దేశంలోనే అందరి ఫేవరెట్ కార్లపై భారీ మొత్తంలో డిస్కౌంట్స్.. బడ్జెట్ ధరలో కొత్త కారును సొంతం చేసుకోండి..

కొద్ది రోజుల్లో 2024 ఏడాది ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు ఇయర్ ఎండ్‌ సేల్‌ను తీసుకొస్తున్నాయి. డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోడానికి ఈ విధంగా కొత్త ఏడాదికి ముందు డిసెంబర్ నెలలో ఎంపిక చేసిన కార్లపై ప్రత్యేకంగా తగ్గింపును అందిస్తుంటాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలు కొన్ని మోడళ్లపై ఆఫర్లను ప్రకటించగా, తాజాగా వాహన తయారీదారుల్లో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్నటువంటి మారుతీ సుజుకీ కూడా వినియోగదారుల కోసం ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపులు అందిస్తుంది. కంపెనీ అరేనా డీలర్‌షిప్ ద్వారా ఇయర్ ఎండ్ తగ్గింపును ఇస్తుంది. దసరా, దీపావళి సమయంలో కారును కొనుగోలు చేయలేని వారు ఈ తగ్గింపు ధరలను సద్వినియోగం చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు మిగిల్చుకుని కొత్త కారును హాయిగా ఇంటికి తీసుకెళ్లవచ్చు.

మారుతీ సుజుకీ అరేనా డీలర్‌షిప్ కింద ఆల్టో కే10 (Alto K10),S-ప్రెస్సో (S-Presso), వ్యాగన్ఆర్(WagonR), సెలెరియో(Celerio), పాత తరం, కొత్త తరం స్విఫ్ట్ వంటి కార్లపై కంపెనీ ఇయర్ ఎండ్ సేల్‌లో తగ్గింపును ప్రకటించింది. ఈ మోడళ్లు అన్ని కూడా ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్నవే. వీటి డిజైన్, పెర్ఫామెన్స్‌కు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారు అట్రాక్ట్ అయ్యారు. సేల్స్ పరంగా ఇవి మెరుగైన స్థితిలో ఉన్నాయి.

Maruti Suzuki 2024 Offers

మొదటగా మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ గురించి మాట్లాడుకుంటే, Waltz ఎడిషన్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ డిసెంబర్ నెలలో రూ.77,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దీనిలో రూ.49,900 విలువైన ఉచిత కిట్, స్క్రాప్‌పేజ్ బోనస్ రూ.25,000, అదనంగా కార్పొరేట్ తగ్గింపు రూ.2,100 వరకు ఉంది. మారుతీ వ్యాగన్ ఆర్ ప్రస్తుతం రూ.5.55 లక్షల నుంచి రూ.7.38 లక్షల ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఆల్టో కే10 మోడల్‌పై కంపెనీ ప్రత్యేకంగా రూ.72,100 వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తుంది. వీటిలో ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.15,000, రూ.45,000 వరకు క్యాష్ తగ్గింపు, రూ.25,000 స్క్రాప్‌పేజ్ బోనస్, కార్పొరేట్ తగ్గింపు రూ.2,100 ఉంది. దేశీయ మార్కెట్లో ఈ కారు ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల మధ్య ఉంది. ఇది చిన్న కుటుంబానికి సరిపోయేలా ఉంటుంది.

Maruti Suzuki Year End Discounts

మారుతీ సుజుకీ సెలెరియో డ్రీమ్ ఎడిషన్‌పై ఈ నెలలో ప్రత్యేకంగా రూ.83,100 వరకు తగ్గింపు ఉంది. ఈ మొత్తంలో స్క్రాప్‌పేజ్ బోనస్ రూ.25,000, రూ.11,000 విలువైన ఉచిత కిట్, అదనపు తగ్గింపు రూ.45,000, కార్పొరేట్ బోనస్ రూ.2,100 ఉంటుంది. ఇది AMT వేరియంట్లకు వర్తిస్తుంది. అలాగే, LXi డ్రీమ్ సిరీస్ వేరియంట్‌పై దాదాపు రూ. 54,984 క్యాష్ డిస్కౌంట్ ఉంది.

S-ప్రెస్సో కారుపై ఇయర్‌ ఎండ్ సేల్‌లో భాగంగా రూ.76,953 తగ్గింపును పొందవచ్చు. ప్రధానంగా ఈ మొత్తం అమౌంట్‌లో వినియోగదారు ఆఫర్ రూ. 49,853, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2,100 కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది. దీనిలో మాన్యువల్ గేర్‌బాక్స్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.40,000 క్యాష్ డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తుంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో S-ప్రెస్సో ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షలుగా ఉంది.

Maruti Suzuki December Offers

మారుతీ కొత్త తరం 2024 స్విఫ్ట్‌పై మొత్తం రూ.75,000 వరకు తగ్గింపు ఉంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్ రూ.50,000, స్క్రాప్‌పేజ్ బోనస్ రూ.25,000 వరకు ఉంది. అదే సీఎన్‌జీ వేరియంట్‌పై మాత్రం రూ.45,000 క్యాష్ తగ్గింపు ఉంటుంది. పాత తరం స్విఫ్ట్‌పై కంపెనీ రూ.35,000 వరకు తగ్గింపు ఇస్తుంది. వీటిలో రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, స్క్రాప్‌పేజ్ బోనస్ రూ.25,000 ఉంది. దీని ప్రారంభ ధర రూ.6.24 లక్షలు.

మారుతీ సుజుకీ పాత డిజైర్‌పై రూ.40,000 వరకు తగ్గింపు ఉంది. ఈ మొత్తంలో క్యాష్ డిస్కౌంట్ రూ.15,000, స్క్రాప్‌పేజ్ బోనస్ రూ.25,000 వరకు ఉంటుంది. బ్రెజ్జా కారుపై కూడా రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. దీనిలో క్యాష్ డిస్కౌంట్ రూ.25,000, స్క్రాప్‌పేజ్ బోనస్ రూ.25,000 వరకు ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, December 7, 2024, 9:00 [IST]
English summary
Maruti suzuki offers 2024 year end discounts on selected cars
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+