దీపావళికి దమ్ములేపడానికి వచ్చిన మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ బ్లిట్జ్.. రూ.49 వేల యాక్సెసరీస్‌ ఫ్రీ

భారత్‌లో కార్ల తయారీ సంస్థలలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకీ(Maruti Suzuki) పండుగల సమయంలో తన స్విఫ్ట్‌లో బ్లిట్జ్( Swift Blitz) అనే ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది పరిమిత కాలం వరకు మారుతీ అరేనా( Maruti Arena) డీలర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. దీనిని పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలలో LXI, VXI, VXI AMT, VXI(O), VXI(O) AMT ట్రిమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రత్యేక ఎడిషన్ ధర రూ.6.49 లక్షల నుండి టాప్ మోడల్ ధర రూ. 8.02 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ముఖ్యంగా కంపెనీ రూ. 49,848 విలువైన యాక్సెసరీస్‌ను ఉచితంగా అందిస్తుంది. బడ్జెట్ ధరలో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం.

ప్రస్తుతం మార్కెట్లో ఆటోమొబైల్ రంగంలో చాలా పోటీ నెలకొంది. దీనిని ఎదుర్కొడానికి స్విఫ్ట్‌లో బ్లిట్జ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. వ్యాగన్ఆర్ వాల్ట్జ్ ఎడిషన్( Wagon R Waltz Edition), ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్(Ignis Radiance Edition), బాలెనో రీగల్ ఎడిషన్(Baleno Regal Edition), గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్(Grand Vitara Dominion Edition) తర్వాత కంపెనీ ఇప్పుడు స్విఫ్ట్‌ బ్లిట్జ్‌( Swift Blitz)ను తెచ్చింది.

Maruti Suzuki Swift Blitz Edition Launched-

మారుతీ సుజుకీ తన అన్ని మోడళ్లలో స్విఫ్ట్‌ చాలా విజయవంతమైంది. కొత్త స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్‌ 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో 82 హార్స్ పవర్ వద్ద 112 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG వేరియంట్‌లలో, 70 హార్స్ పవర్ వద్ద 102 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్ మోడల్‌‌లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది.

అదే, బేస్ వేరియంట్ మినహా అన్నింటిలో 5-స్పీడ్ ఆటోమెటేడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(AMT) గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. CNGలో 32.85 km/kg మైలేజ్ వరకు ఇస్తుంది. ఈ మోడల్‌లో సరికొత్త ఫీచర్లను అందించారు. బంపర్ లిప్ స్పాయిలర్‌లు, ఫ్లోర్ మ్యాట్స్, LED ఫాగ్ ల్యాంప్స్, సీట్ కవర్లు, రూఫ్ స్పాయిలర్, సైడ్ మౌల్డింగ్, గ్రిల్ గార్నిష్, డోర్ వైజర్‌లు, విండో ఫ్రేమ్ కిట్ ఉన్నాయి.

ట్రిమ్‌ల వారీగా ధరలు: Lxi MT రూ.6.49 లక్షలు, Vxi MT రూ.7.3 లక్షలు, Vxi AMT రూ.7.75 లక్షలు, Vxi (O)రూ.7.57 లక్షలు, Vxi (O) AMT రూ. 8.02 లక్షలు, Vxi CNG రూ. 8.2 లక్షలు, Vxi (O) CNG రూ.8.47 లక్షలు.

విడిగా యాక్సెసరీలను కొనుగోలు చేసినట్లయితే రూ. 49,848 చెల్లించాల్సి వచ్చేది. అయితే వీటిని కంపెనీ ఉచితంగా అందిస్తుండటం చాలా సంతోషకరమైన విషయం. దీపావళి పండుగకు ముందు కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు యాక్సెసరీల కోసం వెచ్చించాల్సిన అదనపు ఖర్చును మిగుల్చు కోవడానికి ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

కంపెనీ అందించే ఈ ఉచిత యాక్సెసరీలు కారుకు స్పోర్ట్సినెస్ లుక్‌ను అందిస్తాయి. మారుతీ సుజుకీ ఇంతకుముందు అమ్మకాలను పెంచుకోవడానికి దాని ప్రస్తుత కార్లలో అనేక ప్రత్యేక ఎడిషన్‌లను విడుదల చేసింది. ఇదే జాబితాలో ఇప్పుడు స్విఫ్ట్‌లో బ్లిట్జ్‌ను తీసుకొచ్చింది. ఇది హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, టాటా టియాగో, సిట్రోయెన్ సి3 వంటి వాటికి ప్రత్యర్థిగా నిలుస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 17, 2024, 16:08 [IST]
English summary
Maruti suzuki swift blitz edition launched in festival season
Read more on: #maruti suzuki #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+