మిడిల్ క్లాస్ ఫ్యామిలీల BMW కారు 'మారుతి స్విఫ్ట్' కొత్త రికార్డు.. ఎక్కువగా జనాలు కొంటున్న కారు ఇదే!
మారుతి సుజుకి కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆ కారు కంపెనీ వచ్చే ప్రతీ కారు మిడిల్ క్లాస్ వాళ్లను దృష్టిలో పెట్టుకుని విడుదల చేస్తుంది. అందుకే ఈ కంపెనీ దేశంలోని అతిపెద్ద వాహన తయారీదారుగా ఎదిగింది. అతి తక్కువ ధరకే ఈ కంపెనీ కార్లను అందిస్తుంది. ముఖ్యంగా ఆ సంస్థ నుంచి నెక్సా, ఎరీనా డీలర్ షిప్‌ల ద్వారా ఆల్టో కె 10, సెలెరియో, బాలెనో, వ్యాగఆర్, ఇగ్నిస్, ఫ్రాంక్స్ మరియు జిమ్నీ వంటి కార్ల శ్రేణిని కంపెనీ విక్రయిస్తుంది. అయితే పైన తెలిపిన కార్ల కంటే ఆ సంస్థ నుంచి పవర్‌ఫుల్ హ్యాచ్‌బ్యాక్‌గా స్విఫ్ట్ ఉంది. ఈ కారుని మిడల్ క్లాస్ బెంజ్ కారుగా పిలుస్తారు. తాజాగా ఈ కారు అమ్మకాల్లో చరిత్ర సృష్టించింది.
ఈ కారు లాంచ్ లాంచ్ అయినప్పటి నుంచి ఏకంగా 30 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆల్టో తర్వాత అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డుని స్విఫ్ట్ తిరగరాసింది. ఈ హ్యాచ్‌బ్యాక్‌ని మారుతి సుజుకి 2005లో దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ కారు మధ్యతరగతి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటూ సేల్స్‌లో సత్తా చాటుతూ వస్తుంది. తాజాగా సరికొత్త రికార్డుని తిరగరాయడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

ఈ కారు 2013 వరకు 10 లక్షల యూనిట్లు, 2018 వరకు 20 లక్షల హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించడం ద్వారా కంపెనీ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షల యూనిట్లకు చేరింది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇప్పటికీ ఈ కారు రారాజుగా కొనసాగుతుంది. మార్కెట్‌లోకి విడుదలైనప్పటి నుంచి మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఇప్పటికీ స్విఫ్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండటం గమనార్హం.
తాజాగా స్విఫ్ట్ 4th జనరేషన్‌ని ప్రవేశ పెట్టింది. దీని సేల్స్ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాయి. కేవలం గత నెలలో 19,393 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. 2023 మేలో ఈ స్విఫ్ట్ 17,346 యూనిట్లను మాత్రమే సేల్ చేసింది. గత సంవత్సరం సేల్స్‌తో పోల్చితే ఇది 12 శాతం అధికం. ఇటీవల లాంచ్ చేసిన 4th జనరేషన్ కారులో అత్యాధునిక ఫీచర్లను సంస్థ జోడించింది.

ఇక కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ .6.49 లక్షల నుంచి రూ .9.60 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది. ఇది LXi, VXi, VXi (O) వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. డిజైన్ పరంగా చూస్తే ముందు మరియు వెనుక వినూత్నమైన బంపర్లు, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED DRLs, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఈ కారు 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 82 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది, ఇది లీటరుకు 24.8 నుంచి 25.72 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

కొత్త స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ పెరల్ ఆర్కిటిక్ వైట్, మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్ నోవెల్ ఆరెంజ్ వంటి విభిన్న కలర్ ఆప్షన్స్‌తో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ కారులో 5 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
అంతే కాకుండా అధునాతన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 6-ఎయిర్ బ్యాగ్స్, ABS (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), TCS (ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్), 3-పాయింట్ సీట్ బెల్ట్ ఉన్నాయి. ఈ కారు హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








