మారుతి సుజుకీ SUVపై రూ.20,000 తగ్గింపు.. కారు స్పెసిఫికేషన్లు, ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

మారుతి సుజుకికి (Maruti Suzuki) చెందిన అరేనా, నెక్సా షోరూంల ద్వారా విక్రయించే వివిధ మోడళ్లపై భారీ తగ్గింపు ప్రయోజనాలపై ప్రకటన చేశారు. ఈ జనవరి నెల వరకు ఇవి పరిమితం అవుతాయని తెలుస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజీ బోనస్‌ మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ SUV పై రూ.20,000 తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.15000 క్యాష్ డిస్కౌంట్‌ కాగా.. మరో రూ.5000 కార్పొరేట్‌ తగ్గింపు కింద అందిస్తున్నారు. అయితే ప్రాంతాలు, రాష్ట్రాలు, వేరియంట్‌, కలర్‌ ను బట్టి మారుతుంది. అయితే పూర్తి సమాచారం కోసం సమీపంలోని డీలర్‌ను సంప్రదించండి.

Maruti Suzuki Fronx suv price cut news

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ధర ప్రస్తుతం రూ.7.46 లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి రూ.13.13 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. ఈ ఫ్రాంక్స్ SUV సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్‌, జిటా వేరియంట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. నెక్సా బ్లూ, ఎర్త్‌ బ్రౌన్‌, ఆర్కిటిక్‌ వైట్‌, ఓప్‌లెంట్ రెడ్‌ సహా 3 డ్యూయల్‌ టోన్‌, 7-మోనోటోన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఈ ఫ్రాంక్స్‌ SUV పెట్రోల్‌ మరియు CNG ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1-లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 1.2 లీటర్‌ డ్యూయల్‌జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. 1.0 లీటర్‌ ఇంజిన్ 100ps శక్తి, 148Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5 స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Maruti Suzuki Fronx suv price drop

అదే 1.2 లీటర్‌ ఇంజిన్‌ గరిష్ఠంగా 90ps శక్తి,113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. CNG వేరియంట్‌ 1.2 లీటర్‌ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 77.5ps శక్తి, 98.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను మాత్రమే పొందుతుంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ పెట్రోల్‌ వేరియంట్‌ 20.1kmpl- 22.89kmpl మైలేజీని ఇస్తుంది. CNG వేరియంట్లు 28.51 km/kg మైలేజీతో వస్తుంది. ఈ కారు 5-సీటర్‌ వెర్షన్‌గా రానుంది. ఫీచర్లు సహా ఆకర్షణీయ డిజైన్‌ను కలిగి ఉంటుంది. 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ ప్లే, హెడ్స్‌ అప్‌ డిస్‌ప్లే, క్రూయిజ్‌ కంట్రోల్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Maruti Suzuki Fronx suv discount

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ SUV 6- ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, 360- డిగ్రీ కెమెరా, ISOFIX చైల్డ్‌ సీట్‌ యాంకర్స్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ వంటి కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. కియా సోనెట్‌, హ్యుందాయ్‌ వెన్యూ సహా అనేక కార్లతో పోటీపడుతోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, January 12, 2024, 17:09 [IST]
English summary
Maruti suzuki fronx suv get rs20000 discount in january 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+