మారుతి ఫ్యామిలీ కారులో లోపం.. భయపడకండి.. మీ కారులో ఆ సమస్య ఉంటేనే కంపెనీ నుంచి కాల్ వస్తుంది!
స్టీరింగ్ గేర్‌బాక్స్ అసెంబ్లింగ్‌లో లోపం కారణంగా 2,555 మారుతి ఆల్టో K 10(Maruti Alto K10) కార్లను రీకాల్ చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ రీకాల్ చేసిన కార్లలోని లోపాన్ని ఉచితంగా పరిష్కరిస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీనికి సంబంధించి గతంలోనే మారుతి కస్టమర్లను అలర్ట్ చేస్తూ వచ్చింది. తాజాగా అధికారికంగా రీ కాల్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఈ ఆల్టో కె 10 మోడల్‌ని ఆగస్టు 2022లో మారుతి విడుదల చేసింది. ఇది వరకు ఉన్న పాత మోడల్‌లో అనేక మార్పులతో దీనిని మార్కెట్‌లోకి లాంచ్ చేసిది. ఈ కారు మారుతి మినీ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లలో కొనుగోలుకి అందుబాటులో ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా ఈ కారుని కొనుగోలు చేసేలా అందుబాటు ధరలో దీనిని తీసుకువచ్చింది.

ప్రస్తుతం భారత మార్కెట్‌లో లభించే అత్యంత సరసమైన కార్లలో ఇది ఒకటిగా ఉంది. ముఖ్యంగా చిన్న కుటుంబాలకు ఇది ఫర్‌పెక్సట్ ఆప్షన్‌గా ఉంది. తాజాగా మారుతి ప్రకటనతో ఆందోళన మొదలైంది. అయితే కేవలం 2,555 కార్లలో మాత్రమే స్టీరింగ్ గేర్ బాక్స్ అసెంబ్లింగ్ సమస్య ఉన్నట్లు మారుతి స్పష్టం చేసింది. ఈ కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లిడించింది.
ఈ కార్లను విక్రయించిన కస్టమర్లను నేరుగా సంప్రదించి ఈ విషయాన్ని వారికి తెలియజేస్తామని, వెంటనే మారుతి అధికారిక సేవా కేంద్రానికి తీసుకెళ్లాలని కోరతామని కంపెనీ తెలిపింది. అసెంబ్లీని పరీక్షించి సమస్యాత్మకంగా ఉన్నట్లు తేలితే వెంటనే ఉచితంగా మార్పులు చేస్తమాని కంపెనీ పేర్కొంది. అలాగే ఆల్టో కె 10 కొనుగోలుదారులు తమకు ఈ సమస్య ఉందని తెలియజేస్తే పరిశీలిస్తామని వెల్లడించింది. ఈ సమస్యతో డ్రైవింగ్ కొనసాగించవద్దని మారుతి అభ్యర్థించింది.

ఒకవేళ మీరు మారుతి ఆల్టో కె 10 వినియోగదారు అయితే ఇలాంటి సమస్యను మీరు గుర్తిస్తే వెంటనే కారుని షోరూమ్‌కి తీసుకెళ్లండి. సమస్య ఉందని తెలియకపోయినా సర్వీస్ సెంటర్ నుంచి ఫోన్ కాల్ వస్తే వెంటనే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లండి. ఇక మారుతి సుజుకి ఇండియా జూలైలో 87,599 యూనిట్ల ఎస్-ప్రెస్సో మరియు ఈకో మోడళ్లను రీకాల్ చేసింది. స్టీరింగ్ టై రాడ్ సమస్య ఉన్నట్లు గుర్తించి దాన్ని సరిచేశారు.
అలాగే మార్చిలో 11,851 బాలెనో యూనిట్లు, 4,190 వ్యాగన్‌ఆర్ యూనిట్లను సైతం రీకాల్ చేసింది. ఈ కార్లను 2019లో తయారు చేశారు. ఫ్యూయల్ పంప్ మోటారులో సమస్య తలెత్తడంతో ఈ కార్లన్నింటినీ రీకాల్ చేసి సరిచేశారు. ఇప్పుడు మారుతి సుజుకి ఆల్టో కె 10 ను రీకాల్ చేసింది. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మారుతి ఆల్టో కె 10 ఒకటి.

దీని ధర రూ. 3.99 నుంచి 5.46 లక్షల మధ్య ఉంది. ఇది 1-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT యూనిట్‌తో జత చేయబడి ఉంది. ఇది 67 PS శక్తిని మరియు 89 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది సీఎన్‌జీ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్ 24 సీఎన్‌జీ వెర్షన్‌లో 33 కి.మీ మైలేజీ ఇస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








