పెట్రోల్, డీజిల్ కార్లు కనుమరుగు కానున్నాయా? చివరికి మారుతీ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉంటుందో తెలుసా!

పెట్రోల్, డీజిల్ కార్లకు భవిష్యత్తులో ముగింపు పలకాల్సిన అవసరం వచ్చేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ప్రధానంగా భారత్‌లో ఈవీల వాడకం విపరీతంగా పెరిగింది. మార్కెట్లోకి ఏదైనా కొత్త ఈవీ మోడల్ విడుదల అయిందంటే చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 2024 ఏడాదిలో పెట్రోల్, డీజిల్, cng కార్ల అమ్మకాలతో పాటే ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌ కూడా మెరుగ్గానే ఉన్నాయి. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను భరించలేక కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారు మొదటగా ఈవీ కార్ల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. బ్యాటరీ పనితీరు, ఛార్జింగ్, రేంజ్ మొదలగు కీలక వివరాలను తెలుసుకుని ఈవీ కార్లను కొనడానికి ముందుకు వస్తున్నారు. ప్రపంచదేశాలతో పోలిస్తే, భారత్ ఈవీ మార్కెట్‌కు మెయిన్ గమ్యస్థానంగా మారుతుంది.

దీంతో లోకల్‌గా ఉన్న కార్ల తయారీ దారులే కాకుండా అంతర్జాతీయంగా పేరున్న పెద్ద కంపెనీలు కూడా భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. సాధారణ కార్లను తయారు చేసే సంస్థల నుంచి మొదలుకుని విలాసవంతమైన లగ్జరీ కార్లను తయారీ కంపెనీలు ఈవీ కార్లను తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, cng కార్లను మాత్రమే విడుదల చేసిన కంపెనీలు పెరుగుతున్న ఈవీ మార్కెట్‌తో తమ ధోరణిని మార్చుకుంటున్నాయి.

Maruti E-vitara Electric Official Teaser

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు వెనుకబడిని దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన వివరాలను ఇటలీలోని మిలన్‌లో సుజుకి మోటార్ కార్పొరేషన్ కారు డిజైన్‌ను ఆవిష్కరించి, వివరాలను వెల్లడించింది.

ఈ కొత్త మోడల్ పేరు ఇ-విటారా (evitara). ఇప్పటి వరకు ఇతర కార్ల తయారీ కంపెనీలు ఈవీ కార్ల విషయంలో చాలా ముందు ఉండగా, మారుతీ ఇ-విటారా లాంచ్‌తో మార్కెట్లో మారుతీ సుజుకీ కంపెనీ తన సత్తా చూపించడానికి సిద్ధం అవుతుంది. ఇ-విటారా కారును గుజరాత్‌లోని కంపెనీ కార్ల తయారీ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. దీని టీజర్‌ను చూసినట్లయితే కారు డిజైన్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోకు ముందు మారుతీా సుజుకీ తన రాబోయే ఎలక్ట్రిక్ కారు టీజర్‌ను విడుదల చేసింది. ఇది ఇండియా మార్కెట్‌తో పాటు జపాన్, యూరోపియన్ యూనియన్‌‌, ప్రపంచంలోని ఇతర దేశాల్లో లాంచ్ అవుతుంది. ఇ-విటారా కొలతల విషయానికి వస్తే, 4,275 మిమీ పొడవు, 1,800 మిమీ వెడల్పు, 1,635 మిమీ ఎత్తును కలిగి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్‌ 180 మిమీ, వీల్‌బేస్ 2,700 మిమీ‌గా ఉంటుంది.

మారుతీ ఇ-విటారా ఉత్పత్తిని గుజరాత్‌లో 2025 నాటికి ప్రారంభిస్తుంది. ఈ మోడల్‌ను 2023లో జరిగిన ఇండియా ఆటో ఎక్స్‌పో, అలాగే, అక్టోబర్‌లో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించిన మారుతి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని తీసుకొస్తున్నారు. ఇ-విటారా ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన తరువాత టాటా కర్వ్ EV, ఎంజీ ఈవీ కార్లకు గట్టి ప్రత్యర్థిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మారుతీ ఇ-విటారాలో డజన్ల కొద్ది అధునాతన ఫీచర్లు ఉంటాయని అంచనా. సెంటర్ కన్సోల్ డిజైన్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఠినమైన ప్యానెల్‌లతో ఇంటిగ్రేటెడ్ డిస్‌ప్లే, క్యాబిన్ లోపల లగ్జరీ లుక్‌ను కలిగించే లేటెస్ట్ థీమ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, డ్రైవర్లకు అవసరమయ్యే అధునాతన ఆప్షన్లు, ప్రయాణికుల రక్షణ కోసం ఎయిర్‌బ్యాగులు, ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి. ఇది సింగిల్ ఛార్జ్‌తో 400 కిమీల వరకు వెళ్తుందని తెలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 21, 2024, 12:30 [IST]
English summary
Maruti suzuki new evitara electric suv official teaser out now
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+