26.68 కి.మీ వరకు మైలేజీ ఇచ్చే కార్లు.. టాప్ 10లో ఉన్న ఆ కంపెనీ కార్లన్నీ మైలేజీలో సూపర్ డూపర్ హిట్టు!
మారుతి సుజుకి కార్లను జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఆ కంపెనీ కార్లు రెండు దశాబ్దాలుగా సేల్స్‌లో దుమ్మురేపుతున్నాయి. ఈ పండుగ సీజన్‌లో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీలు ఆఫర్లను సైతం అందిస్తున్నాయి. అయితే ఏ మోడల్‌ని ఎంచుకోవాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం మెరుగైన సేఫ్టీ, ఫీచర్లతో వచ్చే కార్లు భారతదేశంలో చాలా అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ మైలేజీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి మైలేజీ ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇప్పటికీ మారుతి కార్లను ఇష్టపడతున్నారు.
మారుతి నుంచి అందుబాటులో ఉన్న సీఎన్‌జీ వెర్షన్లు భారీ మైలేజీని అందిస్తున్నాయి. వీటితో పాటు పెట్రోల్ కార్లు కూడా ఎక్కువ మైలేజీని అందిస్తాయి. ప్రస్తుతానికి డీజీల్ ఇంజిన్ కార్లపై మారుతి అంతగా ఫోకస్ చేయడం లేదు. కేవలం పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి మంచి మైలేజీని అందించే పెట్రోల్ కార్లు మార్కెట్‌లో ఉన్నాయి. టాప్ 5 జాబితా మీకోసం..

ఆల్టో K 10: దేశంలోనే అత్యంత సరసమైన కార్లలో ఆల్టో కె 10 (Alto K10) ఒకటిగా ఉంది. చిన్న కార్ల కోసం చూస్తున్న వారికి ఆల్టో K 10 అనువైన మోడల్‌గా ఉంటుంది. ఆల్టో లీటర్ పెట్రోల్‌పై 24.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ ప్రారంభ ధర రూ.3.99 లక్షలుగా ఉంది.
వ్యాగన్ఆర్: మారుతి వ్యాగన్ఆర్ (Maruti WagonR) భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఒకటిగా ఉంది. ఇది బాక్సీ టైప్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్‌తో వస్తుంది. ఈ వ్యాగన్‌ఆర్ ఇప్పటికే లక్షలాది యూనిట్లకు పైగా సేల్స్‌ని కలిగి ఉంది. దీని ప్రధాన హైలైట్స్‌లో ఒకటి మైలేజీ అని చెప్పవచ్చు. ఇది లీటరుకు 24.19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది రూ.5.55 లక్షల ధరతో ప్రారంభం అవుతుంది.

ఎస్-ప్రెస్సో: మైలేజీ, కంఫర్ట్ పరంగా మారుతి S-ప్రెస్సో (S-Presso) చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఇది కూడా బాక్సీ డిజైన్‌లో వస్తుంది. ఈ ఎస్-ప్రెస్సో లీటరుకు 25.30 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. తక్కువ ధర, మెరుగైన మైలేజీ ఉన్న కారు కోసం చూస్తున్న వారు ఈ పొట్టి కారుని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ కారు ధర రూ.4.27 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.
స్విఫ్ట్: భారతీయుల ఫేవరెట్ కార్లలో ఇదొకటి ఉంది. ప్రస్తుతం 4th జనరేషన్ వెర్షన్ లాంచ్ చేసింది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌లో మైలేజీ కూడా పెరిగింది. కొత్త 1.2-లీటర్ జెడ్-సిరీస్ 3-సిలిండర్ ఇంజిన్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మునుపటి కంటే పవర్ కొంచెం తక్కువగా ఉంది కానీ మైలేజీ అయితే పెరిగింది. 2024 స్విఫ్ట్ బేస్ వేరియంట్ ధర రూ.6.49 లక్షలుగా ఉంది.

సెలెరియో: ఇది అత్యధిక మైలేజీ ఇచ్చే మారుతి పెట్రోల్ కారుగా ఉంది. ఈ చిన్న కారు లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. మారుతి సెలెరియో సీఎన్‌జీ వెర్షన్ మైలేజీ లీటరుకు 30 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇస్తుంది. సెలెరియో ధర రూ .5.36 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పైన పేర్కొన్న ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.
బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లీటరుకు 22.94 కి.మీ, డిజైర్ లీటరుకు 22.61 కి.మీ మైలేజీని అందిస్తుంది. అలాగే మారుతి సుజుకి ఫ్రాంక్స్ 21.8 కి.మీ మైలేజీని ఇస్తుంది. అలాగే గ్రాండ్ విటారా లీటరుకు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక టాప్10లో ఉన్న మారుతి సుజుకి XL6 20.97 కి.మీ మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








