CNG వెర్షన్‌లో మారుతి స్విఫ్ట్ వచ్చేస్తుంది.. 32 కి.మీ భారీ మైలేజీ, ధర కూడా చాలా తక్కువే!
మారుతి సుజుకి నుంచి ఫేమస్ కారు ఏంటని అడిగితే ఠక్కున స్విఫ్ట్ అని చెప్పేస్తారు. ఈ కారు ప్రస్తుతం 4th జనరేషన్‌లో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫేమస్ మారుతి స్విఫ్ట్ నుంచి కంపెనీ బిగ్ అప్‌డేట్ ఇవ్వనుంది. వచ్చే వారంలో లేదా ఈ నెలాఖరులో స్విఫ్ట్ సీఎన్‌జీ వేరియంట్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పెట్రోల్ ఇంజిన్ ప్రస్తుతం 25 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే సీఎన్‌జీ వేరియంట్ దాదాపు 32 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. త్వరలో మార్కెట్‌ని షేక్ చేయబోతున్న ఈ కారు ధర, ఫీచర్లు, ఇతర వివరాల అప్‌డేట్స్‌పై ఓ లుక్కేయండి..
మారుతి ఈ సంవత్సరం మే నెలలో 4th జనరేషన్ స్విఫ్ట్‌ని భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటి వరకు 65,513 యూనిట్ల స్విఫ్ట్ లేటెస్ట్ కార్లను సేల్ చేసింది. ప్రతీ నెలా సేల్స్‌ని పెంచుకుంటూ మరింత దూకుడుగా సాగిపోతుంది. గత కొన్ని నెలలుగా భారత్‌లో సీఎన్‌జీ వెహికిల్స్ వినియోగం పెరుతుంది. కావున స్విఫ్ట్‌ని కూడా సీఎన్‌జీ వెర్షన్‌లో తీసుకువస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహగానాలు వస్తున్నాయి.

అయితే వచ్చే వారంలో లేదా నెలాఖరులో వస్తే ఇది రానున్న పండుగ సీజన్‌ని టార్గెట్ చేయనుంది. అదే జరిగితే ఈ కారుకి ఊహించని సంఖ్యలో జనాల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే స్విఫ్ట్‌ని మారుతి సేల్ చేస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ ఎన్నో ఏళ్లుగా అమ్మకానికి ఉంది.
అయితే జనాలు ఇంకా అధిక మైలేజీ ఇచ్చే కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ సీఎన్‌జీ వెర్షన్ గురించి కొన్ని వేల సంఖ్యలో ఎంక్వైరీలు సైతం అందినట్లు కూడా తెలిసింది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ వస్తున్నాయి. అయితే ఇది కేవలం టాప్ వేరియంట్‌లో మాత్రమే సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
త్వరలో మార్కెట్‌లో అడుగుపెట్టనున్న సీఎన్‌జీ కారులో Z12E ఇంజిన్‌ని వినియోగించనున్నారు. ప్రస్తుతం ఉన్న వేరియంట్‌తో పోల్చితే దీని ధర రూ. 80,000 నుంచి రూ.90,000 ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ స్విఫ్ట్ సీఎన్‌జీని ప్రవేశపెట్టడం ద్వారా, మారుతి దేశవ్యాప్తంగా తన ఇతర సీఎన్‌జీ మోడళ్ల అమ్మకాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం మారుతి మొత్తం అమ్మకాల్లో 34 శాతం సీఎన్‌జీ వాహనాల నుంచే వస్తున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే కంపెనీ తన సీఎన్‌జీ మోడళ్ల అమ్మకాలు 37 శాతం పెరిగాయి. భారతదేశంలో విక్రయించే మొత్తం సీఎన్‌జీ, ఎస్‌యూవీల అమ్మకాలల్లో మారుతి సుజుకి 73 శాతం వాటాను కలిగి ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో వీటి సేల్స్‌ని సుమారు 6 లక్షలకు పైగా పెంచుకునేలా సీఎన్‌జీ వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక దీనికి సంబంధించిన వివరాలను మారుతి అధికారికంగా విడుదల చేయడమే మిగిలింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








