మారుతి ఇగ్నిస్ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. భారీ ఫీచర్లు జోడింపు.. ధర ఎక్కువేం కాదు!
మారుతి సుజుకి తక్కువ ధరలో కార్లను అందింస్తుంది. ప్రారంభ మోడళ్లలో ఒకటైన ఇగ్నిస్ (Maruti Suzuki Ignis)ని ఇప్పుడు కొత్త ప్రత్యేక ఎడిషన్ రేడియన్స్‌ని (Radiance) విడుదల చేసింది. ఈ వెర్షన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇగ్నిస్ కంటే భిన్నంగా ఇంటర్నల్ మరియు ఎక్స్‌టీరియన్ డిజైన్‌లో భారీ మార్పులను చేసింది. ఈ మార్పుల ద్వారా ఈ కారు ప్రత్యేకంగా కనిపించనుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ని ఒడిసి పట్టేందుకు ఈ ప్రత్యేక ఎడిషన్‌ని తీసుకువచ్చింది.
రేడియన్స్ ఎడిషన్ మరింత స్టైలిష్‌గా, అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త రేడియన్స్ ఎడిషన్‌ని కేవలం రూ. 5.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణ సిగ్మా వేరియంట్ కంటే కూడా రూ. 35 వేలు చౌక కావడం గమనార్హం. స్టాండర్డ్ సిగ్మా రూ.5.84 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి తీసుకున్న ఈ నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటోమొబైల్ కంపెనీలు సాధారణంగా స్పెషల్ ఎడిషన్‌ని కొంచెం ఎక్కువ ధరకు విక్రయిస్తాయి. అయితే మారుతి సుజుకి ఈ స్పెషల్ ఎడిషన్‌ని మాత్రం తక్కువ ధరకే అమ్మకానికి తీసుకొచ్చింది. మారుతి సుజుకి తక్కువ ధరలో స్పెషల్ ఎడిషన్‌ని లాంచ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మారుతి సుజుకి ఇగ్నిస్ నాలుగు వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి సిగ్మా, డెల్టా, జీటా మరియు ఆల్ఫా వేరియంట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకి ఇప్పుడు ప్రత్యేక ఎడిషన్‌ని కూడా లాంచ్ చేసింది. ఈ కారు ఏడు మోనోక్రోమ్, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. హ్యాచ్ బ్యాక్ కారుకు కస్టమర్లను ఆకర్షించేందుకు రేడియెన్స్ ఎడిషన్‌ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది.
కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ హ్యాచ్‌బ్యాక్ మంచి ఆప్షన్ కానుంది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ బానెట్, ప్రొజెక్టర్ తరహా హెడ్‌ల్యాంప్స్, రూఫ్ రైల్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, 15 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లోని కొన్ని ఫీచర్లు ఇంటీరియర్‌ని మరింత ఆకర్షించనుంది. ఇందులో మీడియం సైజ్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
అంతే కాకుండా ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను ఈ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్‌లో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ కారును సుజుకి టోటల్ ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ (టెక్ట్) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది కారులో ప్రయాణించే వారికి అదనపు భద్రతను కల్పిస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ABS విత్ EDB, కీలెస్ ఎంట్రీ ఉన్నాయి.
వీటితో పాటు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఇక ఇంజిన్ విషయానికొస్తే ఎలాంటి మార్పులు చేయలేదు. ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్‌లో 1.2-లీటర్ కె-సిరీస్ డ్యూయల్ జెట్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ కలదు. ఇది గరిష్టంగా 89bhp మరియు 113nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్ ఆప్షన్స్‌తో వస్తుంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ ఇండియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కొనుగోలుకి అందుబాటులో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మరియు సిట్రోయెన్ సీ3 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది. ఈ ఎడిషన్ లాంచ్‌తో రాబోయే రోజుల్లో మారుతి ఇగ్నిస్‌కి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. మారుతి ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్ దాని రెగ్యులర్ మోడళ్ల మాదిరిగానే నెక్సా షోరూముల్లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








