వావ్‌.. సుజుకి నుంచి తక్కువ ధరలో హైబ్రిడ్‌ కారు.. ఆయన చెప్పారంటే వచ్చేస్తాయంతే!!

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీసంస్థ సుజుకి, భారతదేశంలో తక్కువ ధరలో హైబ్రిడ్(Plug In Hybrid Vehicles) వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీపై పనిచేస్తుందని MSIL ఛైర్మన్‌ RC భార్గవ తెలిపారు. ఈ క్రమంలో సుజుకి యొక్క ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌లు త్వరలోనే భారత్‌లోకి రానున్నాయి.

డీజిల్‌ వేరియంట్‌, సీఎన్‌జీ కార్ల ధరలతో పోలిస్తే హైబ్రిడ్ టెక్ కార్ల(Hybrid Cars At Low Prices) ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తుంటారు. కాగా టయోటా వంటి దిగ్గజ సంస్థలు హైబ్రిడ్‌ కార్లను ప్రవేశపెట్టడంతో వాటి సాంకేతిక ఖర్చులు ఎక్కువగా ఉంటాయని RC భార్గవ తెలిపారు. ఈ క్రమంలో హైబ్రిడ్‌ కార్ల ధర కూడా పెరుగుతోందని పేర్కొన్నారు.

Suzuki-Is-Working-On-Low-Cost-Hybrid-Cars

తాజాగా RC భార్గవ కంపెనీ Q4-ఎర్నింగ్స్ విలేకరులతో ఆయన మాట్లాడారు. మారుతీ సుజుకి జపాన్ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (SMC) భారత మార్కెట్‌ కోసం సరసమైన హైబ్రిడ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందని భార్గవ తెలిపారు. ప్రస్తుతం, ఆటోమేకర్ గ్లోబల్ టయోటా-సుజుకి కూటమిలో భాగంగా దేశంలో రెండు బలమైన హైబ్రిడ్ మోడళ్లు గ్రాండ్‌ విటారా, ఇన్విక్టోలను విక్రయిస్తోంది.

ఈ క్రమంలో తక్కువ ధరలో హైబ్రిడ్‌ కార్లలో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి చాలా పని జరుగుతోందని భార్గవ విలేకరులతో పేర్కొన్నారు. ఇంధన ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ.. మరింత సరసమైన ధరలో హైబ్రిడ్‌ టెక్నాలజీతో చిన్న కార్లను త్వరలో సుజుకి రూపొందించనుంది. ఇంకో గుడ్‌ న్యూస్‌ ఏంటంటే.. వీటి GST కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మెరుగైన మైలేజ్‌తో ఇవి రానున్నాయని భార్గవ వెల్లడించారు.

Suzuki-Is-Working-On-Low-Cost-Hybrid-Cars

కాగా భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలపై 5 శాతం పన్ను విధిస్తుండగా.. హైబ్రిడ్‌ వాహనాలపై 43 శాతం పన్ను కేంద్ర ప్రభుత్వం విధిస్తోంది. అయితే పెట్రోల్‌ కార్లపై విధిస్తున్న 48 శాతం జీఎస్టీతో పోలిస్తే ఇది తక్కువ. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ వాహనాలపై జీఎస్‌టీని 5 శాతానికి మరియు ఫ్లెక్స్ ఇంజిన్‌లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన RC భార్గవ.. హైబ్రిడ్‌ల మార్కెట్ అనేది సాధారణంగా వాటి ధరను బట్టి నిర్ణయించబడుతుందని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ధరలపై జీఎస్టీ కౌన్సిల్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీంతో హైబ్రిడ్‌ కార్లపై జీఎస్పీ విధివిధానాలపై స్పష్టత వస్తుందని.. ఇందుకోసం కొంతకాలం వెయిట్‌ చేయాలని ఆయన చెప్పారు. హైబ్రిడ్‌లు మరియు EVల విస్తరణ ఎంత త్వరగా జరుగుతుందో వేచి చూడాలని భార్గవ వెల్లడించారు.

Suzuki-Is-Working-On-Low-Cost-Hybrid-Cars

ఇక భారత్‌లోకి ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌లను (PHEVs) తీసుకురావడంపై అడిగిన ప్రశ్నకు మారుతీ సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ & CEO హిసాషి టకేచి స్పందించారు. భారతదేశంలోకి ఈ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు ఇంకా ప్రణాళికలు ఏమీ లేవని.. ఇది చాలా ఆసక్తికరమైన ప్రతిపాదన అని చెప్పారు. త్వరలో దీనిపై ఓ స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.

కాగా ఈ ప్లగ్‌-ఇన్‌ హైబ్రిడ్‌ కార్లను సంస్థ యూరప్‌ మరియు యూఎస్‌ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇక ఈ హైబ్రిడ్ వాహనాలు సాంప్రదాయ అంతర్గత దహన యంత్రాలు మరియు ఎలక్ట్రిక్ మోటార్లు రెండింటి ద్వారా శక్తిని పొందుతూ పనిచేస్తాయి. అయితే వీటిలో కొంత దూరం మాత్రమే ప్రయాణించవచ్చు.

Suzuki-Is-Working-On-Low-Cost-Hybrid-Cars

ఈ ప్లగ్‌ ఇన్‌ హైబ్రిడ్‌ కార్లు వాహనం నడుస్తున్నప్పుడు రీఛార్జ్ అవుతాయి. మీరు కార్లలో పవర్ అప్ చేయడానికి ఛార్జర్‌లో ప్లగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పేరు మాదిరిగానే.. బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగా రీఛార్జ్ చేసుకునేలా వెసులుబాటు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 27, 2024, 15:25 [IST]
English summary
Maruti suzuki is working on affordable plug in hybrid cars for indian market says rc bhargava
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+