ప్రపంచంలోనే ఇప్పటివరకూ ఈ కారును ఢీకొట్టింది లేదు.. 50 లక్షల సేల్స్‌తో ఆల్ టైం రికార్డ్
భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల గురించి ఆలోచిస్తే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్, హ్యుందాయ్ ఐ10 మోడల్స్, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో ఇంకా టయోటా ఇన్నోవా ఇలా కొన్ని కార్ల మోడల్స్ గుర్తుకు వస్తాయి. కానీ వీటన్నిటినీ తలదన్ని ఓ మామూలు కారు లక్షల సంఖ్యలో సేల్స్‌ను సాధించిందంటే నమ్ముతారా.? అదే మారుతి సుజుకి ఆల్టో(Maruti Suzuki Alto)..
భారత మార్కెట్లో 50 లక్షల యూనిట్ల విక్రయ మైలురాయిని దాటిన ఏకైక కారు మారుతి సుజుకి ఆల్టో. టాప్ కార్లను మించి ఈ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ సేల్స్ మార్క్‌ను ఇంతవరకూ ఏ ప్రముఖ కారు కూడా దాటలేకపోయింది. 2000లో ప్రారంభించబడిన ఈ ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటి వరకు దాదాపు 5.06 మిలియన్ యూనిట్ల విక్రయాలను సాధించిందని సేల్స్ రిపోర్ట్ చెబుతోంది.

ఇప్పటివరకూ మారుతి సుజుకి ఆల్టో(Maruti Alto Top Sales) రికార్డును ఏ కారు కూడా దాటలేకపోయింది. అంతే కాకుండా ఇది ఎప్పటికీ బద్దలు కాలేని రికార్డ్ అని కూడా ఆటో నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న రెండవ కారు, హ్యుందాయ్ i10. దాదాపు 3.3 మిలియన్ యూనిట్ల సేల్స్‌తో ఆల్టోకు చాలా దూరంగా ఉంది.
మారుతి సుజుకి ఆల్టో 2000 లో లాంచ్ కాగా.. అప్పటి నుంచి మరియు 2022 మధ్య పదిహేడేళ్ల పాటు ఆటో మార్కెట్‌ను ఏలుతోంది. ఈ సేల్స్ ఆధారంగా.. ఈ హ్యాచ్‌బ్యాక్‌కు ఎంతమేరకు ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా మారుతి సుజుకి ఆల్టో 800 2000లో లాంచ్ అవ్వగా.. మారుతి సుజుకి ఆల్టో K10 ను 2010లో సంస్థ తీసుకువచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం, మారుతి సుజుకి ఆల్టో K10 మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చిన BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా మార్చి 2023 లో ఆల్టో 800 ఉత్పత్తిని సంస్థ నిలిపివేసింది. ఇందుకు కారణం ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి పెట్టుబడులు పెట్టడం ఆర్థికంగా లాభదాయకం కాదు కాబట్టి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
మారుతి సుజుకి ఆల్టో K10 విషయానికొస్తే 1.0-లీటర్ K10C పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 67 PS గరిష్ఠ శక్తిని మరియు 89 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో జతచేయబడి ఉంటుంది. కాగా 5-స్పీడ్ MTతో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 57 PS గరిష్ట శక్తి మరియు 82 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో కె10 ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల మధ్య ఉంది. ఇవి ఎక్స్-షో రూమ్ ధరలు. కాగా మారుతి ఆల్టో కె10 రెనాల్ట్ క్విడ్ మరియు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోకు ప్రత్యక్ష పోటీనిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








