32.73 కి.మీల మైలేజ్.. బైక్ ధరలో లభిస్తుంది.. దేశంలోనే అత్యంత భారీ డిమాండ్ ఉన్న కారు ఇదే!
భారత్‌లో మధ్యతరగతి వారు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా ఆటోమొబైల్ తయారీదారులు వారిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ధరల్లోనే కార్లను తీసుకొస్తుంటారు. ముఖ్యంగా దేశీయ దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) తక్కువ ధరల్లోనే తన కార్లను విడుదల చేస్తుంది. దీంతో వీటి అమ్మకాలు ప్రతి ఏటా ఎక్కువగానే నమోదవుతుంటాయి. గత కొద్ది రోజులుగా మారుతీ తన మోడళ్లకు సంబంధించిన సేల్స్ వివరాలు ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో లభించే S-ప్రెస్సో (S-presso) కారు సేల్స్ డేటాను వెల్లడించింది. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, ఈ మోడల్ 2024 నవంబర్ నెలలో 2,283 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అదే గత ఏడాది ఇదే నవంబర్‌లో సేల్స్ 1,883 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే సేల్స్ దాదాపు 21 శాతం పెరగడం గమనార్హం.
మారుతీ సుజుకీ S-ప్రెస్సో చిన్న కుటుంబాలకు సరిపోయే విధంగా ఉంటుంది. తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. సామాన్య ప్రజలు కారును కొనుగోలు చేయాలనే కలను నెరవేర్చుతుంది. ఇది పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే కాకుండా సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షలు (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంటుంది.

S-ప్రెస్సో మొదటిసారిగా ఇండియా మార్కెట్లో 2019లో వచ్చింది. ధర తక్కువగా ఉండటం అలాగే, చిన్న కుటుంబాలకు సరిపోయే విధంగా ఉండటంతో ప్రజలు ఈ కారును అప్పటి నుంచి ఆదరిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రతి ఏటా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని మినీ ఎస్‌యూవీ అని కూడా అంటారు. ప్రస్తుత ఎడిషన్ S-ప్రెస్సో 1.0-లీటర్ మూడు-సిలిండర్ K10C డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.
ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ 5-స్పీడ్ ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది లీటర్ పెట్రోల్‌కు మాన్యువల్ ఆప్షన్‌లో దాదాపు 24.12 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. అదే పెట్రోల్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌లో 25.30 కి.మీ మైలేజ్‌ను ఇస్తుంది. S-ప్రెస్సో సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇది కిలో సీఎన్‌జీకి 32.73 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. అయితే CNG లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంది.

ఈ S-ప్రెస్సో కారు లోపల అనేక ప్రీమియం ఫీచర్లను మారుతీ సుజుకీ అందించింది. ధర తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫీచర్లు ఎక్కువ కోరుకునే వినియోగదారులకు ఎలాంటి లోటు ఉండదు. కేవలం సైజు చిన్నగా ఉన్నప్పటికి డజన్ల కొద్ది ఫీచర్లు క్యాబిన్‌లో ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, సెంటర్ కన్సోల్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ప్రీమియం ఫీచర్లు లోపల ఉన్నాయి.
ఎక్స్‌టీరియర్ డిజైన్ కూడా స్టైలీష్‌గా ఉంటుంది. 14-అంగుళాల స్టీల్ వీల్స్ కారుకు మరింత అందాన్ని చేకూర్చాయి. ముందు భాగంలో ఆకట్టుకునే హెడ్‌ల్యాంప్, క్రోమ్ ఇన్సర్ట్, ఎక్స్‌టెండెడ్ సెంటర్ ఎయిర్ ఇన్‌టేక్ వంటివి ఉన్నాయి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఈ మినీ ఎస్‌యూవీని సామాన్యుల కోసమే తీసుకొచ్చారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








