వేటగాన్ని ఎవరు కొనడానికి ముందుకు రావట్లే.. ఆఫ్-రోడ్ కింగ్‌కు లేని డిమాండ్.. ఎందుకిలా అయింది?
కొత్త ఏడాదికి ముందు మారుతీ సుజుకీ షాకింగ్ లాంటి వార్త చెప్పింది. తన ఫేవరెట్ ఎస్‌యూవీ జిమ్నీ అమ్మకాలు ఆశించినంతంగా లేవని తాజాగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ఈ మోడల్ భారతీయ మార్కెట్లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఇతర కార్లకు పోటీగా నిలవలేక తక్కువ విక్రయాలను నమోదు చేసింది. కంపెనీ ఇటీవల వెల్లడించిన డేటా ప్రకారం, జిమ్నీ విక్రయాలు 2024 నవంబర్ నెలలో కేవలం 988 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. అదే గత ఏడాది 2023 ఇదే నెలలో 1,020 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ లెక్కన విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 3 శాతం తగ్గిపోయాయి. జిమ్నీపై కంపెనీ ఎన్నో అంచనాలు పెట్టుకుంది. కానీ అంచనాలు ఇప్పుడు తలకిందులు అయ్యాయి.
ముఖ్యంగా మారుతి జిమ్నీ విక్రయాలు పెరగకపోవడానికి ప్రధానం కారణం ప్రత్యర్థి కంపెనీ మహీంద్రా థార్‌కు డిమాండ్ పెరగడం. జిమ్నీకి ప్రధాన పోటీదారుగా థార్ ఇప్పుడు మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుంది. వినియోగదారులు ఎక్కువగా థార్ స్టైలీష్ డిజైన్‌ను చూసి అట్రాక్ట్ కావడంతో రికార్డు స్థాయిలో సేల్స్ సాధిస్తుందని ఆశించిని జీమ్నీని తక్కువ మంది కొనుగోలు చేశారు. ఎస్‌యూవీలకు భారత్‌లో మంచి ఉంటుంది. అయితే ఈ మోడల్‌ను మాత్రం తక్కువగా ఆదరించారు.

ఈ జిమ్నీ మోడల్ ఒకప్పటి ఆఫ్-రోడ్ కింగ్, జిప్సీకి కొనసాగింపుగా వచ్చింది. భారతీయ వినియోగదారులకు జిప్సీ బాగా తెలిసిన మోడల్. ఇది దేశంలో క్లిక్ అయినంతగా జిమ్నీ కాలేకపోయింది. ఇది ఎస్‌యూవీ అమ్మకాల పరంగా తగ్గుదలను చూస్తుండగా, మహీంద్రా థార్ మాత్రం ప్రతినెలా అమ్మకాల్లో దూసుకుపోతుంది. బడ్జెట్ ధరలో కారును కావాలనుకునే వారు థార్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. జిమ్నీ కూడా తక్కువ ధరలో లభించినప్పటికీ సేల్స్ తక్కువగా ఉన్నాయి.
మారుతీ సుజుకీ జిమ్నీ ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కానీ ఈ విభాగంలో మాత్రం అంత డిమాండ్ సాధించలేకపోయింది. ఇది 1.5 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది ఐడిల్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఇంజిన్ 104.8 PS పవర్, 134.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. జిమ్నీలో 5 స్పీడ్ మ్యాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు.

జిమ్నీ రోజువారీ వాడకానికి అనువుగా ఉంటుంది. దీని సైజు తక్కువగా ఉండటం వలన రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. నగరాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లోని రోడ్లపై కూడా జిమ్ని బాగా సెట్ అవుతుంది. దీన్ని డ్రైవింగ్ చేయడం కూడా చాలా సులువు. ఎందుకంటే జిమ్నీ బరువు చాలా తక్కువగా, తేలికగా ఉంటుంది.
జిమ్నీ 5 డోర్ ఫీచర్లను చూసినట్లయితే లోపల యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సౌండ్ సిస్టమ్, ప్రయాణికుల భద్రత పరంగా అధునాత సేఫ్టీ ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








