హ్యుందాయ్, కియా, టాటా కార్లకు గట్టి సవాల్ విసురుతున్న మారుతి హైబ్రిడ్ కారు
మారుతి సుజుకి హైబ్రిడ్ కారుకి గ్రాండ్ విటారాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారులోని అధునాతన ఫీచర్లు, ఇంజిన్ ఫర్ఫామెన్స్, ఇతర సేఫ్టీ ఫీచర్లు కస్టమర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఈ కారు ఈ సెగ్మెంట్‌లలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు టాటా హారియర్ వంటి కార్లకు గట్టి పోటీగా ఇస్తుంది. మారుతిలోని చవకైన యాక్ససిరీస్ సర్వీస్ ఆధారంగా ఈ హైబ్రిడ్ కారుని కొనుగోలు చేసేందుకు జనాలు మక్కువ చూపిస్తున్నారు. గ్రాండ్ విటారా దాని ప్రధాన ప్రత్యర్థుల కంటే మెరుగైన పనితీరుతో ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ప్రస్తుతం ఈ కారు సేల్స్‌లో హ్యుందాయ్ క్రెటా తర్వాతి స్థానంలో ఉంది.
డిజైన్: గ్రాండ్ విటారాలో బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ మరియు స్లీక్ LED హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. వినియోగదారులకు ఈ డిజైన్ ఆకట్టుకునేలా రూపొందించారు. హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్‌లలో క్రోమ్ స్ట్రిప్స్ మరియు స్పోర్టీ లుక్‌తో కూడిన స్టైలిష్ డిజైన్లను కలిగి ఉన్నాయి. టాటా హారియర్ దాని యూనిక్ స్టైల్ రూపంతో ఉండనుంది. డిజైన్ పరంగా గ్రాండ్ విటారా స్మార్ట్‌గా కనిపిస్తుంది.

గ్రాండ్ విటారాలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది 103 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన మైలేజీ కోసం హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు అందుబాటులో ఉంది. హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు కలిగి ఉన్నాయి. టాటా హారియర్‌లో కేవలం 2.0-లీటర్ డీజల్ ఇంజిన్ కలదు. ఇది అద్భుతమైన ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది.

గ్రాండ్ విటారాలో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఈబీడీ మరియు రియర్ వ్యూ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టాటా హారియర్ టార్క్ కంట్రోల్ మరియు కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో అధునాతన సేఫ్టీని అందిస్తుంది.
గ్రాండ్ విటారాలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 9 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. హెడ్స్ అప్ డిస్‌ప్లే, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా ఇందులో అందించారు. హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ ఇలాంటి సాంకేతిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. సెల్టోస్ 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అందిస్తుంది. టాటా హారియర్‌లో 8.8 అంగుళాల టచ్‌స్క్రీన్, జేబీఎల్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి.

గ్రాండ్ విటారా ధరలు రూ .9.50 లక్షల నుంచి ప్రారంభ కానున్నాయి. అయితే ఈ కారు మార్కెట్‌లో గట్టి పోటీని ఇస్తుంది. హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ ధరలు వరుసగా రూ .9.99 లక్షలు మరియు రూ .9.95 లక్షలగా ఉన్నాయి. టాటా హారియర్ ప్రారంభ ధర రూ .14.65 లక్షలుగా ఉంది. దీనికి కారణం ఈ ప్రీమియం మోడల్‌లో అందుబాటులో ఉంది.
గ్రాండ్ విటారాకు ఉన్న అద్భుతమైన స్టైల్, కంఫర్ట్, పెర్ఫార్మెన్స్ మరియు మంచి సేఫ్టీని అందిస్తుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు టాటా హారియర్ వంటి వాటి నుంచి ఇది గట్టి పోటీని ఎదుర్కొంటుంది. అయితే దీని హైబ్రిడ్ వేరియంట్ మంచి మైలేజీతో పాటు బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. మంచి ఫీచర్లు, ఫర్ఫమెన్స్ కారు కోసం మారుతి సుజుకి గ్రాండ్ విటారా ది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








