మిడిల్‌ క్లాస్‌ కష్టాలు మారుతికి బాగా తెలుసు.. చాలా తక్కువ ధరలో 33 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త CNG కారు లాంచ్‌!

మారుతి సుజుకి నిన్న (12-09-2024) మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ (Maruti Suzuki Swift CNG) వెర్షన్‌ని అధికారికంగా మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్విఫ్ట్‌ సీఎన్‌జీ వెర్షన్‌ 3 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. VXi, VXi(O), ZXi అనే వేరియంట్లలో మాత్రమే ఈ స్విఫ్ట్‌ సీఎన్‌జీని తీసుకువచ్చింది. ఈ కారు దాని పెట్రోల్ వేరియంట్‌ కంటే రూ .90,000 ఎక్కువ ధరతో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 8.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. భారీ మైలేజీ అందించే ఈ కారులో ఇంకా ఎటువంటి అప్‌డేట్స్‌ ఉన్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్‌కి సంబంధించిన టాప్‌ అంశాలపై ఓ లుక్కేయండి.

మైలేజీ: స్విఫ్ట్ సీఎన్‌జీ కొత్త Z12E పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ ఒక కిలో సీఎన్‌జీకి 32.85 కిలోమీటర్ల (ARAI రేటింగ్) మైలేజీని అందిస్తుంది. దీని మైలేజీ 1.2-లీటర్ కె-సిరీస్ ఇంజిన్‌తో నడిచే మునుపటి స్విఫ్ట్ కంటే ఆరు శాతం ఎక్కువ. ఇది కేవలం 5 స్పీడ్‌ మాన్యూవల్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Maruti Swift CNG Launch

పవర్‌ట్రెయిన్: మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీలోని కొత్త Z12E ఇంజిన్ 69.75 bhp పవర్‌ని, 101.8 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌ పెట్రోల్ వెర్షన్ కంటే కొంచెం తక్కువ పవర్‌ని విడుదల చేసినప్పటికీ.. కొంచెం హై టార్క్‌ని విడుదల చేస్తుంది.

ఫీచర్లు: ఎంట్రీ లెవల్ VXi ట్రిమ్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌, ఈఎస్‌పీ, రిమోట్ సెంట్రల్ లాకింగ్, హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 14-అంగుళాల స్టీల్ వీల్స్, పవర్ విండోస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మిడ్-లెవల్ VXi (O)లో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో కూడిన 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌ని కలిగి ఉంది.

Maruti Swift CNG Mileage

ఇక టాప్-స్పెక్ ZXiలో DRLs తో కూడిన LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక వాషర్ వైపర్ ఉన్నాయి. వినియోగదారుల డిమాండ్ కారణంగా ఈ హై-స్పెక్ వేరియంట్‌ని ప్రవేశపెట్టారు.

బూట్‌ స్పేస్‌: ఈ స్విఫ్ట్ సీఎన్‌జీ సింగిల్‌ సిలిండర్‌తో వస్తుంది. ప్రస్తుతం టాటా, హ్యుందాయ్‌ మోడళ్లలో కనిపించే ట్విన్ సిలిండర్ సెటప్‌ని ఇందులో అందించలేదు. కావున బూట్‌ స్పేస్‌ తగ్గుతుంది. ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే ఆరు శాతం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తుందని మారుతి పేర్కొంది.

New Maruti Swift CNG Price

డెలివరీలు: ఈ కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ కోసం డెలివరీలు ఈ వారంలోనే గుజరాత్‌లో ప్రారంభమవుతాయని.. ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్ మరియు ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల్లో డెలివరీలు చేస్తామని మారుతి తెలిపింది. మారుతి సుజుకి సీఎన్‌జీ భారతదేశంలోని ప్రముఖ కార్లలో ఒకటిగా ఉంది. దీని మార్కెట్‌ని వినియోగించుకుని సంవత్సరానికి ఆరు లక్షల సీఎన్‌జీ ప్యాసింజర్ కార్లను విక్రయించాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

గత ఏడాది భారత్‌లో 4.77 లక్షల సీఎన్‌జీ కార్లు అమ్ముడుపోగా.. 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మారుతి సుజుకి ఏకంగా 2.21 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించింది. ఈ లాంచ్‌తో సేల్స్‌ పెరుగుతాని మారుతి భావిస్తుంది. ఈ ఎకో ఫ్రెండ్లీ సీఎన్‌జీ కార్ల ఉత్పత్తిని కూడా పెంచనున్నట్లు మారుతి తెలిపింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 13, 2024, 15:14 [IST]
English summary
Maruti suzuki swift cng mileage features powertrain and more top details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+