ఈ కారుని కొనేందుకు ఎగబడుతున్న జనం.. 60,000 కి పైగా బుకింగ్స్
మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) కారుకి మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ కారుని కొనేందుకు జనాలు షోరూమ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. ఈ కారుని బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే కంపెనీ కార్లను ఉత్పత్తి చేస్తుంది.
మధ్య తరగతి కుటుంబాలు అత్యంత అమితంగా ఇష్టపడే కార్లలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుంది. మే 2024 నాటికి భారీ సంఖ్యలో ఈ మారుతి సుజుకి కార్లను కస్టమర్లు బుక్ చేసుకుంటున్నారు. ఊహించని విధంగా ఈ కారు సంస్థ ఆర్డర్లను పొందుతోంది. ఈ ఆటోమేకర్ ప్రస్తుతం సుమారు 1.75 లక్షల యూనిట్లకు పైగా ఓపెన్ ఆర్డర్‌లను అందుకుంది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఈ కంపెనీ నుంచి ప్రస్తుతం అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో మారుతి ఎర్టిగా కారుకి భారీ డిమాండ్ ఉంది. ఈ కారు ఒక్కటే ఇప్పటివరకూ 60,000 పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉంది. ఆ తర్వాత స్థానంలో బ్రెజ్జా (Brezza) 20,000 యూనిట్లు మరియు స్విఫ్ట్ డిజైర్ 17,000 యూనిట్ల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇక మధ్య తరగతి కుటుంబాలు ఇష్టపడే వ్యాగన్ ఆర్ 11,000 పైగా ఓపెన్ బుకింగ్స్ పొందింది. ఈ క్రమంలో కస్టమర్ల డిమాండ్లను నెరవేర్చేందుకు కంపెనీ కృషి చేస్తోంది. అందుకు తగినట్లుగా ఉత్పత్తిని పెంచుతోంది. ఈ క్రమంలో గత నెలలో మారుతి దాని ఉత్పత్తిని విస్తరించడంతో పెండింగ్ ఆర్డర్‌లు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.

అదేవిధంగా మారుతి సుజుకి తన మనేసర్ ప్లాంట్‌లో కంపెనీ ప్రొడక్షన్ కెపాసిటీని కూడా గణనీయంగా పెంచింది. ఈ సంఖ్యను ఏడాదికి లక్ష యూనిట్లకు పెంచడంతో.. కస్టమర్లు త్వరితగతిన తాము కొనుగోలు చేసిన కార్ల డెలివరీలను అందుకునేలా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మరోవైపు, మారుతి ఇప్పుడు ప్రతి సంవత్సరం 9 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఇక అత్యధిక పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా 7- సీటర్ MUV వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కారును సంస్థ 9 వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ధర విషయానికొస్తే ఎర్టిగా రూ. 8.69 లక్షల నుంచి రూ. 13.03 లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి.

మారుతి సుజుకి ఎర్టిగా(Maruti Suzuki Ertiga Pending Orders)లో 1462 సీసీ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ MUV రెండు ట్రాన్స్‌మిషన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎర్టిగా లీటరుకు 20.3 కి.మీ నుంచి 26.11 కి.మీ మైలేజ్‌ను అందించగలదు.
పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్లలో మారుతి ఎర్టిగా అందుబాటులో ఉంది. ఇక సేఫ్టీ పరంగా మారుతి ఎర్టిగా NCAP క్రాష్ టెస్టులో 3 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఇందులో నాలుగు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కస్టమర్ల కోసం 7 ఆకర్షణీయమైన కలర్స్‌లో ఎర్టిగాను సంస్థ ప్రవేశపెట్టింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








