మారుతి కార్ల కొనుగోలుకు ఇదే మంచి సమయం.. ఎందుకో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
దేశీయ మార్కెట్లో ఎక్కువమంది కస్టమర్ల మనసు దోచిన మారుతి సుజుకి ఇప్పుడు ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మారుతి స్విఫ్ట్
మారుతి సుజుకి తన కొత్త స్విఫ్ట్ కారును ఈ నెల 9న అధికారికంగా లాంచ్ చేయనుంది. అయితే అంతకంటే ముందు కంపెనీ సాధారణ స్విఫ్ట్ మీద డిస్కౌంట్స్ ప్రకటించింది. స్విఫ్ట్ మాన్యువల్ వేరియంట్ మీద రూ. 38000, మాన్యువల్ వేరియంట్ మీద రూ. 33100 మరియు CNG వేరియంట్ రూ. 18100 వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. ఈ కారు ధర మార్కెట్లో రూ.6.24 లక్షల నుంచి రూ.9.14 లక్షలు.

మారుతి డిజైర్
డిజైర్ కొనుగోలు మీద మారుతి సుజుకి మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. హోండా అమేజ్, టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న డిజైర్ ఆటోమాటిక్ వెర్షన్ మీద రూ. 30000 మరియు మాన్యువల్ వెర్షన్ మీద రూ. 25000 విలువైన తగ్గింపులను అందిస్తోంది. డిజైర్ ధరలు రూ. 6.57 లక్షల నుంచి రూ. 9.39 లక్షల మధ్యలో ఉంది.
మారుతి ఆల్టో కే10
ఆల్టో కే10 కొనుగోలు మీద కూడా కంపెనీ తగ్గింపులను అందిస్తోంది. ఆల్టో కే10 ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ వేరియంట్ మీద రూ. 55100, మాన్యువల్ వేరియంట్ మీద రూ. 50100 మరియు CNG వేరియంట్ మీద రూ. 43100 వరకు తగ్గింపులను అందిస్తోంది. ఈ కారు 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 67 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి ఎస్-ప్రెస్సో
మారుతి ఎస్-ప్రెస్సో కొనుగోలు మీద కూడా మంచి డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్-ప్రెస్సో ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ. 55100, మాన్యువల్ వేరియంట్ మీద రూ. 50100 మరియు CNG వేరియంట్ మీద రూ. 48000 వరకు తగ్గింపులు లభిస్తోంది. ఈ డిస్కౌంట్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎస్-ప్రెస్సో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.
మారుతి సెలెరియో
మారుతి సెలెరియో కొనుగోలు మీద కూడా మంచి డిస్కౌంట్ లభిస్తుంది. సెలెరియో ఆటోమాటిక్ వేరియంట్ మీద రూ. 55100, మాన్యువల్ వేరియంట్ మీద రూ. 50100 మరియు CNG వేరియంట్ మీద రూ. 48000 వరకు తగ్గింపులు లభిస్తోంది. దీని ధర రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్య ఉంటుంది. ఈ డిస్కౌంట్ మే చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మారుతి వ్యాగన్ ఆర్
వ్యాగన్ ఆర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.0 లీటర్ మరియు 1.2 లీటర్ వెర్షన్ మీద రూ. 58100 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. మాన్యువల్ వేరియంట్ మీద రూ. 53100 వరకు, CNG వేరియంట్ మీద గరిష్టంగా రూ. 38100 వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ధర రూ. 5.55 లక్షల నుంచి రూ. 7.26 లక్షల మధ్య ఉన్నాయి.
మారుతి ఈకో
మారుతి ఈకో పెట్రోల్ వేరియంట్ మీద గరిష్టంగా రూ. 25100 డిస్కౌంట్ మరియు CNG వెర్షన్ మీద రూ. 23100 డిస్కౌంట్ లభిస్తుంది. దేశీయ మార్కెట్లో మారుతి ఈకో ధరలు రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.58 లక్షల మధ్య ఉంది. అయితే కంపెనీ ఈ నెలలో అందించే ఆఫర్స్ ఉపయోగించే కొనుగోలు చేస్తే.. కొంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

మారుతి బ్రెజ్జా
మారుతి బ్రెజ్జా కొనుగోలుపైన కేవలం రూ. 10000 మాత్రమే డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కూడా ఎక్స్ఛేంజ్ బోనస్ కింద లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో బ్రెజ్జా ధరలు రూ. 8.34 లక్షల నుంచి రూ. 14.14 లక్షల మధ్య ఉన్నాయి. ఈ నెలలో బ్రెజ్జా కొనుగోలు చేసేవారు రూ. 10000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
గమనిక: మారుతి సుజుకి అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తాయి. కాబట్టి మారుతి కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి. ఈ డిస్కౌంట్స్ మే 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








