28 కి.మీ ఇచ్చే మారుతి గ్రాండ్‌ విటారా.. బెస్ట్ ఇంజిన్‌, ఫీచర్లు అందుకే ఈ కారు చాలా స్పెషల్‌

భారతీయ కారు ప్రియుల అభిరుచికి తగినట్లు మంచి హైబ్రిడ్ కారుని మారుతి సుజుకి అందిస్తుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా భారతీయ మార్కెట్‌లో అధునాతన హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ SUV 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఈ కలయిక మెరుగైన మైలేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది.

గ్రాండ్ విటారా రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్‌లో స్టార్టర్ జెనరేటర్ ఉంది. ఇది వాహనం స్టార్ట్ అయిన తర్వాత పెట్రోల్ ఇంజిన్‌తో నడిచేందుకు సహకరిస్తుంది. ఇక స్ట్రాంగ్‌ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీతో నడుస్తుంది. ఈ కారు కేవలం ఎలక్ట్రిక్‌ శక్తితో కొద్ది దూరం మాత్రమే ప్రయాణించేందుకు వాహనం అనుమతిస్తుంది.

Maruti-Suzuki-Grand-Vitara

గ్రాండ్ విటారా EV, ఎకో, పవర్ మరియు నార్మల్‌ అనే వివిధ రకాల డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. హైబ్రిడ్ వేరియంట్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్‌లో నడిచే క్రమంలో మంచి డ్రైవింగ్‌ అనుభూతిని పొందవచ్చు. స్ట్రాంగ్‌ హైబ్రిడ్ వేరియంట్ 27.97 kmpl మైలేజీని అందిస్తుంది. మారుతి కార్లలో ఎక్కువ మైలేజీ అందించే SUVలలో ఒకటిగా ఉంది. మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ 21.11 kmpl మైలేజీని అందిస్తుంది.

డిజైన్ పరంగా, గ్రాండ్ విటారా బోల్డ్ మరియు అగ్రెసివ్ లుక్‌ను కలిగి ఉంది. ఇందులో షార్ప్‌ ఫ్రంట్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్‌లు గమనించవచ్చు. ఇంటీరియర్ ప్రీమియం మెటీరియల్స్ మరియు అధునాతన ఫీచర్లతో విశాలమైన స్పేస్‌ని పొందవచ్చు. మారుతి సుజుకి ఈ కారును తయారు చేసేటప్పుడు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను అందించింది. త్వరలోనే ఈ కారు ఏడీఏఎస్‌-2 టెక్నాలజీని అందించే అవకాశం ఉంది.

Maruti-Grand-Vitara

గ్రాండ్ విటారాలో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS మరియు బ్యాక్‌ పార్కింగ్ కెమెరాతో వస్తుంది. ఇది ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి రూపొందించిన హై-స్టాండర్డ్‌ బాడీ నిర్మాణాన్ని కూడా కలిగి ఉంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా భారతదేశంలో పర్యావరణ అనుకూల వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి రూపొందించబడింది. హైబ్రిడ్ టెక్నాలజీతో విడుదలైన ఈ కారు సేల్స్‌లో గణనీయమైన వృద్ధిని సాధించింది.

ఈ కారును జనాలు ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ విభాగంలో ఈ కారు రెండో స్థానంలో కొనసాగుతుంది. సేల్స్‌లో నెల నెలా వృద్ధి సాధిస్తూ మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటుంది. మంచి మైలేజీతో పాటు తక్కువ ధరలో యాక్సెసిరీస్‌ని అందిస్తుండటం ఈ కారు సేల్స్‌ పెరిగేందుకు దోహదపడుతున్నాయి. ప్రస్తుతం మిడిల్‌ క్లాస్‌ వాళ్లు మంచి హైబ్రిడ్‌ కారు కొనుగోలు చేయాలని భావిస్తే ఈ కారు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

సుజుకి గ్రాండ్ విటారా యొక్క హైబ్రిడ్ వేరియంట్ ధర మిగతా ఇతర కంపెనీ కార్లతో పోల్చుకుంటే తక్కువ ధరలో లభిస్తుంది. ఈ కారు విడుదల చేసే కాలుష్యం చాలా తక్కువ. కాబట్టి ప్రజలు ఈ కారును కొనుగోలు చేయడానికి వెనకడుగు వేయడం లేదు. మీరు చెల్లించే ప్రతీ పైసాకు ఈ కారు ఖచ్చితమైన వాల్యూని అందిస్తుంది. ఎస్‌యూవీ విభాగంలో ఈ కారుని ఎటువంటి సందేహం లేకుండా కొనుగోలు చేయవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 27, 2024, 12:34 [IST]
English summary
Maruti suzuki vitara grand hybrid technology gives best mileage and best driving experience
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+