ఈ 'స్పెషల్ ఎడిషన్‌ స్విఫ్ట్‌' మాములుది కాదు.. మస్త్ షేడ్స్‌ ఉన్నాయి.. కమల్‌ హాసన్‌!

మారుతి సుజుకి ఏ కారు లాంచ్ చేసినా అది తక్కువ రోజుల్లోనే ఫేమస్ అయిపోతుంది. మార్కెట్‌లో ఓ ఉత్పత్తిని ఎలా సేల్‌ చేయాలో మారుతికి బాగా తెలుసు. దీంతో ఈ కార్ల కంపెనీ సేల్స్‌ భారీ స్థాయిలో ఉంటాయి. ఆ కంపెనీ ఏదైనా కొత్త కారుని విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడుతుంది. దీని ముఖ్యం కారణం ఈ కార్ల ధరలు, ఫీచర్లు, మైలేజీ అని అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు ఆ కంపెనీ నుంచి విడుదలైన కార్లను మారుతి స్పెషల్‌ ఎడిషన్స్‌లో విడుదల చేస్తుంది. ముఖ్యంగా పండుగ సీజన్‌కి ముందు సేల్స్ పెంచుకోవడానికి ప్రత్యేక ఎడిషన్స్‌ని లాంచ్‌ చేస్తుంది. పేరుకు తగినట్లుగానే ఇవి రెగ్యూలర్‌ మోడళ్లతో పోల్చితే చాలా స్పెషల్‌గా ఉంటాయి.

మార్కెట్‌లో స్పషల్‌ ఎడిషన్ లేదా లిమిటెడ్‌ ఎడిషన్‌ కార్లకు మంచి డిమాండ్‌ ఉంది. తాజాగా పండుగ సీజన్‌ కోసం మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ (Swift Blitz Edition)ను విడుదల చేసింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌ల్లో స్విఫ్ట్‌ ఒకటిగా ఉంది. అలాంటి కారుని స్పెషల్‌ ఎడిషన్‌లో రావడం స్విఫ్ట్ లవర్స్‌కి నిజంగా పండగే అని చెప్పాలి.

Maruti Suzuki Swift Blitz Edition Launch

ఇక స్పెషల్ ఎడిషన్‌ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీ కోసం సాధారణ ధర కంటే అదనంగా రూ .39,500 చెల్లించాల్సి ఉంటుంది. భారీ కాస్మోటిక్‌ మార్పులతో వచ్చే ఈ యాక్ససరీ ప్యాకేజీ కారు క్రేజీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ యాడ్‌ ఆన్స్‌తో ఈ కారు చూడగానే జిగేల్‌ మంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకోసం..

మారుతి సుజుకి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ VXi, VXi (O) అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హ్యాచ్‌బ్యాక్స్‌ వలె స్టాండర్డ్ వెర్షన్‌లో లభించే స్టాండర్డ్ ఫీచర్స్‌తో పాటు ఇంటీరియర్‌, ఎక్స్‌టీరియర్ ఆకర్షణీయంగా కనిపించడానికి కొన్ని కాస్మోటిక్‌ మార్పులు ఇందులో ఉన్నాయి. పైన చెప్పిన విధంగా ప్రత్యేక ప్యాకేజీ యాక్సెసరీలతో ఈ స్పెషల్ ఎడిషన్ వస్తుంది.

Maruti Suzuki Swift Blitz Edition Features

ఈ యాక్ససరీ ప్యాకేజీలో భాగంగా గ్రిల్ గార్నిష్, LED ఫాగ్ ల్యాంప్స్, ముందు, వెనుక, సైడ్ ప్రొఫైల్స్ కోసం అండర్ బాడీ స్పాయిలర్లు ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా హ్యాచ్‌బ్యాక్‌ని మరింత క్రేజీ లుక్‌ని అందించడానికి బాడీ క్లాడింగ్, విండో ఫ్రేమ్ కిట్, డోర్ వైజర్లు, బ్లాక్ రూఫ్ స్పాయిలర్ కూడా ఇవ్వబడ్డాయి. ఈ మార్పులు కారుని కొత్తగా చూపిస్తాయి.

ఇక దీని ఇంటీరియర్‌ విషయానికి వస్తే ఇందులో ప్రత్యేకమైన స్టైల్ సీట్ కవర్స్, ఫ్లోర్ మ్యాట్స్‌తో వస్తుంది. స్విఫ్ట్ స్టాండర్డ్ వెర్షన్‌లో ఇవి అందుబాటులో ఉండవు. ఈ స్పెషల్ ఎడిషన్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎంచుకున్న వేరియంట్‌ని బట్టి 9 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్పెషల్‌ ఎడిషన్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు లేవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్రోల్, పెట్రోల్-సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు. మారుతి స్విఫ్ట్‌ 1.2-లీటర్ మూడు సిలిండర్ల నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 82 bhp పవర్‌ని, 112 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 5-స్పీడ్ AMT యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇది లీటర్‌ పెట్రోల్‌కి 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. అలాగే సీఎన్‌జీ వెర్షన్‌ లీటరుకు 32.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంది. సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్పెషల్‌గా కనిపించాలని భావించే వారు ఈ కారుని ధైర్యంగా కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2024, 7:20 [IST]
English summary
Maruti suzuki swift blitz edition cosmetic addons and other top things
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+