28.51 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ కారుపై మీ ఊర్లోకి వెళ్తే కచ్చితంగా అసూయ పడతారు.. ధర రూ. 7.51 లక్షలు మాత్రమే!
ప్రస్తుతం మార్కెట్‌లో లభించే కార్లలో బాగా ప్రాచుర్యం పొందిన కార్లలో మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) ఒకటిగా ఉంది. రీసెంట్‌గా 1600 ఫ్రాంక్స్ యూనిట్లను సైతం మారుతి జపాన్‌కి ఎగుమతి చేసింది. జపాన్‌కి ఎగుమతి చేసిన కార్లలో కొన్ని ఫీచర్లను పూర్తిగా అప్‌డేట్ చేశారు. ఈ కారుకి సంబంధించిన ఆగస్టు 2024 సేల్స్ రిపోర్ట్ విడుదలైంది. సేల్స్ రిపోర్ట్ ప్రకారం మారుతి మారుతి ఫ్రాంక్స్ 2024 ఆగస్టులో మొత్తం 12,387 యూనిట్లు అమ్ముడయ్యాయి. కానీ ఇదే కారు గత సంవత్సరం 2023 ఆగస్టులో 12,164 యూనిట్లను మాత్రమే సేల్ అయ్యాయి.
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ కారు 2 శాతం వృద్ధిని సాధించింది. తద్వారా మారుతి సుజుకి ఫ్రాంక్స్ 2024 ఆగస్టు నెలలో భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ -10 కార్ల జాబితాలో 9 వ స్థానాన్ని సంపాదించింది. మొత్త ఆరు మారుతి సుజుకి కార్లు ఈ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిలో మారుతి బ్రెజా (Maruti Brezza) టాప్ 1 స్థానంలో నిలిచింది.

అయితే మార్కెట్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కి భారీ స్పందన రావడానికి అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి సరైన ధర అని చెప్పవచ్చు. ప్రీమియం లుక్‌లో ఉండే ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ.7.51 లక్షలుగా ఉంది. ఇక దీని టాప్ టాప్ వేరియంట్ ధర రూ. 12.87 లక్షలుగా ఉంది. ఇవి కేవలం ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఇక ఈ కారు భారీ మైలేజీని కూడా అందిస్తుంది.
ఈ మారుతి సుజుకి 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 21.50 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 20.10 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. ఇక 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 21.79 కిలోమీటర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 22.89 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 28.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.

అయితే సీఎన్‌జీ ఇంజిన్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సరైన ధర, అద్భుతమైన మైలేజీతో పాటు, ఈ కారులో అనేక ఫీచర్లను కూడా కలిగి ఉంది. వీటిలో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.
ఈ కారులో సేఫ్టీ ఫీచర్లు భారీగానే ఉన్నాయని చెప్పవచ్చు. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇది 7 మోనోటోన్, 3 డ్యూయల్‌టోన్ కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇక ఈ కారు మొత్తం 6 వేరియంట్స్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఇక ఇది భారతీయ మార్కెట్‌లో కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV3XO, రెనో కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌లకు గట్టి పోటీని ఇస్తుంది. ఈ ధరలో కస్టమర్లకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. అంతే కాకుండా ఈ కారులో వెళ్తుంటే రోడ్డుపై ప్రతి ఒక్కరూ కళ్లు దీనిపైనే ఉంటాయి. అందుకే ఈ కారుకి డిజైన్ అదనపు బలం అని చెప్పవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








