మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు అందుబాటు ధరలో హైబ్రిడ్ కారు.. మారుతికి మన కష్టాలు తెలుసు!!
భారతదేశంలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారుకి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ధరల పరంగా మారుతి నిర్ణయంతో మిడల్ క్లాస్ వాళ్లు సైతం మిడ్‌సైజ్ ఎస్‌యూవీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యర్థి కార్ల కంపెనీలతో పోల్చితే ఈ గ్రాండ్ విటారా ధరలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. అందువల్ల సేల్స్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీల్లో మారుతి గ్రాండ్ విటారా దూసుకెళ్తుంది. హైబ్రిడ్ ఇంజిన్‌తో సరసమైన ధరల అందుబాటులోకి తేవడంతో దీనికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా తర్వాత మారుతి గ్రాండ్ రెండో స్థానంలో ఉంది. త్వరలోనే క్రెటాను కూడా తలదన్నే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతి గ్రాండ్ విటారా కారు ధరలు ఎలా ఉన్నాయి. ఆ కారుకి సంబంధించిన ఇతర పూర్తి వివరాలు మీకోసం..
ప్రస్తుతం ఈ కారు ధర రూ.10.45 లక్షల నుంచి రూ.19.65 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇందులో సిగ్మా వేరియంట్ గ్రాండ్ విటారా ధర రూ.10.45 లక్షలుగా ఉండగా.. టాప్-స్పెక్ ఆల్ఫా ఆల్-వీల్ డ్రైవ్ హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.65 లక్షలుగా ఉంది. ఈ ధరలు కారు యొక్క ఫీచర్లు మరియు సాంకేతికతను బట్టి మారుతూ ఉంటాయి.

పట్టణ, గ్రామీణ వినియోగదారులను ఆకర్షించడానికి మారుతి సుజుకి ఈ కారును తీసుకువచ్చింది. సరసమైన బడ్జెట్‌లో నమ్మదగిన మరియు ఎక్కువ-ఫీచర్లను అందించే కారు కోసం చూసే వారు ఈ కారుని కొనుగోలు చేయవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్లకు అతి చేరువగా ఉండేలా ఈ కారు వేరియంట్ల ధరలను మారుతి సుజుకి సరసమైన అందుబాటులోకి తెచ్చింది. తక్కువ ధర ఎక్కువ ఫీచర్ల వల్ల సేల్స్‌లో సత్తా చాటుతుందని సంస్థ భావిస్తోంది.
గ్రాండ్ విటారాలో హెడ్స్ అప్ డిస్ ప్లే, 360 డిగ్రీల కెమెరా, స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ హై-టెక్నాలజీ అందిచే కార్లకు ఏ మాత్రం తీసిపోదు. దీంతో వినియోగదారుల దృష్టిని ఈ కారు ఆకర్షించింది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు టాటా హారియర్ వంటి వాటికి పోటీగా ఉంది. దీని ప్రత్యర్థి కార్లతో పోల్చితే తక్కువ ధరను కలిగి ఉండటం కలిసి వస్తోంది.

మారుతి సుజుకి ఈ కారు కోసం మార్కెటింగ్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించింది. దీంతో కారు అమ్మకాలు జోరుగా సాగాయి. వివిధ కంపెనీలోని ఈ కారు సెగ్మెంట్లతో పోల్చితే ఆశించినంత ఫలితానలు సాధించి మార్కెట్‌లో తమ పట్టుని నిలుపుకుంది. అయితే ఈ విభాగంలో 2015 నుంచే టాప్‌లో కొనసాగుతున్న హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ముఖ్యంగా మారుతి గ్రాండ్ విటారా డిజైన్, కంఫర్ట్ మరియు మైలేజీని విషయంలో కస్టమర్లు 100 శాతం సంతృప్తిని వ్యక్తం చేశారు. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధరల వ్యూహం ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చింది. మారుతి గ్రాండ్ విటారా తమ కుటుంబాలతో ప్రయాణించే వారికి మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. అందుకే ఈ కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ కారు ప్రత్యర్థులతో పోలిస్తే గ్రాండ్ విటారా మంచి ఉత్పత్తి అని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








