మారుతి కార్లపై అద్భుతమైన డిస్కౌంట్స్!.. ఏ మోడల్ మీద ఎంతంటే..

మారుతి సుజుకి ఈ నెలలో ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ ఉన్నాయి. ఏ మోడల్ మీద ఎంత డిస్కౌంట్ అనేది ఇక్కడ చూసేద్దాం.

మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10)

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి ఆల్టో కే10 కొనుగోలు పైన ఇప్పుడు కస్టమర్ గరిష్టంగా రూ.62000 బెనిఫిట్స్ పొందవచ్చు. ఆల్టో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ వెర్షన్ మీద ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే మాన్యువల్ వెర్షన్ మీద రూ.57000, CNG వెర్షన్ మీద రూ.40000 డిస్కౌంట్ లభిస్తుంది. మార్కెట్లో ఆల్టో కే10 ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య ఉంది.

Maruti Alto K10

మారుతి ఎస్-ప్రెస్సో (Maruti S-Presso)

మినీ ఎస్‌యూవీగా పిలువబడే మారుతి ఎస్-ప్రెస్సో కొనుగోలుపైన కస్టమర్ గరిష్టంగా రూ. 61000 (ఆటోమాటిక్ వేరియంట్) తగ్గింపు పొందవచ్చు. మాన్యువల్ మరియు CNG మోడల్స్ మీద వరుసగా రూ. 56000 మరియు రూ. 39000 తగ్గింపు లభిస్తుంది. ఎస్-ప్రెస్సో ధరలు మార్కెట్లో రూ. 4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల మధ్య ఉన్నాయి. ఇది 1.0 లీటర్ ఇంజిన్ కలిగి 67 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సెలెరియో (Maruti Celerio)

టాటా టియాగోకు ప్రత్యర్థిగా ఉన్న మారుతి సెలెరియో కొనుగోలుపైన కూడా కొనుగోలుదారుడు రూ. 61000 డిస్కౌంట్ (ఆటోమాటిక్ వేరియంట్) పొందవచ్చు. మాన్యువల్ వేరియంట్ మీద రూ. 56000, CNG వేరియంట్ కొనుగోలుపైన రూ. 39000 డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల ధర మధ్యలో లభించే ఈ కారు మంచి డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.

Maruti Celerio

మారుతి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R)

వ్యాగన్ ఆర్ కొనుగోలుపైన ఈ నెలలో కస్టమర్లు రూ. 61000 (ఆటోమాటిక్ వేరియంట్ కొనుగోలుపైన) తగ్గింపు పొందవచ్చు. మాన్యువల్ వేరియంట్ మీద రూ. 56000, CNG వేరియంట్ కొనుగోలుపైన రూ. 36000 డిస్కౌంట్ లభిస్తుంది. టాటా టియాగోకు ప్రత్యర్థిగా ఉన్న ఈ కారు మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతోంది. కాగా ఇప్పుడు అందించే డిస్కౌంట్స్ వల్ల మరిన్ని అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

మారుతి స్విఫ్ట్ (Maruti Swift)

ఈ నెలలో (2024 మార్చి) మారుతి స్విఫ్ట్ కొనుగోలుపైన కస్టమర్ రూ. 42000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. స్విఫ్ట్ ఆటోమాటిక్ మరియు మాన్యువల్ వేరియంట్ల మీద వరుసగా రూ. 37000 మరియు రూ. 22000 డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.89 లక్షల మధ్య లభించే ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. కంపెనీ త్వరలోనే నాల్గవ జనరేషన్ స్విఫ్ట్ లాంచ్ చేయనుంది.

Maruti Swift

మారుతి డిజైర్ (Maruti Dzire)

స్విఫ్ట్ మాదిరిగానే, డిజైర్ కూడా త్వరలోనే అప్డేటెడ్ రూపంలో రానున్నట్లు సమాచారం. డిజైర్ కొనుగోలుపై కూడా కంపెనీ డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే ఏ వేరియంట్ మీద ఎంత అనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు, కాబట్టి కొనుగోలుదారు సమీపంలో ఉండే కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. దీని ధర రూ. 6.57 లక్షల నుంచి రూ. 9.39 లక్షల మధ్య ఉంది.

మారుతి ఈకో (Maruti Eeco)

మారుతి ఈకో కొనుగోలుపైన కంపెనీ ఈ నెలలో రూ. 29000 తగ్గింపును అందిస్తోంది. CNG కొనుగోలుపైన కస్టమర్ రూ. 24000 తగ్గింపు పొందవచ్చు. మారుతి ఈకో ధరలు మార్కెట్లో రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.58 లక్షల మధ్య ఉన్నాయి. నిజానికి భారతదేశంలో ఎక్కువయింది కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో ఈకో చెప్పుకోదగ్గ మోడల్. గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీనికి మంది క్రేజ్ ఉంది.

NOTE: మారుతి సుజుకి అందించే డిస్కౌంట్స్ కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితం చేయబడి ఉంటాయి. కాబట్టి పైన చెప్పిన మోడల్స్ ఈ నెలలో కొనుగోలు చేస్తే బెనిఫిట్స్ లభిస్తాయి. అంతే కాకుండా కంపెనీ అందించే డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. డిస్కౌంట్లకు సంబంధించిన మరిన్ని ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవలసిందిగా మనవి.

More from DriveSpark

Article Published On: Monday, March 11, 2024, 14:00 [IST]
English summary
Maruti suzuki march discounts on alto k10 to eeco
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+