భారీ శుభవార్త.. 33 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు బుకింగ్స్ స్టార్ట్.. గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావొద్దు

దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ(maruti suzuki) భారతదేశంలో ఎక్కువ ఆదరణ కలిగిన మోడల్‌‌గా ఉంది. కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లతో చాలా కార్లు మార్కెట్లోకి వచ్చాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ వాతావరణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కంపెనీ వెంట వెంటనే అధునాతన ఫీచర్లతో కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మారుతీ నుంచి కొత్త తరం డిజైర్(fourth gen dzire) కారు మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. ఇది నవంబర్ 11న విడుదల అవుతుంది. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ అధికారికంగా ప్రకటించింది. ఈ సెడాన్‌పై భారత కస్టమర్లలో చాలా అంచనాలు ఉన్నాయి. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు సమీపంలోని మారుతీ సుజుకీ ఇండియా అరేనా డీలర్‌షిప్‌లను సంప్రదించవచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు, దీని కోసం రూ. 11,000 చెల్లించాల్సి ఉంటుంది.

విడుదలకు మరికొద్ది రోజుల సమయం ఉన్న తరుణంలో ఈ మోడల్‌కు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న కంపెనీ డిజైర్‌ను అధునాతన ఫీచర్లతో తీసుకొస్తుంది. ముందు భాగంలో ఉన్న గ్రిల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సన్నని LED హెడ్‌ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ LED DRLలను కలిగి ఉన్నాయి. ఇవి సుజుకీ బ్యాడ్జ్‌ను మధ్యలో కలుపుతూ స్లిమ్ క్రోమ్ లైనింగ్‌కి దగ్గరగా ఉంటాయి.

Maruti Suzuki New Generation Dzire Bookings

కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, బూట్, ట్వీక్ చేసిన బానెట్, కొత్తగా డిజైన్ చేయబడిన రియర్ బంపర్‌లు, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌లు మొదలైనవి చాలా అందంగా ఉన్నాయి. ఇది సరికొత్త 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ముఖ్యంగా మైలేజ్ విషయానికి వస్తే, మాన్యువల్, AMT గేర్‌బాక్స్ మోడల్‌లు దాదాపు 25 kmpl మైలేజీని అందిస్తాయి.

అలాగే, ఈ కారు CNG ఇంజిన్ ఎంపికతో అందుబాటులో ఉంది. దీనిలో AMD గేర్‌బాక్స్‌ ఉండే అవకాశం లేదు. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికలో మాత్రమే లభించే అవకాశం ఉంది. ప్రధానంగా కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ CNG ఇంజిన్ కిలోకు దాదాపుగా 33 కి.మీ మైలేజీని అందిస్తుందని సమాచారం. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్న సమయంలో సీఎన్‌జీని ఎంచుకునే వారికి ఇది బెస్ట్ ఎంపిక అవుతుంది.

Maruti Suzuki New Generation Dzire Official Bookings

కారు సన్‌రూఫ్ ఆప్షన్‌తో వస్తుంది. లోపల 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రయాణికుల భద్రతకు సంబంధించి భద్రత పరంగా, ఎంట్రీ-లెవల్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

ఇవి కాకుండా సెన్సార్‌లతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBDతో కూడిన ABSలు, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఈ కొత్త డిజైర్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2024, 10:30 [IST]
English summary
Maruti suzuki new generation dzire official bookings opend all details check here
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+