మారుతి కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇకపై అన్ని కార్లలో ఆ సేఫ్టీ ఫీచర్‌.. దీనికోసం ఒక్క రూపాయి కట్టాల్సిన పనిలేదు!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) కార్లకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ కార్లు అన్నీ బడ్జెట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. దీంతో వీటిని కొనేందుక మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు ఆసక్తి చూపిస్తాయి. ఎక్కువగా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలను టార్గెట్‌ చేస్తూ బడ్జెట్‌ ధరల్లో కార్లను విడుదల చేయడంతో జనాలు ఎక్కువగా ఈ షోరూమ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. మారుతి సుజుకి నెక్సా, ఏరీనా షోరూమ్‌ల ద్వారా ఈ కార్లను విక్రయిస్తుంది. తాజాగా ఆ కంపెనీ సరికొత్త అప్‌డేట్‌ని అందించింది.

ప్రయాణికుల సేఫ్టీని మరింతగా పెంచడానికి కంపెనీ లైనప్‌లోని మొత్తం ప్యాసింజర్ వాహన పోర్ట్‌పోలియోల్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ + (ESP)ను అందుబాటులో తీసుకుస్తున్నట్లు ప్రకటించింది. ఈ కీలకమైన సేఫ్టీ టెక్నాలజీని ఇకపై మారుతి తీసుకువచ్చే అన్ని మారుతి కార్లలో ప్రామాణిక ఫీచర్‌గా తీసుకురానున్నారు. తాజా ఆల్టో K10, ఎస్-ప్రెస్సో మోడళ్లలో కూడా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ని అందిస్తుంది.

Maruti Suzuki offers Electronic Stability Program

కారు ప్రమాద సమయాల్లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ కీలకంగా వ్యవహరిస్తుంది. కారు వెహికిల్ స్టీరింగ్‌ సరైన దిశలో లేనప్పుడు ఈ సిస్టమ్‌ ఆన్‌ అవుతుంది. కారు కంట్రోల్‌ తప్పినప్పుడు బ్రేక్స్‌ అలాగే ఇంజిన్‌ని కంట్రోల్‌ చేసి సవ్య దిశలో ప్రయాణించేలా చేస్తుంది. ఇది కారు ఆన్‌ కాగానే ఆటోమేటిగ్‌ ఆన్‌ అవుతుంది. ఈ సేఫ్టీ ఫీచర్ ఎక్కువగా ప్రజాదరణ పొందుతోంది.

దాదాపు అన్ని కొత్త కార్లలో ఇది ప్రధాన సేఫ్టీ ఫీచర్‌గా అందించబడుతోంది. అయితే మారుతి ఇప్పుడు ఈ ఫీచర్‌పై ఎటువంటి ధర పెంపు లేకుండా తన అన్ని మోడళ్లలో ESPని చేర్చడం గమనార్హం. ఇది కారులోని ప్రయాణికులకు రక్షణ కల్పించనుంది. గత కొన్ని నెలలుగా తమ ఉత్పత్తులపై మారుతి అప్‌గ్రేడ్స్‌ చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే దీనిని ప్రవేశ పెట్టింది.

Maruti Suzuki offers Electronic Stability Program in Maruti Alto K 10

దీనిని ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) లేదా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) లేదా డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC) అని కూడా పిలుస్తారు. ఇది కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ కావడంతో వాహన ప్రమాద సమయంలో స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో డ్రైవర్లు సురక్షితమైన మరింత ఆత్మవిశ్వాసంతో కూడిన డ్రైవింగ్ అనుభవాన్ని పొందుతారు.

ఇది ముఖ్యంగా వాహనం దారి తప్పకుండా చూసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), స్టెబిలిటీ కంట్రోల్ (ఎస్సీ)లను మిళితం చేసే ESP సిస్టమ్ వాహనం కదలికను కొలవడానికి సెన్సార్లను ఉపయోగిస్తుంది. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ద్వారా వాహన గమనాన్ని లెక్కించడానికి మరియు సర్దుబాటు చేయడానికి, స్థిరత్వం మరియు నియంత్రణను పెంచడానికి ప్రాసెస్ చేయబడుతుంది.

మారుతి సుజుకి పోర్‌పోలియోలో స్టాండర్డ్ సేఫ్టీ సూట్‌గా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌, ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంజిన్ ఇ-మొబిలైజర్, ఫ్లెక్సిబుల్ స్టీరింగ్ కాలమ్ మొదలైనవి కూడా ఉన్నాయి. దీంతో మారుతి కార్లలోనూ ఇకపై మెరుగైన సేఫ్టీ ఫీచర్లను పొందవచ్చు. దీంతో సేల్స్‌ మరింత పెరుగుతాయని మారుతి భావిస్తుంది.

మారుతి సుజుకి పోర్ట్‌పోలియోలో ప్రామాణిక ఫీచర్‌గా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ + జోడించడం ద్వారా మా వాహనాలు మరింత సురక్షితంగా తయారయ్యయని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ అన్నారు. ఇది మారుతి కార్లపై ఉన్న నమ్మకాన్ని గణనీయంగా పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కస్టమర్‌ సేఫ్టీ తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు.

మా కస్టమర్లు వారు ఎంచుకున్న మోడల్‌తో సంబంధం లేకుండా మెరుగైన డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ ద్వారా మెరుగైన సేఫ్టీని పొందుతారు. మారుతి సుజుకిలో, మేము అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచామని.. ఇది భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చనుందని పేర్కొన్నారు. హై సేఫ్టీ కార్లను అందిచడం ద్వారా కస్టమర్లకు మరింత చేరువ అవ్వడం ఖాయామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 21, 2024, 17:06 [IST]
English summary
Maruti suzuki offering standard esp safety feature in all passenger vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+