ప్రత్యర్థి కార్లకు చుక్కలు.. సేల్స్‌లో టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఏకైక కారు.. కొనాలంటే ఇదే మంచి ఛాన్స్!
తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనేది ప్రతీ మిడిల్ క్లాస్ ఫ్యామీలీలకు ఉండే కల. సొంతిళ్లు తర్వాత కొనుగోలు చేయాలనుకునే అత్యంత ఇష్టమైన వాటిలో కారు ఒకటిగా ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ ఫ్యామీలీల కోసం మారుతి సుజుకి అందుబాటు ధరలో కార్లను అందిస్తుంది. ఈ కంపెనీ నుంచి సరసమైన ధరలో హై ఎండ్ ఫీచర్లు, మైలేజీతో సరికొత్త మోడళ్లు మార్కెట్లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. అందులో మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) ఒకటిగా ఉంది. మార్కెట్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాలతో అదరగొడుతోంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లోని పలు కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.
మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌ల్లో మంచి ఆదరణ పొందింది. ఈ కారు కేవలం 19 నెలల్లో 1.50 లక్షల యూనిట్ల మార్క్‌ని దాటింది. గ్రాండ్ విటారాను తలదన్నేలా ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఈడీ DRLs, మల్టీ రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్స్, దీని ఆకట్టుకునే ప్రీమియం డిజైన్ వల్ల దీనిని జనాలు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హ్యాచ్‌బ్యాక్స్‌లో ఇది ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.

దీని సైడ్ ఫ్రొఫైల్‌లో 16 అంగుళాల డైమండ్- కట్ అలాయ్ వీల్స్‌తో రగ్డ్ లుక్‌ని కలిగి ఉంటుంది. అలాగే ఫీచర్ల పరంగా 9 ఇంచెస్ స్మార్ట్ ప్లే ప్లస్ ఇన్ఫోటేయిన్మెంట్ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జర్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా, హెడ్స్ అప్ డిస్ ప్లే, ఇంజిన్ స్టార్ట్-స్టాప్, కీలెస్ ఎంట్రీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రేర్ డీఫాగర్ వంటి ఫీచర్లు కలవు. ఇది 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో- పెట్రోల్ బూస్టర్ జెట్ ఇంజిన్స్‌తో పనిచేస్తుంది. NA పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ ఇంజిన్ 88 bhp వద్ద 113 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక బూస్టర్‌జెట్ ఇంజిన్ 99 bhp వద్ద 147.6 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో వస్తుంది. ఈ కారు సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్ (O), జీటా, ఆల్ఫా అనే వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారుని సీఎన్‌జీ ఆప్షన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
పోటీ కార్లు: మార్కెట్‌లో హ్యాుందాయ్ వెన్యూ, టయోటా టైజర్ ఈ మోడల్‌కి పోటీ కార్లుగా ఉన్నాయి. వెన్యూ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.53 లక్షల రేంజ్ మధ్యలో ఉంది. ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ. 7.51 లక్షలుగా ఉంది. ఇందులోని పవర్ట్రెయిన్లు కియా సోనెట్ తరహాలోనే ఉంటాయి. ఇది పెట్రోల్ ఇంజిన్, టర్బో పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంటాయి.

టాయోటా టైజర్ ఇది మారుతి సుజుకి నుంచి రీబ్యాడెజ్డ్ వెర్షన్‌గా ఉంది. ఇక దీని ధర రూ.7.74 లక్షల నుంచి రూ. 13.08 లక్షల మధ్య ఉంది. ఈ కారు E, S, S+, G, V అనే ఐదు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది 1.2 నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 టర్బో ఛార్డ్జ్ పెట్రోల్, CNG పవర్‌ట్రైన్ ఆప్షన్స్‌తో వస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








