33 కి.మీ మైలేజీ ఇచ్చే ఈ కారుకి జనాల మంగళహారతులు.. అమ్మకాల్లో మళ్లీ దీనిదే పైచేయి!

మారుతి సుజుకి స్విఫ్ట్ (New Maruti Swift) గురించి భారతీయలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్విఫ్ట్‌ విడుదలైనప్పటీ నుంచి ప్రతీ జనరేషన్‌లోనూ సేల్స్‌లో అదరగొడుతోంది. హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో ప్రతీసారి ఈ కారుదే పైచేయి. ప్రస్తుతం ఈ హ్యాచ్‌బ్యాక్ నాలుగో వెర్షన్‌ అందుబాటులో ఉంది. దీనిని మే 2024లో మారుతి విడుదల చేసింది. కొత్త వెర్షన్‌ కూడా అమ్మకాల్లో నంబర్‌ 1గా కొనసాగుతుంది. తరాలు మారిన దీనికి మాత్రం తగ్గడం లేదు. ఇది బెస్ట్ సెల్లర్‌గా కొనసాగుతోంది. అక్టోబర్ 2024 లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా నిలిచింది. టాప్ 10 హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల్లో స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ ఎప్పటినుంచో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా మరోసారి సేల్స్‌లో సత్తాచాటింది. ఈ స్విఫ్ట్‌కి సంబంధించిన ఫుల్‌ సేల్స్‌ రిపోర్ట్‌పై ఓ లుక్కేయండి.

ఇక మారుతి గత నెలలో 17,539 యూనిట్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. ఈ నెల హ్యాచ్‌బ్యాక్‌ అమ్మకాల్లో టాప్‌లో నిలిచినా కానీ.. గత ఏడాదితో పోలిస్తే సేల్స్‌ తగ్గాయి. 2023 అక్టోబర్‌లో విక్రయించిన 20,598 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 15 శాతం తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో 2024 సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాలు కాస్త పెరిగాయి. సెప్టెంబర్‌లో కేవలం 16,241 స్విఫ్ట్ యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి.

Maruti Suzuki Swift Sales

కొత్త స్విఫ్ట్‌ని LXi, Vxi, VXi (O), ZXi, ZXi + అనే ఐదు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. బేస్‌ వేరియంట్‌ LXi స్విఫ్ట్‌ ప్రారంభ ధర రూ .6.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌).. అలాగే టాప్-స్పెక్ ZXi + AMT డ్యూయల్ టోన్ వెర్షన్‌ ధర రూ .9.64 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. దీని ధరలు అందుబాటులో ఉండటం వల్ల సేల్స్ జెట్‌ స్పీడ్‌లో పెరుగుతున్నాయి.

తాజాగా విడుదల చేసిన స్విఫ్ట్‌లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో కొన్ని మార్పులను స్విఫ్ట్‌ చేసింది. మరింత అందంగా దీనిని మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ కారుని 1.2-లీటర్ మూడు సిలిండర్ల జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 80 bhp పవర్, 112 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది.

Maruti Suzuki Swift Number 1 Hatchback

ఈ కొత్త స్విఫ్ట్ మైలేజీలోనూ తోపు అని చెప్పవచ్చు. పెట్రోల్ / మాన్యువల్ వేరియంట్స్‌ లీటరుకు 24.80 కిలోమీటర్ల మైలేజీని.. పెట్రోల్ / AMT వేరియంట్లు లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. ఇక మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ కిలోకు 32.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఫీచర్లు విషయానికి వస్తే 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ మోబైల్‌ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు మంచి అనుభూతిని అందిస్తాయి. సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Maruti Suzuki Swift Euro Crash Test

ఇది మార్కెట్‌లో నేరుగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. ఇటీవలే మారుతి డిజైర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించింది. అయితే కొత్త స్విఫ్ట్ కూడా ఇదే సేఫ్టీ రేటింగ్‌ని సాధిస్తుందని భావిస్తున్నారు. ఫీచర్లు, డిజైన్‌, మైలేజీ ఫ్యాక్టర్‌ని పరిగణలోకి తీసుకుంటే ఇదొక బెస్ట్‌ కారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, November 18, 2024, 17:39 [IST]
English summary
Maruti suzuki swift hatchback october 2024 sales report in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+