కేవలం 10 నెలల్లో లక్ష కార్లు సేల్.. రికార్డ్‌ సృష్టించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్‌, మైలేజ్‌లో ది బెస్ట్‌.!!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న ప్రముఖ కార్ మోడళ్లలో మారుతి ఫ్రాంక్స్(Maruti Fronx) ఒకటి. ఇది బాలినీస్ యొక్క క్రాస్ఓవర్ రకం మోడల్‌ కారు. అయితే తాజాగా ఈ కారుకు సంబంధించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది. దేశంలోనే మొదటిసారిగా ఊహించని స్థాయిలో సేల్స్‌ను సాధించి రికార్డు సృష్టించింది.

ప్రతి నెలా, ప్రతి యేటా దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల కార్ల అమ్మకాలతో పోలిస్తే.. మారుతి సుజుకికి చెందిన కార్లు ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటాయి. భారత్‌లో మధ్య తరగతి ప్రజల ఫేవరెట్‌ కార్లుగా మారుతి సుజుకి స్థానం సంపాదించింది. ఈ క్రమంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ మోడల్ కారు.. విక్రయాలు ప్రారంభించిన కేవలం పది నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయి.

Maruti-Suzuki-Fronx sales recored

భారత మార్కెట్లో మారుతి సుజుకి అందిస్తున్న ప్రముఖ కార్ మోడళ్లలో ఫ్రాంక్స్ ఒకటి. ఫ్రాంక్స్‌ క్రాస్ఓవర్ SUV(Crossover SUV) కార్ మోడల్. అయితే ఈ కార్ మోడల్ ఇప్పుడు కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ కారు సేల్స్‌కు సంబంధించిన గణాంకాలను సంస్థ విడుదల చేసింది. ఏడాది కూడా పూర్తి కాకముందే 1 లక్ష యూనిట్ల కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది.

ఈ మేరకు మారుతి సుజుకి ధ్రువీకరించింది. ఫ్రాంక్స్‌(Maruti Suzuki Fronx Sales).. కేవలం 10 నెలల్లోనే ఈ విపరీతమైన అమ్మకాల గణాంకాలను సాధించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కారు మోడల్‌ను మారుతి సుజుకి గతేడాది.. ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా ప్రదర్శించగా.. ఏప్రిల్ 24న అధికారికంగా ఫ్రాంక్‌(Maruti Suzuki Fronx Sales)లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Maruti-Suzuki-Fronx sales recored

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ మోడల్ అద్భుతమైన లుక్స్, అధునాతన సాంకేతికతలు మరియు ప్రీమియం క్వాలిచీ ఫీచర్లతో నిండి ఉండటం కారణంగా ఈ కారు ఎక్కువగా కస్టమర్లను ఆకర్షించింది. కస్టమర్ల ఫేవరెట్‌ కారుగా మారింది. అంతే కాకుండా స్పోర్టీ లుక్‌ కారణంగా కూడా ఫ్రాంక్స్‌కు ఆదరణ లభిస్తోంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌(Fronx Features)లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. హెచ్‌డీ టెక్నాలజీతో 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. దీని ద్వారా ఫింగర్‌ ప్రింట్స్‌తో యాక్సెస్‌ కూడా చేసుకోవచ్చు. వైర్‌లెస్ ఛార్జర్, హెడ్స్-అప్ డిస్ప్లే, సెల్ ఫోన్ మరియు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

Maruti-Suzuki-Fronx sales recored

మైలేజ్‌ పరంగా కూడా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ ముందు వరుసలో ఉంటుంది. ఈ కారును రెండు ఇంజిన్‌ ఆప్షన్లలో సంస్థ అందిస్తోంది. 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ మోటారుతో పాటు 1.2-లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇవి 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌లతో జత చేయబడి ఉంటాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ 1.2-లీటర్ పెట్రోల్ మోటార్ యొక్క 5-స్పీడ్ మాన్యువల్ ఆప్షన్‌ లీటరు పెట్రోల్‌కు 21.79 కిమీ మైలేజ్‌ని అందిస్తుండగా.. AMT గేర్‌బాక్స్‌తో లీటరు పెట్రోల్‌కు 22.89 కిమీ వరకు మైలేజ్‌ని ఇస్తుంది. అదేవిధంగా, దాని 1.0-లీటర్ బూస్టర్-లిట్ పెట్రోల్ మోటార్ కూడా లీటరు పెట్రోల్‌కు 20.01 కిమీ నుంచి 21.5 కి.మీ మైలేజ్‌ని అందిస్తుందని సంస్థ తెలిపింది. సీఎన్జీ వెర్షన్లో కూడా ఈ కారు అందుబాటులో ఉంది. 28.51/kg మైలేజ్ ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, January 25, 2024, 9:30 [IST]
English summary
Maruti suzuki fronx suv records 1 lakh units sales in just 10 months
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+