మారుతి సుజుకి స్విఫ్ట్‌ కొత్త కారు టెస్ట్‌ డ్రైవ్‌ వీడియో వైరల్‌.. డిజైన్‌ మార్పులు సహా కీలక ఫీచర్లు..!

మారుతి సుజుకి స్విఫ్ట్‌ భారత్‌ మార్కెట్‌లో అత్యధికంగా విక్రయాలు కలిగి ఉన్న కార్లలో ఒకటిగా ఉంది. తొలిసారిగా ఈ కారును 2005 సంవత్సరంలో భారత్‌ మార్కెట్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం 4వ తరం స్విఫ్ట్‌ను (Maruti Suzuki New Swift Hatchback) లాంచ్‌ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తున్నారు.

మారుతి సుజుకి ఈ కొత్త జనరేషన్‌ స్విఫ్ట్‌ కారును జపాన్‌లో ఆవిష్కరించింది. ప్రస్తుతం భారత్లో ఈ హ్యాచ్‌బ్యాక్‌ రోడ్‌టెస్ట్‌ నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ సంవత్సరంలోనే మారుతి సుజుకి స్విఫ్ట్‌ భారత్ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న స్విఫ్ట్‌ను.. 2018లో విడుదల చేశారు.

Maruti Suzuki New swift car test drive in india video goes viral

అయితే స్విఫ్ట్‌ 4వ జనరేషన్‌ (Maruti Suzuki swift) హ్యాచ్‌బ్యాక్‌లో అనేక మార్పులతో తీసుకొస్తు్న్నారు. ముందు భాగం సహా ఇంటీరియర్‌లోనూ మార్పులు చేశారు. ముందు భాగంలో గ్రిల్, L ఆకారంలో LED డే టైం రన్నింగ్‌ లైట్లు మరియు C ఆకారంలో టెయిల్‌ ల్యాంప్‌లు సహా 16 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది.

ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్‌ 13 రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ప్యూర్‌ వైట్‌, ప్రాంటియర్‌ బ్లూ, కారవాన్‌ ఐవరీ, కూల్‌ ఎల్లో, ప్లేమ్‌ ఆరేంజ్‌, ప్రీమియం సిల్వర్‌, స్టార్‌ సిల్వర్‌, సూపర్‌ బ్లాక్‌ మరియు డ్యూయల్‌ టోన్ కలర్‌ ఆప్షన్లు బర్నింగ్ రెడ్‌, ఫ్రాంటియర్‌ బ్లూ, కూల్ ఎల్లో, ప్యూర్‌ వైట్‌ వంటి రంగుల్లో లభిస్తుంది.

Maruti Suzuki swift New Gen hatchback

4వ తరం మారుతి సుజుకి స్విఫ్ట్‌ 3860mm పొడవు, 1695mm వెడల్పు, 1500mm ఎత్తు, 2450mm వీల్‌ బేస్‌ను కలిగి ఉంటుంది. కొత్త హ్యాచ్‌బ్యాక్ 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌తో వస్తుంది. ఇది ఆపిల్‌ Carplay, ఆండ్రాయిడ్‌ ఆటోను సపోర్టు చేస్తుంది. మరియు క్లైమెట్‌ కంట్రోల్‌, స్టార్ట్‌-స్పాప్‌ బటన్‌ వంటి కీలక ఫీచర్లను కలిగి ఉన్నాయి.

భద్రతా పరంగా ఈ కొత్త స్విఫ్ట్‌ ADAS - అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్‌ సిస్టమ్‌, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. మరియు ఈ కొత్త జనరేషన్‌ స్విఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ 265 లీటర్ల బూట్‌ స్పేస్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Maruti Suzuki swift new gen car trails in india

మారుతి సుజుకి స్విఫ్ట్‌ కొత్త తరం హ్యాచ్‌బ్యాక్‌ 1.2 లీటర్‌ పెట్రోల్ 3-సిలిండర్‌ ఇంజిన్‌ మరియు 1.2 లీటర్‌ 3-సిలిండర్‌ పెట్రోల్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. 80bhp శక్తి, 108Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్లు 5-స్పీ్డ్‌ మాన్యువల్‌ మరియు CVT ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

మారుతి సుజుకి 4వ తరం స్విఫ్ట్‌ కార్లను గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. మార్చి నెల నుంచి కొత్త స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రస్తుతం సగటు విక్రయాలు నెలకు 18000 యూనిట్లుగా ఉన్నాయి. కొత్త కార్లు మార్కెట్‌లోకి వచ్చాక.. విక్రయాలు మరింత జోరందుకుంటాయని సంస్థ భావిస్తోంది.

Maruti Suzuki swift New Gen hatchback

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Saturday, February 3, 2024, 12:23 [IST]
English summary
Maruti suzuki swift new gen hatchback spied video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+