మారుతి హైబ్రిడ్‌ 'కారా మజాకా'.. ఈ కారు ఆన్‌రోడ్‌ ధరలు హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబయిలో ఎలా ఉన్నాయంటే?

మారుతి సుజుకి కార్లకు దేశంలో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం కారు సేల్స్ విభాగంలో ఈ సంస్థ టాప్‌లో కొనసాగుతుంది. తక్కువ ధరలో అధిక పీఛర్లు అందించడంతో ఈ కారు సంస్థ పాపులారిటీని సాధించింది. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు ఈ సంస్థ ఉత్పత్తి చేసే కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఈ కారు సంస్థ దేశవ్యాప్తంగా నెక్సా, ఎరీనా డీలర్ షిప్‌ల ద్వారా ఆల్టో, సెలెరియో, స్విఫ్ట్, ఫ్రాంక్స్, బాలెనో, వాగన్ ఆర్, ఇగ్నిస్, జిమ్నీ వంటి తదితర కార్లను విక్రయిస్తోంది. ఆ కంపెనీ నుంచి విడుదలైన మారుతి గ్రాండ్‌ విటారాకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది.

ఈ కారు అతి తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా నిలిచింది. ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉంది. అందువల్ల వినియోగదారులు ఈ కారుని కొనుగోలు చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని మారుతి నెక్సా షోరూమ్‌ల్లో ఈ కారు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు ఆన్-రోడ్ ధర మీకోసం..

Maruti-Suzuki-Grand-Vitara-On-Road-Price

హైదరాబాద్‌లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా టాప్-ఎండ్ మోడల్ (హై-ఎండ్‌) ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ సీవీటీ ఆన్-రోడ్ ధర రూ .24.56 లక్షలుగా ఉంది. ఇదే మోడల్ ధర వాణిజ్య నగరమైన ముంబైలో రూ.23.65 లక్షలుగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో రూ.22.91 లక్షలుగా ఉంది. ఇక బెంగళూరులో రూ.24.92 లక్షలుగా ఉంది.

ఈ కారు హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్), సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో లభిస్తుంది. ఈ వెర్షన్లలో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్, 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ కలదు. ఇది వరుసగా 103 ps మరియు 137 ps పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ ఆధారిత మోడల్లో 1.5-లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ 93 పిఎస్ శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Maruti-Suzuki-Grand-Vitara

కొత్త గ్రాండ్ విటారా వేరియంట్లను బట్టి 5-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు ఇ-సీవీటీ గేర్ బాక్స్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఈ కారు పెట్రోల్ వేరియంట్లు లీటరుకు 19.38 - 27.97 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. ఇక సీఎన్‌జీ వేరియంట్లు కిలోకు 26.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. మీరు ఎక్కడైనా ట్రిప్‌కి వెళ్తే ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 373 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంది.

9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జర్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి.

Maruti-Suzuki-Grand-Vitara-Price

కొత్త మారుతి సుజుకి గ్రాండ్ విటారా అత్యాధునిక డిజైన్‌ని కిలిగి ఉంది. ఆకర్షణీయమైన కలర్లలో ఇది లభిస్తుంది. రెడ్, నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే మరియు మరెన్నో ఇతర ఆకర్షణీయమైన కలర్లలతో ఈ కారు లభిస్తుంది. ఈ కారులో 5 హాయిగా కూర్చొని దూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా వోక్స్ వ్యాగన్ టిగోర్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎంజి ఆస్టర్, టయోటా అర్బన్ ఎస్ యూవీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఆల్ఫా ప్లస్ హైబ్రిడ్ సీవీటీతో పాటు, ఈ కారు సిగ్మా, డెల్టా, జీటా ప్లస్ వేరియంట్ ఆప్షన్‌లలో కూడా లభిస్తుంది. అయితే ఈ కారు ఆన్-రోడ్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2024, 9:42 [IST]
English summary
Maruti suzuki grand vitara on road prices in different states
Read more on: #maruti suzuki #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+