మారుతి ఎంట్రీ లెవల్‌ కార్లపై ఆఫర్ల జాతర.. ఒకటే ధర వద్ద 3 లిమిటెడ్‌ ఎడిషన్‌ కార్లు లాంచ్‌

మారుతి సుజుకి తన ఫ్లాగ్‌షిప్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు అయిన ఆల్టో K 10, S-ప్రెస్సో, సెలెరియో మోడళ్ల ప్రత్యేక ఎడిషన్‌లను తాజాగా విడుదల చేసింది. ఈ కార్లు కేవలం రూ.4.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. డ్రీమ్ సిరీస్‌లో భాగంగా ఈ మూడు మోడళ్లను లిమిటెడ్ ఎడిషన్‌లో మారుతి తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లు కేవలం పరిమిత సంఖ్యలో విక్రయించబడతాయని తెలుస్తుంది. ఈ డ్రీమ్‌ సిరీస్‌ మోడళ్లు ఎన్ని రోజులు అమ్మకానికి ఉంటాయి? ఎన్ని యూనిట్లు సేల్‌ చేస్తామనే వివరాలను మారుతి వెల్లడించలేదు. కానీ ఈ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ లభిస్తుందనడంలో సందేహం లేదు.

కొత్త స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి సెలెరియో డ్రీమ్ సిరీస్ కారు ఆ వేరియంట్‌లోని LXi వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఇక ఆల్టో K10 మరియు S-ప్రెస్సో డ్రీమ్ ఎడిషన్లు రెండూ ఆయా మోడళ్ల టాప్‌ వేరియంట్లు VXi+ వేరియంట్లకు తగినట్లు పొందుపరిచారు. ఈ మూడు మోడళ్లకు ఒకే ధరను కేటాయించడంతో మారుతి సంచలనాలకు తెరలేపింది. తాజాగా విడుదల చేసిన కార్ల పూర్తి వివరాలు మీకోసం..

Maruti-Suzuki-Dream-Series-Limited-Edition-Cars

మారుతి సుజుకి ఆల్టో K 10 డ్రీమ్ సిరీస్: ఈ డ్రీమ్ సిరీస్ హ్యాచ్‌బ్యాక్‌ VXi+ వేరియంట్ ఆధారంగా మారుతి ప్రవేశ పెట్టింది. దీని ఒరిజినల్‌ ధర రూ .5.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. తాజాగా డ్రీమ్‌ సిరీస్‌లోని ఈ కారులో రివర్స్ పార్కింగ్ కెమెరా, సెక్యూరిటీ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది. ఈ మోడల్ యాక్ససరీలపై డిస్కౌంట్లతో పాటు ఇతర ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు.

మారుతి సుజుకి S-ప్రెస్సో డ్రీమ్ సిరీస్: మారుతి S-ప్రెస్సో కారు VXi+వేరియంట్ ఆధారంగా రూపొందించిన ఈ కారు బయట డిజైన్‌లో వీల్ ఆర్చ్‌లపై మ్యాట్ బ్లాక్ క్లాడింగ్, బ్యాక్‌ మరియు సైడ్‌లలో స్కిడ్ ప్లేట్లు, సిల్వర్ బాడీ సైడ్ మోల్డింగ్, గ్రిల్, క్రోమ్ గార్నిష్ వంటి ఫీచర్లతో వస్తుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా, సెక్యూరిటీ సిస్టమ్, ఒక జత స్పీకర్లు, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ మరియు మరెన్నో ఉన్నాయి.

మారుతి సుజుకి సెలెరియో డ్రీమ్ సిరీస్: భారత మార్కెట్‌లో విక్రయించే అత్యంత సరసమైన హ్యాచ్ బ్యాక్‌లలో సెలెరియో ఒకటి. డ్రీమ్ సిరీస్ ఎడిషన్‌లోని ఈ కారు LXi వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఈ ఎడిషన్‌లో కారు రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఒక జత స్పీకర్లను జతచేశారు. ఇప్పుడు ఈ కారు కూడా కేవలం రూ.4.99 లక్షల ధరలో అందుబాటులో ఉంది.

Maruti-Suzuki-Auto-Gear-Shift-Cars

ఎంట్రీ లెవల్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి మారుతి సుజుకి కొత్తగా టెక్నికల్‌ ఫీచర్లు జోడిస్తుంది. అంతే కాకుండా ఇటీవల మారుతి సుజుకి అమ్మకాలను పెంచడానికి AGS (ఆటో గేర్‌ షిఫ్ట్‌) బాక్స్ కార్ల ధరలను సైతం తగ్గించింది. డ్రీమ్ సిరీస్ ఎడిషన్‌లతో పాటు నుంచి ఎస్-ప్రెస్సో, ఆల్టో కె 10, సెలెరియో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్, బాలెనో, ఇగ్నిస్‌ మోడళ్ల AGS వేరియంట్ల ధరలను కూడా తగ్గించింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, June 6, 2024, 12:32 [IST]
English summary
Maruti suzuki launched dream series limited editions of alto k10 s presso and celerio
Read more on: #maruti suzuki #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+