ఈ కంపెనీ కార్ల కోసం షోరూమ్‌కు క్యూకట్టిన జనాలు.. ఇంత మంది వస్తారని ఎవరు ఊహించి ఉండరు!

ఇండియాలో ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ ప్రముఖ కార్ల తయారీదారుగా ఉంది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే అన్ని మోడళ్లు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వాహనాలుగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కార్లను విడుదల చేస్తూ ఇతర కంపెనీల కంటే వేగంగా పరిశ్రమలో అధిక వాటాను సంపాదించుకోడానికి కీలక లాంచ్‌లు చేస్తుంది. ఈ కార్లకు ఉన్న డిమాండ్ కారణంగా 2024లో మెరుగైన విక్రయాలను సాధించింది. ముఖ్యంగా పండుగ సీజ‌న్‌లో అత్యధికంగా కార్లను విక్రయించగా, పండుగ ముగిసిన తర్వాత కూడా కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో నవంబర్ నెలలో మారుతీ సుజుకీ మెరుగైన విక్రయాలను నమోదు చేసింది. తాజాగా కంపెనీ నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం, నవంబర్‌లో కంపెనీ విక్రయాలు మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఎక్కువ. దీంతో కంపెనీ సంతోషం వ్యక్తం చేస్తుంది.

కంపెనీ ప్రధానంగా మధ్యతరగతి వారిని టార్గెట్ చేసి అందుబాటు ధరల్లోనే కార్లను విడుదల చేస్తుంది. అందుకే మారుతీ సుజుకీ విక్రయాలు ఇతర కంపెనీల కంటే కూడా అధికంగా ఉంటాయి. పైగా కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా డెలివరీలను సైతం వేగంగా చేస్తుంది. నవంబర్ నెలలో మారుతీ కార్ల విక్రయాల్లో ఎక్కువగా బడ్జెట్ ధరల్లో లభించేవే ఉన్నాయి.

Maruti Suzuki Sales Report

నవంబర్ నెలలో మారుతీ సుజుకీ 1,81,531 కార్లను విక్రయించింది. వీటిలో చిన్న మోడళ్ల నుంచి పెద్ద కార్ల వరకు ఉన్నాయి. అదే నవంబర్ 2023లో ఇది 1,64,439 కార్ల విక్రయాల కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఏడాది ప్రాతిపదికన ఇది 10.39 శాతం పెరిగింది. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో నెలవారీగా విక్రయాలు 12 శాతానికి పైగా పడిపోయాయి. దీపావళి కారణంగా అక్టోబర్‌‌లో అమ్మకాలు అధికంగా ఉన్నాయి.

ప్రధానంగా తన కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయడానికి మారుతీ సుజుకీ నవంబర్ నెలలో మొత్తం 1,41,312 ప్యాసింజర్ వాహనాలను షోరూమ్‌లకు అందించింది. ఇది గత ఏడాది 2023లో 1,34,158 యూనిట్లతో పోలిస్తే, దాదాపు 5.33 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఏడాది ముగుస్తున్న తరుణంలో డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఇచ్చిన ఇయర్ ఎండ్ సేల్ కూడా అమ్మకాలు పెరగడానికి కారణమైంది.

Maruti Suzuki November 2024 Sales Report Jimmy

దేశీయంగా విక్రయాలతో పాటు మారుతీ సుజుకీ నవంబర్ నెలలో మెరుగైన ఎగుమతులను కూడా నమోదు చేసింది. ప్రధానంగా ఈ నెలలో చిన్న కార్లు అయినటువంటి ఆల్టో, S-ప్రెస్సో వంటి 9,959 కార్లను విక్రయించింది. అదే గత ఏడాది 2023 ఇదే నెలలో ఇవి 9,750 యూనిట్ల విక్రయాలుగా ఉన్నాయి. వీటిలో ఆల్టో కార్లు, S-ప్రెస్సో కంటే కూడా ఎక్కువగా వినియోగదారులను ఆకట్టుకోవడం గమనార్హం.

అలాగే, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, బ్రెజ్జా వంటి ఎస్‌యూవీలు, ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 ఎంపీవీలు నవంబర్‌లో 59,003 యూనిట్లు అమ్ముడుపోగా, గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 49,016 యూనిట్లతో పోలిస్తే దాదాపు 9,987 యూనిట్లు అధికంగా 20.37 శాతం వృద్ధి నమోదైంది. మిడ్-సైజ్ సెడాన్ సియాజ్‌ను నవంబర్‌లో 597 మంది కొనుగోలు చేయగా, ఇది గత ఏడాది ఇదే నెలలో 278 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

Maruti Suzuki November 2024 Sales Report Alto

మారుతీ సుజుకీ వ్యాన్ మోడల్ ఎకో గత నెలలో 10,589 యూనిట్ల విక్రయాలను సాధించగా, 2023 ఇదే నెలలో విక్రయాలను చూసినట్లయితే 10,226 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ ఎగుమతులు కూడా బాగానే ఉన్నాయి. నవంబర్ నెలలో 28,633 యూనిట్లను విదేశాలకు ఎగమతి చేయగా, గత ఏడాది 2023లో 5,683 యూనిట్లుగా నమోదయ్యాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 2, 2024, 15:05 [IST]
English summary
Maruti suzuki november 2024 sales report check all details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+