ఈ దసరాకు దావత్ నాదే అంటున్న మారుతి గ్రాండ్ విటారా.. పండుగ సీజన్ కోసం లిమిటెడ్ ఎడిషన్‌లో లాంచ్!
దేశంలోని కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి మంచి డిమాండ్‌ని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన కార్లు మార్కెట్‌లో సగం వాటాను కలిగి ఉన్నాయి. దీంతో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) అతిపెద్ద కార్ల ఉత్పత్తి సంస్థగా కొనసాగుతుంది. ఈ కంపెనీకి చెందిన కార్లు తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, మంచి మైలేజీని అందించడంతో జనాలు ఈ కార్లను వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పండుగ సీజన్‌లో సేల్స్‌ని ఆకర్షించడానికి కొత్త గ్రాండ్ విటారా డొమినియన్ లిమిటెడ్ ఎడిషన్ (Grand Vitara Dominion Limited Edition)ను విడుదల చేసింది.
తాజాగా మారుతి విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ఆల్ఫా, జీటా, డెల్టా వేరియంట్లలో లభిస్తుంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఫ్యూయల్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్రస్తుతం ఉన్న ధరలో ఆల్ఫా వేరియంట్‌పై రూ.52,699, జీటా వేరియంట్‌పై రూ. 49,999, డెల్టా వేరియంట్ కోసం రూ. 48,599 విలువైన కాస్మెటిక్ యాక్సెసిరీస్ ప్యాకేజీని చెల్లించి డీలర్‌షిప్స్ వద్ద వీటిని పొందవచ్చు.

ఈ స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకమైన స్టైలింగ్, రగ్డ్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కొత్త ఎస్‌యూవీలో విజువల్, ఫంక్షనల్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి మారుతి సుజుకి సప్లిమెంటరీ యాక్ససరీ కిట్లతో సహా ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. గ్రాండ్ విటారా డొమినియన్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కాస్మెటిక్ యాక్సెసిరీస్‌ని అదనపు లుక్‌ని అందిస్తాయి.
ఈ యాక్సెసిరీస్‌ల్లో బంపర్, రియర్ స్కిడ్ ప్లేట్, సైడ్ మోల్డింగ్, టెయిల్ ల్యాంప్స్‌తో పాటు వింగ్ మిర్రర్స్, హెడ్‌ల్యాంప్ చుట్టూ అదనపు బ్లాక్ ట్రిమ్స్‌పై అదనపు క్రోమ్ గార్నిష్‌లను కలిగి ఉంటుంది. యాక్సెసరీస్ ప్యాకేజీలో ఫాక్స్‌వుడ్ ఫినిష్‌తో కూడిన ప్రీమియం కార్ కవర్‌తో పాటు ఫ్లోర్ మ్యాట్స్, 'నెక్సా' బ్రాండ్ కుషన్స్, డ్యాష్ బోర్డ్‌పై సిల్వర్ ట్రిమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
అయితే జీటా, డెల్టా వేరియంట్లలో డ్యూయల్ టోన్ సీట్ కవర్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. డొమినియన్ వెర్షన్ గ్రాండ్ విటారా స్మార్ట్ హైబ్రిడ్ (మైల్డ్ హైబ్రిడ్), సీఎన్‌జీ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఇందులోని K15 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 102 bhp పవర్, 137 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో లభిస్తుంది.
దీనిలో ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక సీఎన్‌జీ వేరియంట్లు అదే ఇంజిన్ వస్తాయి. కానీ వీటి ఫర్ఫామెన్స్ 87 bhp శక్తిని, 122 nm టార్క్‌కి తగ్గుతుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందించబడుతుంది. ఈ ఎడిషన్ లుక్స్ పరంగా ఎక్స్‌టీరియర్ కాస్మోటిక్స్‌తో అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా సేల్స్ పెరుగుతాయని భావిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్‌లో మారుతి కార్లు టాప్‌లో ఉన్నాయి. ఈ కంపెనీకి చెందిన కార్లపై పండుగ సీజన్‌లో భాగంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్, క్యాష్‌బ్యాక్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సేల్స్‌లో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ మారుతి కార్లను ట్రై చేయవచ్చు. ప్రస్తుతం ఈ మారుతి గ్రాండ్ విటారా టాప్ 10 కార్లలో ఒకటిగా ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








