దుబాయ్‌లో దూసుకెళ్తున్న మేడ్‌ ఇన్ ఇండియా కారు.. అరబ్బులను విపరీతంగా ఆకట్టుకుంటోంది!

భారత్‌లో తయారైన కార్లకు విదేశాల్లో క్రేజీ ఎక్కువే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా UAE మార్కెట్‌లో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ వాహనాలలో సుజుకి ఫ్రాంక్స్ ఒకటిగా ఉంది. UAE-స్పెక్ బాలెనో ఆధారిత క్రాసోవర్‌గా ఉంది. భారత్‌లో విక్రయించే వెర్షన్ కంటే ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. మన దగ్గర లభించే ఫ్రాంక్స్‌ అలాగే యూఏఈలో లభించే కార్లకు సంబంధించిన కీలకమైన తేడాలు ఈ కథనంలో మీ కోసం..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సుజుకి ఫ్రాంక్స్‌ GL, GLX వేరియంట్‌లను విడుదల చేసింది. GL వేరియంట్‌ కోసం 61,900 AED (భారత్‌లో సుమారు రూ.14.10 లక్షలు), GLX వేరియంట్ కోసం 69,900 AED (సుమారు రూ.15.94 లక్షలు)గా ఉంది. భారత్‌లో రూ.7.52 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే UAEతో పోలిస్తే దీని ధర సగానికి తక్కువ ఉందని అర్థం.

Maruti Suzuki Fronx in UAE

అయితే యూఏఈలో లభించే వేరియంట్లు జీటా, ఆల్ఫా వేరియంట్ల మాదిరిగానే ఉండనున్నాయి. భారతదేశంలో విక్రయించే ఫ్రాంక్స్ మాదిరిగా కాకుండా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో ఒక ఇంజిన్ ఆప్షన్‌తో మాత్రమే UAE మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 1.5-లీటర్ K15C డ్యూయల్ జెట్ ఇంజిన్ గరిష్టంగా 102bhp పవర్ మరియు 137nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

భారత్‌లో ఇది మల్టీపుల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. 1.0-లీటర్ బూస్టర్జెట్ యూనిట్‌తో పోలిస్తే ఇది కొంచెం తక్కువ టార్క్‌ని కలిగి ఉంటుంది. ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వెర్షన్‌లో వస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ వినియోగదారుల అభిరుచికి తగినట్లు పలు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో భారీ ఫీచర్లను కంపెనీ అందిస్తుంది.

Maruti Fronx Power-Torque UAE-Spec Fronx Power-Torque
1.2 Petrol 90 PS - 113 Nm 1.5 Petrol 102 PS - 137 Nm
1.0 Turbo Petrol 100 PS - 147 Nm -

అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వేరియంట్ల ఫీచర్లు చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. GL, GLX రెండు వేరియంట్లు వరుసగా భారతదేశంలో విక్రయించే జీటా మరియు ఆల్ఫా వేరియంట్లను పోలినట్లు ఉంటాయి. యూఏఈ వేరియంట్లలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లేదా ప్రీమియం సౌండ్ సిస్టమ్ లేకపోవడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపించే అవకాశం తక్కువగా ఉండనుంది.

కానీ కొన్ని ఫీచర్లు లేనప్పటికీ ఎస్‌యూవీలలో ఉండే ఫీచర్లతో పాటు మంచి ఫర్ఫామెన్స్‌, కంఫర్ట్‌తో దుబాయి కస్టమర్లకు అనుగుణంగా ఈ కారు మార్పు చేసినట్లు తెలుస్తుంది. రెగ్యులర్ క్రాసోవర్ వాహనాలపై పెద్దగా ఆసక్తి చూపని భారతీయ కస్టమర్లు కూడా దుబాయ్‌లో ఉన్నారు. వారి అభిరుచికి తగినట్లుగా ఫ్రాంక్స్‌ కాస్త భిన్నంగా ఉండనుంది. ప్రస్తుతం అక్కడ బాలెనో, బ్రెజా మధ్య ఉన్నప్పటికీ ఇప్పుడు జనాలు వీటిని ఎన్నుకునే అవకాశం ఉంది.

Maruti Suzuki Fronx UAE Variants

ముఖ్యంగా దీని డిజైన్‌లోని కొత్తదనం అందరికీ నచ్చింది. గ్రాండ్ విటారాను తలపించే ఫ్రంట్ గ్రిల్, LED DRLతో కూడిన LED మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రఫ్ స్టైల్‌ని కలిగి ఉండే చంకీ బాడీ క్లాడింగ్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్, కూపేలా వెనుకకు వంగి ఉండే రియర్ గ్లాస్ ఏరియాతో ఫ్రాంక్స్‌ సరికొత్తగా కనిపిస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 26, 2024, 14:44 [IST]
English summary
Maruti suzuki fronx uae vs indian version specifications main differences details in telugu
Read more on: #maruti suzuki #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+