌లో నిలిచింది. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న మారుతి ఫ్రాంక్స్‌ (Maruti Suzuki Fronx) అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందిన కార్లలో ఒకటిగా ఉంది. ఈ సబ్‌కాంపాక్ట్‌ క్రాస్‌ఓవర్‌ ఎస్‌యూవీ నెల రోజుల క్రితమే 2 లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2023 ఏప్రిల్ ఆఖర్లో ఈ కారుని మారుతి సుజుకి విపణిలోకి విడుదల చేసింది. ఈ రెండు లక్షల యూనిట్ల మార్క్‌ని చేరుకోవడానికి కేవలం 18 నెలలు మాత్రమే పట్టింది.

ప్రతీ నెలా అమ్మకాల్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ స్థిరంగా రాణిస్తోంది. దీంతో ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ పలు రికార్డులను సాధిస్తోంది. ఇక అక్టోబర్ 2024లో కంపెనీ మంచి అమ్మకాలను నెలకొల్పింది. తాజాగా విడుదలైన సేల్స్‌ రిపోర్ట్‌ ప్రకారం అక్టోబర్‌లో ఫ్రాంక్స్‌ అదరగొట్టింది. మొత్తం 16,419 యూనిట్లు సేల్‌ అయ్యాయి. గత ఏడాది 2023 అక్టోబర్‌లో 11,357 యూనిట్ల ఫ్రాంక్స్‌ యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి.

Maruti Suzuki Fronx October 2024 Sales Report

గత ఏడాదితో పోల్చితే 45 శాతం సేల్స్‌ పెరిగాయి. దీంతో కంపెనీ ఓవరాల్‌ సేల్స్‌లోనూ ఫ్రాంక్స్ 4వ స్థానంతో దుమ్మురేపింది. మొత్తం మీద మారుతి సుజుకి ఫ్రాంక్స్ అక్టోబర్ 2024 నెలలో ఎక్కువగా అమ్ముడైన టాప్ -10 ఎస్‌యూవీల జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి రెండు స్థానాల్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి బ్రెజ్జా నిలిచాయి. ఓవరాల్‌ కార్ల సేల్స్‌లో 5వ స్థానాన్ని సాధించింది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ని కస్టమర్లు ఎక్కువ మొత్తంలో యాక్సెప్ట్‌ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానం దానీ ధర, ఫీచర్లు, మైలేజీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం మారుతి సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్‌లో కేవలం రూ .7.51 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.12.87 లక్షలుగా ఉంది. ఇవి అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు.

Maruti Suzuki Fronx Price

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధరకు తగినట్లుగానే మంచి ఫీచర్లను కలిగి ఉంది. దీంతో ప్రతి నెలా ఇది టాప్‌లో కొనసాగుతోంది. ఇందులో సేఫ్టీ ఫీచర్లు కూడా ఎక్కువే. ఇందులో సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతే కాకుండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్స్ అప్‌డిస్ ప్లే వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఇక ఈ కారులోని సీఎన్‌జీ వేరియంట్‌ అత్యధికంగా కిలోకు 28.51 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. పెట్రోల్‌ వేరియంట్‌ 20.01 నుంచి 28.51 కి.మీ మైలేజీని ఇస్తుంది.

Maruti Suzuki Fronx Features

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. మంచి డిజైన్‌, క్రేజీ ఫీచర్లు, తక్కువ ధరలో ఫ్రాంక్స్‌ లభిస్తుంది కాబట్టి కొత్తగా కారు కొనాలనుకునే వారు దీనిని నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారుని భారీ సంఖ్యలో విదేశాలకు సైతం కంపెనీ ఎగుమతి చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2024, 12:05 [IST]
English summary
Maruti suzuki fronx october 2024 sale report and check price and mileage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+